మారుతీ సుజుకీ భారత మార్కెట్‌ను ఎలా స్వాధీనం చేసుకుంది

మారుతీ సుజుకీ భారత మార్కెట్‌ను ఎలా స్వాధీనం చేసుకుంది


    1980 సమయంలో ప్రతి సామాన్యుడు కూడా కారులో తిరగాలి అనే ఆలోచన తో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మారుతి కంపెనీ ని స్థాపించడం జరిగింది. అయితే జపాన్ కి చెందిన సుజుకి కంపెనీ మారుతి కంపెనీ తో కారు తయారు చేయడానికి మారుతి కంపెనీ లో 26% వాటాను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసి ఇండియన్ గవర్నమెంట్ తో వాళ్ల బిజినెస్ మొదలు పెట్టింది. అయితే మొదట్లో మారుతి కంపెనీ లో 74% వాటా భారతదేశాన్ని ఉండేది. అలాగే ఈ కంపెనీ తయారు చేసే కార్ల మీద కూడా మారుతి అని పేరు వేసి అమ్మేవారు. కానీ 2002లో మారుతి కార్స్ మీద మారుతి లోగో కి బదులుగా సుజుకి లోగో వచ్చేసింది. ఈ కంపెనీ లో అత్యధిక వాటా కూడా భారతదేశం నుండి జపాన్ కంపెనీ అయినా సుజుకి కి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా ఎలా జరిగింది భారతదేశంలో ని మంచి స్థానంలో ఉన్న మారుతి సుజుకి కంపెనీ యొక్క షేర్లను భారతదేశం ఎందుకు విక్రయించడం జరిగింది. ఇప్పటికీ కూడా టాటా ఇంకా మహేంద్ర లాంటి కంపెనీలను ఓడిస్తూ జపాన్ కు చెందిన మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉండడం వెనుక వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి. మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.


మారుతి లిమిటెడ్ (పీపుల్స్ కార్) కంపెనీ స్థాపించడం 


    భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రెండు ప్రసిద్ధి చెందిన కంపెనీలు ఉండేవి. అదే హిందుస్తాన్ మోటార్స్ మరియు ప్రీమియర్ ఆటోమొబైల్స్. అయితే ఈ రెండు కంపెనీలు కూడా ఇండియా కంపెనీ లే కానీ గవర్నమెంట్ కంపెనీ లు కాదు. ఈ రెండు కంపెనీల కార్లు కూడా సామాన్యులు కొనుక్కోవడానికి అందుబాటులో ఉండేవి కాదు. అంటే అప్పట్లో కారు అనేది కేవలం ధనవంతులకు మాత్రమే సొంతమైన వస్తువుగా భావించేవారు. 1971లో ఇందిరాగాంధీ గారు భారత దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె కొడుకు అయినా సంజయ్ గాంధీ గారికి కార్ల మీద చాలా ఆసక్తి ఉండేది. ఆయన ఒక కారు తయారు చేయడానికి అవసరమైన శిక్షణ మొత్తాన్ని తీసుకొని భారతదేశంలో ఒక సామాన్యుడు కూడా కొనగలిగే లా ఒక తక్కువ ధరలో ఒక కారు తయారు చేయాలనుకుంటున్నట్టు సంజీవ్ గాంధీ ఇందిరా గాంధీ గారికి చెప్పారు. అలాగే ఈ ఆలోచన నుండి పుట్టిన కంపెనీ ఏ మారుతి సుజుకి .1971 లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ఆవిడ కొడుకైన సంజీవ్ గాంధీ గారి కల కోసం “ పీపుల్స్ కార్ ” అనే ఒక కంపెనీ పెట్టి ఆ కారు తయారు చేయడానికి మారుతి లిమిటెడ్ అనే ఒక కంపెనీ ని స్థాపించడం జరిగింది.


