అంబాసిడర్ కారు పతనానికి ప్రధాన కారణాలు

  అంబాసిడర్ కారు పతనానికి ప్రధాన కారణాలు







telugucarinfo.tech

 












ఈ కాలానికి తగ్గట్టుగా మారకపోతే మనం వెనకబడిపోతాం అనేది అక్షర సత్యం. ముఖ్యంగా బిజినెస్‌లో ఎందుకంటే బిజినెస్ లో ఎప్పుడు కూడా  మెరుగుపరిచే విధంగా ఉండాలి. అలా మెరుగు పర్చకపోవడం వల్లనే ఎంతో పేరు సాధించిన చాలా కంపెనీలు సైతం మూతపడ్డాయి. ఇందుకు ఉదాహరణగా ప్రపంచంలోనే నమ్మదగిన మొబైల్ బ్రాండ్ గా నిలిచిన నోకియా అలాగే ఇండియా రోడ్లపై ఒకప్పుడు రారాజుగా నిలిచిన అంబాసిడర్  కార్లనే ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక కార్ల విషయానికే వస్తే ప్రజలు కారులో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు.

 

    అధునిక సాంకేతికతతో కొత్త ఫీచర్స్‌తో ఎక్కువ భద్రతతో ఉండే కార్లనే కొనడానికి వాడడానికి ఆశపడుతుంటారు. అయితే ఒకప్పుడు కారంటే అంబాసిడర్ కారే అనేలా ఉన్న, ఈ కార్ ఇప్పుడు కనుమరుగైంది. ఇప్పుడు తరనికి ఈ కారు గురించి కూడా తెలియదు. ఒకవేళ చూపించిన కార్లు ఇలా కూడా ఉంటాయా? ఇది విలాసం మైన కారా అని అడుగుతారు. ఒకప్పుడు వీఐపీలు ఎంతగానో ఇష్టపడే కార్, ఇప్పుడు ఎందుకని కనీసం టాక్సీల కూడా వాడట్లే. ఎందుకనో రోడ్లపై కనిపించడం లేదు. అసలు ఈ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? దీని పతనానికి కారణాలేంటి? భవిష్యత్తులో  రాబోతున్నాయా? ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. 

 

    1990 వరకు భారతదేశం రోడ్లపై రారాజు గా నిలిచిన కార్ అంబాసిడర్ కారు. పేరుకు తగ్గట్టుగానే ఇండియన్ రోడ్ అఫ్ ద కింగ్గా ఈ కారు ఒక వెలుగు వెలిగింది. ఇండియా లో ఒకప్పుడు రోడ్లపై అంబాసిడర్ కార్లు తప్ప మరే కార్లు పెద్దగా కనిపించేవి కావు. ఒకవేళ ఏ కొత్త కంపెనీ కారు వచ్చిన కూడా దాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ఎందుకంటే అప్పట్లో కారంటే అంబాసిడర్ కార్. అంబాసిడర్ కారు అంటే ఒక్క నమ్మకమైన కార్ గుర్తుగా భావించేవారు. అలాంటిది కాలం మారింది సాంకేతికత మారింది, పరిస్థితులు మారాయి, ప్రజల ఇష్టాయిష్టాలు మరియి . కానీ దానికి తగ్గట్టుగా ఈ కార్లులో మాతరం ఎలాంటి మార్పు రాకపోవడంతో నేడు ఈ కార్ మాత్రమే కాదు ఈ కార్  కంపెనీ సైతం కనుమరుగైపోయింది.

    అసలు ఈ అంబాసిడర్ కారు ప్రస్థానం ఎలా మొదలైంది అనే విషయానికి వస్తే స్వాతంత్రానికి కేవలం ఐదు సంవత్సరాల ముందు అనగా 1942 లో తొలిసారి హిందుస్తాన్ మోటార్స్ ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. అప్పటి బ్రిటీష్ మోటార్ కార్పొరేషన్లో భాగమైన మోరిస్ కంపెనీ మరియు మన భారతదేశంలోని బసంత్‌కుమార్ బిర్లా కుటుంబం కలిసిమనదేశంలోకి హిందుస్తాన్ మోటర్స్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. మొదట ఈ కంపెనీ గుజరాత్లోని పోర్ట్ ఒఖ లోని తన మొదటి ఫ్యాక్టరీ స్థాపించింది. కానీ ఆ తర్వాత స్వాతంత్య్రం అనంతరం 1948 లో కంపెనీ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపరాకు మార్చారు. ఇక ఇక్కడి నుంచే భారతదేశం మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆటో మొబైల్ ప్లాంట్ కార్యక్రమాలను కొనసాగించింది.

    అందులో భాగంగానే మొదటగా ఐకానిక్ కార్ మోరిస్ టెన్ అన్నే కార్ని ది హిందూస్థాన్ టెన్ అనే పేరుతో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారో.  ఇక 1950 సంవత్సరాల మధ్య కాలంలో హిందుస్తాన్ మోటార్స్ అధినేత బిఎం బిర్లా అంబాసిడర్ బ్రాండ్ కార్లను అప్ గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయాలి అనికున్నారు. తొలుత మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ టూ కార్ ఆధారంగా హిందూస్తాన్ లాండ్ మాస్టర్ ను తయారు చేశారు.


    తర్వాత కాలంలో మోరిస్ ఆక్స్ ఫర్డ్ సిరీస్ త్రి  హక్కులను సొంతం చేసుకున్నారు.ఈ కారు ప్రేరణతోనే అంబాసిడర్ కారు తయారీకి పూనుకున్నారు. ఈ కారు ఒక సెడాన్ మోడల్ దాని ఫ్యూచర్ లో భాగంగా త్రి  బాక్స్ ఆకృతీకరణతో కలిగి ఉండి. హెడ్‌లైన్స్ చూడ్డానికి కళ్ల లాగా  ఉండేవి.ఇంజిన్ కి అలాగే స్టోరేజ్  కి సెపరేట్ కంపార్ట్మెంట్ కలిగి ఉండి ఎంతో ఆకర్షణీయంగా అప్పట్లోనే ఈ కారును డిజైన్ చేశారు. అలాగే చివరికి వేరు వేరు రంగులు తో కొనుగోలుదారులకు ఈ కారును అందుబాటులోకి తెచ్చారు. దాంతో జనాలకు విపరీతంగా నచ్చేసి కొనడం ప్రారంభించారు.ముఖ్యంగా ఎక్కువ తెలుపు రంగు కార్స్ అనేవి రోడ్డు మీద చాలా ఆధిపత్యం కార్గ  కనిపించేది.

    దాంతో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పొలిటిషన్స్ విల్లు అంతకుడా తెలుపు రంగు అంబాసిడర్ కారునే ఇష్టపడి మరి కొనుక్కునేవారు. మొదట్లో అంబాసిడర్ కార్లు అనేవి సైడ్ వాళ్ళు ఇంజిన్‌తో వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా,కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా అదే కారును తర్వాత ఓవర్ హెడ్ వాల్వ్ ఇంజిన్గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత వినూత్నంగా మరియు యజమానులకి సులభంగా ఉండేందుకు కార్లను మోనోకాక్ గా మార్చారు.అంతే  కాకుండా అప్పట్లో బిర్లా కుటుంబంపై రాజకీయ ప్రభావము ఎక్కువగా ఉండేది. అందుకే స్వదేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రోత్సహించేలా 1950 నాటి ప్రభుత్వ విధానాలను అనుసరించి తయారుచేసిన కార్లలో అంబాసిడర్ కారు అనేది సర్కార్ గాడిగా  గుర్తింపు పొంది చాలా ప్రత్యేకంగా  నిలిచింది.

    దాంతో పోటీదార్లతో పోలిస్తే అంబాసిడర్ కార్ల వేరియంట్లు ప్రీమియర్ పద్మిని స్టాండర్టన్ కార్ల పరిమాణంగా,విశాలంగా, రఫ్గ పోవడం వల్ల ఇండియన్ రోడ్ల రారాజుగా  దశాబ్దాల పాటు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది.అప్పట్లో ఈ కార్లనుప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు రాజకీయ నేతలు,ప్రభుత్వ ఆధికారులు, సంపన్నులు ఇలా ఒకటేంటి పై స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఈ కార్లను ఉపయోగించడంతో ఈ అంబాసిడర్ కార్ అప్పటి మార్కెట్ ను శాసించింది. దాంతో ఈ అంబాసిడర్ కారును ఎంబీ అన్ని అప్పట్లో ముద్దుగా పిలుచుకునేవారు.

    ఇక అడపాదడప విదేశీ కంపెనీ కార్ల కొత్త బ్రాండ్లు ఇండియన్ మార్కెట్‌లోకి వస్తున్నా సరే వాటిని భారతీయులు అంతగా పట్టించుకునేవారు కాదు. కేవలం అంబాసిడర్ కారునే రాయల్ సింబల్ గా మార్చుకుని వాడుకునేవారు. దాంతో ఈ కారు ది కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్గా మారిపోయింది. కానీ రాను రాను మన దేశంలో ఇతర కంపెనీల స్వదేశీ కార్ల ఉత్పత్తి పెరగడం, వాటి ధర తక్కువగా ఉండటం, సరికొత్త సౌకర్యాలు కూడా  కొత్తగా ఉండటంతో అంబాసిడర్ కార్ల పతనం అనేది అప్పుడే ప్రారంభం అయింది. అది ఎలా జరిగిందో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    ఏళ్లు గడుస్తున్నా కూడా అంబాసిడర్ కార్ల తయారీలో పెద్దగా మార్పు లేదు. ప్రకటనలు  లేవు.ప్రమోషన్స్ చేసేవారు కాదు. మార్కెట్ డైనమిక్స్ లో  దాని స్థానాన్ని నిలుపుకోవడానికి దాని పేరు సరిపోతుంది అని హిందూస్థాన్ మోటార్స్ కంపెనీ పూర్తిగా భావించింది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. అంబాసిడర్ కారు 30 ఏళ్ల పాటు ఒక ఐకానిక్ కార్డ్ స్టేటస్ సింబల్‌గా మారింది. దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. కానీ 1980 వచ్చేసరికి మిగతా కార్లతో పోల్చినప్పుడు ధర ఎక్కువ మైలేజ్ తక్కువ కావడంతో పాటు అదేవిధంగా ఆ సమయంలో నాణ్యత కూడా తగ్గడంతో నాసిరకంగా అంబాసిడర్   కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. 


    ఇక అదే సమయంలో మారుతి 800 మోడల్స్ ఇండియన్ మార్కెట్ లోకి రావడంతో అలాగే వాటి ధర తక్కువ కావడం మైలేజ్ ఎక్కువ ఉండడంతో రెండు మోడల్స్ కి  తగ్గట్టుగా కలిగి ఉండి మార్కెట్లోకి రావడంతో అంబాసిడర్ కారుకి ఉన్న పూర్తి డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. అయినా కూడా కొంతమంది అప్పటికే అంబాసిడర్ బాగా ఇష్టపడే వినియోగదారులు దానికె  ఇంకా కట్టుబడి ఉన్నారు. విదేశీ బ్రాండ్స్ ని  ప్రయత్నించడానికి కూడా ఇష్టపడలేదు. ఇక 1990లో హిందుస్తాన్ మోటార్స్ జనరల్ మోటార్స్ తో 50 50 జాయింట్ వెంచర్ లోకి ప్రవేశించింది. 

    కానీ 1999 లో జనరల్ మోటర్స్ గుజరాత్ లోని హలోల్లో ఉన్న హిందుస్తాన్ మోటర్స్ కొనుగోలు చేయడంతో ఈ వెంచర్‌కు ముగింపు పలికారు. ఇక 2003 లో హిందుస్తాన్ మోటార్స్ కొత్త మోడల్ అంబాసిడర్ గ్రాండ్ విడుదల చేసింది. దీని ధర అప్పట్లో పెట్రోల్ కారు అయితే 4.2 లక్షలు, డీజిల్ కార్ 4. 5 లక్షలు.  అయితే వీటి ధర మారుతి 800 మోడల్ కంటే చాలా ఎక్కువగా ఉండేది. ఈ అంబాసిడర్ కారల ధరకి రెండు మారుతీ కార్స్ అయితే వచ్చేసివి.దానితో చాలామంది అంబాసిడర్ కంటే మారుతీ 800 కార్లు ని  కొనుగోలు చేయడానికి ఇష్టపడ్డారు. అయితే అప్పటికి కూడా అంబి సౌకర్యం వదిలి ఇతర బ్రాండ్లకి  మారడానికి మాత్రం కొంత మంది సంకోచించేవారు. ఇక 2003 లో ఈ కొత్త అంబాసిడర్ మోడల్ ప్రారంభించడంతో బ్రాండ్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ తరవాత కూడా ఈ బ్రాండ్ మార్కెట్లో  అంతగా నిలబడలేకపోయింది.

    ఇలా మార్కెటింగ్ వ్యూహాలు లేకపోవడం మరియు మారుతునన  కస్టమర్ అంచనాలు  అందుకోకపోవడం ఇంకా అధిక ధరలో, మోడల్స్ లో  పెద్దగా మార్పు లేకపోవడం, అలాగే పరిమిత ఇంజిన్ ఎంపికలు ఉండటం  హిందు మోటార్స్ అనేది క్రమంగా పతనానికి పోరాటం మొదలైంది. అంతేకాదు హిందుస్తాన్ మోటార్స్ వారి యొక్క ఘోరమైన దురహంకారం కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. డిస్క్ బ్రేక్ వంటి  చిన్న చిన్న మార్పులతోనే కంపెనీ అదే కార్ల ని  మళ్లీ మళ్లీ మార్కెట్లో విడుదల చేసేవి. ఇది కొత్త ఆటోమాటివ్ బ్యాండ్ తో పోల్చినపుడు టెక్నాలజీ పరంగా అభివృద్ధి లేకపోవడం అంబాసిడర్ కార్లలో పతనం  కనిపించింది. అంతేకాదు కంపెనీ మోడల్స్ ధరలు తగ్గించడానికి ప్రయత్నించలేదు. వారు రిసర్చ్ మరియు డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు చేయలేదు . 

    కాబట్టి ,మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దాంతో ఆ సమయంలో అంబాసిడర్ కార్ అనేది మిగతా కార్లతో పోల్చినప్పుడు నాట్ వెల్యు ఫర్ మనీ అన్నట్లుగా ప్రజలకి అనిపించింది. దాంతో ఈ ప్రభావం వారి కార్ల అమ్మకాలపై పడింది. హిందుస్తాన్ మోటర్స్ ఎప్పుడు వాళ్ళు మోడల్స్‌ని మోడర్న్ టెక్నాలజీగా  మార్చాలని ఇప్పుడు కూడా  ఆలోచించలేదు. అందువల్లనే ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా ఉన్నా ఈ కార్ ఇప్పుడు కోల్‌కతాలో క్యాబ్‌లకే పరిమితమైంది. అంతేకాదు టాటా మహీంద్ర వంటి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలను దాటుకొని తన పూర్వ వైభవాన్ని కొనసాగించడానికి చాలా కష్టపడింది. కానీ మారుతున్న మార్కెట్ రంగంలో ