హ్యుందాయ్ మోటార్స్: చుంగ్ జు-యుంగ్ పోరాటం మరియు విజయ గాథ
హుండాయ్ ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే భారత రోడ్ల పైన మీకు ఎక్కువగా కనిపించే కారు బ్రాండ్ల లో హుండాయ్ ఒకటి. సౌత్ కొరియా లో తినడానికి తిండి ఉండటానికి ఇల్లు లేని ఒక పదహారేళ్ల కుర్రాడు పొట్టకూటి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి డబ్బు సంపాదించడానికి వ్యవసాయం, కూలి పని, కన్స్ట్రక్షన్ వర్కర్, డెలివరీ బాయ్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. అలా సంపాదించి దాచుకున్న డబ్బు తో జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి బిజినెస్ మొదలు పెట్టిన ప్రతిసారి ఆయనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి, అయినా కూడా ఆయన ఆయన ఆశయాన్ని వదిలిపెట్టలేదు. విఫలమైన ప్రతిసారి అందులో నుంచి కొత్త విషయాన్ని నేర్చుకొని, చివరకు ఆయన స్థాపించిన కంపెనీ ఈరోజు సౌత్ కొరియా లో మాత్రమే కాదు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ లో ఒకటి అదే హుండాయ్. అయితే మీ అందరికీ హుండాయ్ ఒక కార్ కంపెనీ లా మాత్రమే తెలుసు, కానీ దానికి ఇంకా చాలా రకమైన బిజినెస్ లు ఉన్నాయి. జీవితంలో ఓటమి తప్ప ఇంకేమీ చూడండి చుంగ్ జు-యుంగ్ అసలు ఆశయాన్ని వదలకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించ గలిగారు. ఇక దాని వెనుక మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
చుంగ్ జు-యుంగ్
ఇంటి నుంచి పారిపోవడం
బియ్యం వ్యాపార దుకాణానికి యజమాని అయ్యాడు
కష్టపడి నిర్మించుకున్న వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది
కార్ మెకానిక్ షెడ్ ప్రారంభించడం
రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం
హుండాయ్ ఆటో సర్వీస్ నుంచి హ్యుండాయ్ మోటార్స్ గా ఎదగడం
1915లో కొరియా లో ఉన్న టోంగ్చోన్ అనే గ్రామంలో చుంగ్ జు-యుంగ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎలాంటి కుటుంబంలో జన్మించారంటే ఆయన కుటుంబంలో ఉన్న ఎనిమిది మంది రోజుకు 17 గంటలపాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తే వారికి వచ్చే డబ్బు కేవలం ఒక్క పూట భోజనానికి మాత్రమే సరిపోయేది. దీనిబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు వారు ఎంత పేదరికంలో జన్మించారని. ఇక చిన్నప్పటి నుంచి చుంగ్ జు-యుంగ్ గారికి బాగా చదువుకొని ఉపాధ్యాయుడిగా అవ్వాలని కోరిక ఉండేది. కానీ ఆయన ఆర్థిక పరిస్థితి బాగోక పోవడం వల్ల చిన్న వయసు నుంచే పనికి వెళ్లడం మొదలుపెట్టారు. అయితే ఎంత కష్టపడినా ఎన్ని పనులు చేసిన వారికి చాలా తక్కువ కూలి రావడం వల్ల పల్లెటూరి లో వారి బతుకులు బాగుపడేది కావు. ఇక ఎలాగైనా తన కుటుంబాన్ని ఆ పెద్దరికం లో నుండి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
ఆయనకు ఒకటి అర్థం అయింది తను పుట్టిన గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ తన జీవితం మారదు, ఇది గమనించిన ఆయన ఎలాగైనా పట్టణానికి వెళ్లి ఏదో ఒక పనిచేసే ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇల్లు వదిలి వెళ్లడానికి ఆయన తండ్రి ఆయనకు అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే అప్పటికి ఆయన వయసు 16 ఏళ్లు మాత్రమే. చివరగా ఒక రోజు తన స్నేహితుడిని తీసుకొని ఎవరికి తెలియకుండా ఇంటి నుంచి పారిపోయారు. అలా కొన్ని కిలోమీటర్ల పాటు నడుస్తూ వెళ్లాక కోవన్ అనే ఒక చిన్న నగరం కనిపించింది, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ గా చేరారు. అలా కొన్ని రోజుల పాటు పని చేసిన తర్వాత ఒకరోజు ఆయన తండ్రి ఆయనను బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే సొంతంగా సంపాదించి తన కాళ్ళ మీద తాను నిలబడటం అలవాటు చేసుకున్న చుంగ్ జు-యుంగ్ గారికి మళ్లీ ఆ గ్రామంలో వ్యవసాయ కూలీలగా పని చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ అది విఫలం అయింది.