మారుతి లిమిటెడ్ కంపెనీ  విఫలం అవ్వడం

 

    సంజయ్ గాంధీ గారిని ఆ కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్ గా చేశారు. సంజయ్ గాంధీ కొన్ని కార్లను తయారు చేసినప్పటికీ అవేవీ కూడా విజయం పొందలేదు. చివరగా ఈ కంపెనీ క అనుకున్నట్టు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఒక కారు ను తయారు చేయలేకపోయారు. అయితే దీనికి కారణం ఏంటంటే అప్పటికి ఇండియా లో తక్కువ ధరకే కారు తయారు చేసే అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఇక ఈ పీపుల్స్ కార్ అనే కంపెనీ ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో విదేశీ కంపెనీలు అయినా వోక్స్ వాగెన్ అలాగే నిస్సాన్ కంపెనీలతో చేతులు కలిపారు కానీ అది కూడా ఈ కంపెనీ కి అనుకూలంగా జరగలేదు. ఇక 1977లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పవర్  కోల్పోవడం అలాగే 1980లో సంజయ్ సంజయ్ గాంధీ గారు విమాన ప్రమాదంలో చనిపోవడం తో పాటు ఇలా ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మారుతి లిమిటెడ్ అనే కంపెనీ మూతపడి పీపుల్స్ కార్ అనే ప్రాజెక్టు పక్కన పడిపోయింది.కానీ ఇక్కడితో కథ ముగిసిపోలేదు.


పీపుల్స్ కార్ కంపెనీ ని పునరావృతం చేయడం


    ఈ పీపుల్స్ కారు అనేది సంజయ్ గాంధీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం వల్ల ఇంద్ర గాంధీ గారు తన కొడుకు ఆశయాన్ని ఎలాగైనా నెరవేర్చాలని చాలా బలంగా నిర్ణయించుకున్నారు. 1980లో మళ్లీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత పీపుల్స్ కార్ అనే ప్రాజెక్టును మళ్ళీ మొదలుపెట్టారు. కంపెనీ విఫలం అవడం కావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి నెహ్రూ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి తో మాట్లాడారు ఆయన ఎవరో కాదు అరుణ్ నెహ్రూ. అయితే అరుణ్ నెహ్రూ గారు ఇచ్చిన సలహా ఏంటంటే మారుతి ప్రాజెక్టు ను పునరావృతం చేయడం అనేది అసాధ్యం కాదు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ప్రకారం కేవలం ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది చాలా కష్టం, కాబట్టి ఏదైనా విదేశీ కంపెనీ తో కలిసి ఈ ప్రాజెక్టుని సాధ్యం చేయొచ్చు అని అయినా సలహా ఇచ్చారు. ఈ సలహా విన్న తర్వాత ఇందిరాగాంధీ గారు ఒక టీంను తయారు చేసే ప్రపంచంలో ఉన్న అన్ని ఆటోమొబైల్ కంపెనీ ల తో డీల్ మాట్లాడడం కోసం పంపించారు.


సుజుకి కంపెనీ మారుతి కంపెనీ తో డీల్ అంగీకరించడం
 

    చివరగా ఈ డీల్ కు ఒప్పుకున్న కంపెనీ జపాన్ కు చెందిన సుజుకి కంపెనీ సుజుకి మోటార్ కార్పొరేషన్. ఇక చివరి ఆఖరికి 1981లో ఇండియన్ గవర్నమెంట్ మారుతి సుజుకి మోటార్స్ తో కలిసి పని చేయడానికి ఒప్పుకుంది. అలాగే ఒక కొత్త కంపెనీ మొదలు పెట్టింది. అదే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీ లో 74% వాటా భారతదేశం చేతిలో ఉండగా, 26% వాటా సుజుకి చేతిలో ఉండేది. మొదట్లో జపాన్ కంపెనీ వారి దేశంలో కార్లు తయారు చేసి, ఆ కార్లు ఇండియా కి ఇంపోర్ట్ చేసి ఇండియాలో సుజుకి బ్రాండ్ పేరు తీసేసి అక్కడ మారుతి అనే బ్రాండ్ ను పెట్టి అమ్మేవారు. ఇలా కొన్ని రోజులు సాగింది, కొన్ని రోజుల తర్వాత ఇండియన్ గవర్నమెంట్ హర్యానా లో ఉన్న గుర్గాన్ అనే ప్రదేశంలో మారుతి ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఆ ప్లాంట్ నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చిన కారు మారుతి 800. ఈ కారును ఇండియన్ గవర్నమెంట్ కేవలం 50 వేల కు మాత్రమే లాంచ్ చేసింది. అయితే ఇది ఇక ఇండియాలో చాలా పెద్ద విజయాన్ని సాధించింది.


