ముఖ్యమైన కారు వస్తువులు

ముఖ్యమైన కారు వస్తువులు 


    కారు కొనడమే కాదు దాన్ని సరైన పద్ధతిలో మైంటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం అని మీరు తెలుసుకోవాలి. మీరు కారు కొన్న తర్వాత దాన్ని మైంటైన్ చేయడానికి కానీ లేదా మీరు సుఖంగా వాడుకోవడం కోసం గాని కొన్ని వస్తువులు అనేవి అవసరం అవుతాయి. ఈ ఆర్టికల్ ద్వారా మీ కారులో ఉపయోగపడే వస్తువుల గురించి తెలుసుకోవచ్చు.


మైక్రో ఫైబర్ క్లాత్


    ప్రతిరోజు మీరు బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా కారును శుభ్రం గా తుడవ వలసిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కార్ యొక్క పెయింట్ అంటే రంగు దెబ్బ తినకుండా సాధారణమైన క్లాత్ తో కాకుండా ఇంకా మంచిగా శుభ్రం చేయడానికి మైక్రో ఫైబర్ క్లాత్ అనేది వాడవలసిన అవసరం ఉంటుంది. అయితే చాలామంది ఆన్లైన్ లో తక్కువ ధరకే ఎక్కువ టవల్స్ వస్తున్నాయి అని కొంటున్నారు కానీ అలా చేయకూడదు. ఉదాహరణకి 200 కి 4 క్లాత్ రావడం,  ఎందుకంటే వాటి యొక్క ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ అనేది చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి మీ కార్ యొక్క పెయింట్ అనేది పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు మైక్రో ఫైబర్ క్లాత్ అనేది వాడటం మంచిది. ఒకవేళ ఆన్లైన్ లో కొనాలనుకుంటే సుమారు 300 ఉన్నటువంటి ఒక మంచి మైక్రో ఫైబర్ క్లాత్ ను తీసుకోవడం ఉచితం లేదా బయట మార్కెట్లో చూసి తీసుకోవాలి.


వాక్యూమ్ క్లీనర్ 


    మనం కారు యొక్క అద్దాలు ఎంత మూసి వేసిన కూడా కారు లోపలికి దుమ్ము మరియు ధూళి రావడం అనేది చాలా సహజం. అలాగే మన కాళ్ళకి ఉండేటటువంటి ఇసుక మరియు మనం మన కారులో పడేసేటటువంటి చెత్త ఇదంతా శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కరికి వాక్యూమ్ క్లీనర్ అనేది అవసరం ఉంటుంది. ఇది కూడా మంచి కంపెనీ నుంచి తీసుకోవడం అనేది మంచిది. మనం మన చేతులతో శుభ్రం చేయలేని సందుల్లో కూడా ఈ వాక్యూమ్ క్లీనర్ సహాయంతో శుభ్రం చేయవచ్చు. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి బాగా పరిశీలించి మంచి కంపెనీ వాక్యం క్లీనర్ ను తీసుకోవడం ఉత్తమం దీని ద్వారా ఎలాంటి సందుల్లో కూడా దుమ్ము ధూళిని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు.


టైర్ ఇన్ఫ్లేటర్


    మూడవది టైర్ ఇన్ఫ్లేటర్ వీటిలో 12 వోల్ట్ కరెంటు తో పనిచేసే ఇన్ఫ్లేటర్లు ఉంటాయి, అలాగే మాన్యువల్ ఇన్ఫ్లేటర్స్ అనేవి కూడా మనకు మార్కెట్లో లభించడం జరుగుతుంది. ఎప్పుడైనా మన కార్ టైర్లలో గాలి పోయిన అత్యవసరమైన పరిస్థితిల్లో ఇన్ఫ్లేటర్లు సహాయంతో మన కారు టైర్ లో గాలి నింపుకొని పంచర్ షాప్ వరకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఎలక్ట్రిక్ డిజిటల్ ఇన్ఫ్లేటర్ 1500 నుండి 2000 వరకు ఉంటుంది. ఇది ఎక్కడైనా ఊరికి దూరంగా మన కారు పంచర్ అయితే ఆ సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని మీరు తప్పనిసరిగా మీ కారులో ఉంచుకోవాలి.


కార్ వాషర్


    నాలుగవది కార్ వాషర్, వాస్తవానికి వీటి అవసరం అనేది మనకి అంతగా ఉండదు. మనం మాన్యువల్ గా అంటే సొంతంగా కూడా కారుని చాలా బాగా శుభ్రం కడుక్కోవచ్చు కానీ వర్షాకాలంలో ప్రతి రోజు కూడా మనం మన కారును కొనుక్కోవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం బయటకు వెళ్లి వచ్చినప్పుడు మన కారు కింది భాగంలో బురద అనేది పూర్తిగా అంటుకుని ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తే అది మన కారు ని పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేయడానికి మనం ఎప్పటికప్పుడు మన కారును జాగ్రత్తగా కడగవలసిన అవసరం ఉంటుంది. 


    కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటిలో కరెంట్ సాయంతో నడిచే వాషర్ లు ఉంటాయి అలాగే నార్మల్ గా పనిచేసే వాషర్ లు కూడా ఉంటాయి. కానీ కరెంటుతో పని చేసేది ధర కొంచెం ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కానీ అది మీకు చాలా బాగా సహాయపడుతుంది ఇది మీ కారు శుభ్రం చేసుకోవడానికి సహాయ పడటం తో పాటు మీ సమయాన్ని ఆదా చేస్తుంది అంటే వృధా కానివ్వదు అలాగే మీకు కొంతవరకు శ్రమను కూడా ఇది తగ్గిస్తుంది అంటే మీ పని కొంతవరకు సులభం అవుతుంది.


ఎయిర్ ప్యూరిఫైయర్


    ఐదవది ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రస్తుత కాలంలో కాలుష్యం అనేది అనువణువునా ఉండడం జరిగింది. అందువలన కారు అద్దాలు బాగా శుభ్రం చేసుకుని కారులో వెళుతున్న టువంటి సమయంలో అద్దాలను మూసివేసి ఫ్రెష్ ఎయిర్ ను పొందాలంటే దీని అవసరం మీకు తప్పకుండా ఉంటుంది. మార్కెట్లో వీటిలో కూడా ఎలక్ట్రిక్ ప్యూరిఫైయర్ అనేవి ఉంటాయి అలాగే నాన్  ఎలక్ట్రిక్ ప్యూరిఫైయర్ అనేది కూడా ఉండడం జరిగింది. అయితే నాన్ ఎలక్ట్రికల్ ప్యూరిఫయర్ అనేది కొంచెం తక్కువ ధర లో లభించడం జరుగుతుంది. అంటే సుమారు గా 500 రూపాయల లో మార్కెట్లో లభిస్తుంది కాబట్టి మీరు దీన్ని కచ్చితంగా వాడాలి. వీటివలన కారు లో ఉన్నటువంటి గాలి అనేది శుభ్రం అవ్వడంతో పాటు తేమను కూడా పీల్చి వేయడం జరుగుతుంది. అయితే నాన్ ఎలక్ట్రిక్ ప్యూరిఫైయర్ అనేది చాలా కాలం వాడుకోవచ్చు అలాగే, కొన్ని రోజులు వాడిన తర్వాత అంటే దాని ప్రభావం తగ్గినట్టు మీకు అనిపిస్తే అప్పుడు ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో దానిని కాసేపు ఎండ లో  ఉంచి మళ్ళీ దాన్ని కొత్త దానిలా వాడుకోవచ్చు.


360 డిగ్రీ స్పాట్ మిర్రర్


    ఆరవది 360 డిగ్రీ స్పాట్ మిర్రర్, డ్రైవింగ్ చేసేటప్పుడు ఐ ఆర్ వి ఎం అలాగే  ఓ ఆర్ వి ఎం లో కూడా కనిపించని బ్లైండ్ స్పాట్ అనేది కూడా కనిపించడానికి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 360 డిగ్రీస్ వరకు తిప్పుకోవచ్చు కాబట్టి రివర్స్ డ్రైవింగ్ చేసే సమయంలో కూడా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరి కారులో అయితే బ్లూటూత్ ట్రాన్స్లేటర్ ఉండదో వారికి ఇది చాలా అవసరం ఉంటుంది. ఒకవేళ మీ కారులో బ్లూటూత్ ట్రాన్స్మిటర్ అనేది లేకపోతే ఈ వైర్లెస్ బ్లూటూత్ ట్రాన్స్లేటర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా మరో రెండు ఫోన్లు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకుని అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. 


    అలాగే ఇది ఫస్ట్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయడం విశేషం కాబట్టి మీరు మీ మొబైల్ ని చాలా సులభంగా అలాగే తక్కువ సమయంలో ఛార్జ్ చేయడానికి వీలవుతుంది. ఇంకా పెన్ డ్రైవ్ అనేది పెట్టుకొని మీరు పాటలు కూడా వినే అవకాశం కల్పిస్తుంది. అదే విధంగా హాట్ స్పాట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరి కారులో అయితే బ్లూటూత్ ఆప్షన్ అనేది ఉండదు వారికి ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది, మీ అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది మరియు మీకు నచ్చిన విధంగా ఉంటుంది.


ఏసీ వెంట్ క్లీనర్


    ఎనిమిదవది ఏసీ వెంట్ క్లీనర్ మనం కారులో కూర్చుని ఏసీ వేయగానే మనకు ఒక్కోసారి బాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనకు చాలా అసౌకర్యంగా ఉండటం తో పాటు మనం ప్రయాణం అనేది కూడా సాఫీగా సాగదు. అలాగని ఏసీ ఆపివేయడం కూడా కుదరదు. అందుకే మనం ఇంటి దగ్గర 300 నుంచి 5500 లోపు ఏసీ క్లీనర్ ఫోన్ అనేది దొరుకుతుంది దాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏసీ వెంట్ క్లీనర్ అనే దాన్ని ఏసీ వచ్చేటటువంటి హోల్స్ లో సూటిగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత అన్ని డోర్ లను పూర్తిగా తెరిచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్ప్రే చేసిన అన్ని హోల్స్ ద్వారా ఏసీ ఎయిర్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఇలా  చేస్తే మీకు కారులో దుర్వాసన అనేటటువంటిది రాదు కాబట్టి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.




కొత్తది పాతది