చివరికి ఆయనకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయనకు ఆయన ఇల్లు వదిలి పెట్టి బయటకు వెళ్లిపోయారు ఈసారి ఆయన తండ్రి కూడా ఆయనని ఆపలేరు. ఆయన సౌత్ కొరియా లో ఉన్న సియోల్ అనే నగరానికి వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు కన్స్ట్రక్షన్ వర్కర్ గా అలాగే ఒక ఫ్యాక్టరీ లో లేబర్ గా పని చేశారు. ఇక దాని తర్వాత ఒక స్టోర్ లో డెలివరీ బాయ్ గా చేరారు. ఆ స్టోర్ లో ఆయన కస్టమర్ తో మాట్లాడే విధానాన్ని ఇంకా ఆయన అమ్మే విధానాన్ని చూసిన ఆ స్టోర్ యజమాని చుంగ్ జు-యుంగ్ గారిని ఒక డెలివరీ బాయ్ నుంచి అకౌంటెంట్ గా మార్చారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ స్టోర్ లో నమ్మకం గా పనిచేసిన తర్వాత ఆ స్టోర్ యజమాని చనిపోయే సమయానికి దాన్ని చుంగ్ జు-యుంగ్ గారికి అమ్మడం జరిగింది. ఇలా పదహారేళ్ళ వయసులో కూలివాడిగా మొదలైన ఆయన జీవితం ఎన్నో ఏళ్ళు కష్టపడిన తర్వాత ఒక చిన్న రిటైల్ స్టోర్ కి యజమాని అయ్యాడు.
ఇక బిజినెస్ అంతా ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన కస్టమర్ల అందరిని ఆకట్టుకుని ఆయన వైపు తిప్పుకొని ఆ పట్టణంలోనే మంచి స్థితికి తీసుకు వచ్చారు. కానీ ఇది ఎన్నో రోజులు కొనసాగలేదు. 1930 సమయంలో కొరియా జపాన్ వారి ఆధీనంలో ఉండేది, కాబట్టి 1937లో జపాన్ కి చైనా కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న జపాన్ సైనికులకు కావలసిన ఆహార పదార్థాలు అన్ని సరఫరా చేయడానికి జపాన్ గవర్నమెంట్ కొరియా లో బియ్యం బిజినెస్ చేస్తున్న అందరి స్టోర్లను ఆక్రమించుకుంది. దీనివల్ల ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఇక మళ్ళీ ఆయన జీవితం పదహారేళ్ల వయసులో ఆయన ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చి వచ్చేసారు.
కానీ నిరాశ పడకుండా కొన్ని రోజుల పాటు బాగా ఆలోచించి మళ్లీ 1940లో కొంత డబ్బును లోన్ గా తీసుకుని ఒక కారు మెకానిక్ షెడ్ ను మొదలుపెట్టారు. అయితే ఆ బిజినెస్ చాలా బాగా నడిచింది కానీ అనుకోకుండా ఒకరోజు ఆ మెకానిక్ షెడ్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి. తన బిజినెస్ అంతా బూడిద అయిపోయింది, కేవలం ఆయన డబ్బు మాత్రమే కాదు రిపేర్ కోసం తన గ్యారేజ్ కు వచ్చిన కార్లు కూడా కాలిపోవడం వల్ల కస్టమర్లకు కూడా డబ్బులు చెల్లించవలసి వచ్చింది. అలాంటి సమయంలో కూడా ఆయన తన బిజినెస్ ను వదిలిపెట్టకుండా బ్యాంకులో మళ్లీ లోన్ తీసుకొని కస్టమర్లకు డబ్బులు చెల్లించారు. మిగిలిన డబ్బు తో కాలిపోయిన తన మెకానిక్ షెడ్ ని మళ్లీ మొదలు పెట్టారు.
కానీ ఈసారి ముందు లా కాకుండా మార్కెట్లో ఆటోమొబైల్ బిజినెస్ లో ఉన్న ఒక లోపాన్ని ఆయన కనుగొన్నారు. ఎలా అంటే మార్కెట్లో ఉన్న చాలా మెకానిక్ షెడ్ లో కూడా ఒక కారును రిపేర్ చేయడానికి దాదాపు పదిమంది 15 రోజుల సమయాన్ని తీసుకునేవారు, దీనివల్ల కస్టమర్లు చాలా ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన చుంగ్ జు-యుంగ్ కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మూలించడానికి ఎక్కువ మంది వర్కర్లను పనిలో పెట్టుకుని కేవలం రెండు మూడు రోజుల్లోనే కారును రిపేర్ చేసి తన కస్టమర్లకు డెలివరీ ఇచ్చేవారు. దీనివల్ల మార్కెట్ లో ఆయనకు ఆయన బిజినెస్ కి మంచి పేరు వచ్చింది. మరోవైపు మంచి లాభాలు కూడా వచ్చాయి.
కానీ ఇది కూడా ఎన్నో రోజులు కొనసాగ లేదు 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కూడా పాల్గొంది. దీంతో ఈసారి జపాన్ కి కావలసిన యుద్ధ సామాగ్రి తయారు చేయడానికి కొరియా దేశంలో ఉన్న ఫ్యాక్టరీలను అలాగే మెకానిక్ షెడ్లను ఆక్రమించుకొని వాటిని యుద్ధ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీ గా మార్చేశారు. ఇక దీనివల్ల ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన వ్యాపారం మళ్లీ కుప్పకూలిపోయింది. చివరికి మళ్ళీ ఆయన ఏ పల్లెటూర్లో ఎలాంటి పరిస్థితుల్లో మొదలయ్యారో అక్కడికి వచ్చి ఆగిపోయారు. సాధారణంగా ఇది ఒక మనిషిని మానసికంగా కుదిపేసి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీని కారణంగా చాలా మంది వ్యక్తులు తమ జీవితాల్లో ఒక స్థాయి నుంచి కింద పడినప్పుడు మళ్లీ లేవలేరు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా లేచి మళ్లీ ప్రయత్నించాడంటే వాళ్ళు కచ్చితంగా చరిత్ర సృష్టిస్తారు.
చుంగ్ జు-యుంగ్ తను ఎన్ని వ్యాపారాలు కోల్పోయిన ఎంత డబ్బు నష్టపోయిన తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఆయన కోల్పోలేదు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చుంగ్ జు-యుంగ్ మళ్లీ పట్టణానికి వెళ్లి తన మెకానిక్ షెడ్ ని మళ్లీ తెరిచి మొదలుపెట్టారు. అయితే బిజినెస్ పాతదే కానీ ఈసారి దాని పేరు మాత్రం కొత్తది అదే హుండాయ్ ఆటో సర్వీస్ ఆయనకు ఉన్న అనుభవంతో బిజినెస్ బాగా నడిపించారు. తర్వాత కాలంలో ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలుపెట్టి అమెరికా దేశం తో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఆ అనుబంధాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎన్నో వ్యాపారాలు చేసి హ్యుండాయ్ మోటార్స్ ను స్థాపించి మంచి విజయాన్ని సాధించారు.