మారుతి 800 ఘనవిజయం మరియు సుజుకి కంపెనీ తమ వాటాను పెంచుకోవడం


    దీని ద్వారా మారుతి కంపెనీ భారతదేశంలో గట్టి విజయాన్ని సాధించింది. ఇక ఇదంతా గమనించిన సుజుకి కంపెనీ భారతదేశంలో పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలని ఆలోచన తో మెల్లిమెల్లిగా వారి షేరును పెంచుతూ వచ్చారు. 1982 లో 26% వాటా ఉన్న సుజుకి కంపెనీ 1988 వచ్చేసరికి ఆ కంపెనీలో వాటా 40 శాతానికి పెంచుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు తెలియాలి అదేంటంటే 1991 ముందున్న ఏ విదేశీ కంపెనీ కూడా 50% వాటా అనేది కలిగి ఉండకూడదు. కానీ 1991 లో పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశ ఆర్థిక సంస్థ లో కొన్ని మార్పులు చేస్తూ ఈ చట్టాన్ని తొలగించడం జరిగింది. ఇక సుజుకి కంపెనీ కి అవకాశం రావడంతో 1991లో తమ వాటాను 40 శాతం నుంచి 50% పెంచుకుంది. దీనివల్ల సుజుకి కంపెనీ మారుతి కంపెనీ లో గవర్నమెంట్ తో పాటు సమానమైన వాటా సొంతం చేసుకుంది. 


“మారుతి ఉద్యోగ్ లిమిటెడ్” నుండి “మారుతి సుజుకి” గా మారడం


    ఇక ఇలా 50% వాటా ఉండటం వల్ల 1991లో ఈ కంపెనీ పేరు “మారుతి ఉద్యోగ్ లిమిటెడ్” నుండి “మారుతి సుజుకి” గా మారడం జరిగింది. ఇక 1991లో విదేశీ కంపెనీలు మన భారతదేశంలో తమ బిజినెస్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన తర్వాత, విదేశాల నుంచి చాలా కంపెనీలు మన భారతదేశానికి వచ్చి తమ బిజినెస్ ను మొదలుపెట్టాయి. టయోటా, హుండాయ్, హోండా, కంపెనీలు అన్నీ మన భారతదేశానికి వచ్చారు. అప్పటివరకు ఇండియాలో ఒకే ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ గా ఉన్న మారుతి సుజుకి కంపెనీ కి ఇప్పుడు పోటీ రావడం మొదలైంది. ఓడించడానికి మారుతి సుజుకి కొన్ని అంశాలు పాటించారు. 


ముఖ్యమైన అంశాలు….


  • అందుబాటు ధరలు

  • తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కలిగి ఉండటం

  • ప్రజలకు ఇష్టమైన కార్ మోడల్ ను తయారు చేయడం ఉదాహరణకు హచ్ బ్యాక్ కార్లు

  • ప్రాజెక్ట్ నిక్సా

  • ఆకర్షణీయమైన డిజైన్

  • మంచి మైలేజ్ ఇవ్వడం


    అయితే 2002 సంవత్సరంలో గవర్నమెంట్ మారుతి కంపెనీ లో తమ వాటా లో కొంతవరకు సుజుకి కంపెనీ కి అమ్మడం జరిగింది. ఇలా సుజుకి కంపెనీ 54% వాటా సొంతం చేసుకున్న తర్వాత వారికి ఎక్కువ వాటా ఉండటం వల్ల వారు ఆ కంపెనీ కి యజమాని గా మారారు. ఇక దాని తర్వాత మొదటిసారిగా మారుతి లోగో ను సుజుకి లోగో తో మార్చడం జరిగింది. ఇక చివరిగా 2010 వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ మారుతి సుజుకి లో తమ వాటాను పూర్తిగా సుజుకి కంపెనీ కి అమ్మడం జరిగింది. అయితే అప్పటికే 54% వాటా కలిగి ఉన్న సుజుకి కంపెనీ 56% వాటాకు పెంచుకుంది మిగిలిన వాటా షేర్ల పరంగా పెట్టుబడిదారుల దగ్గర ఉంది.


కొత్తది పాతది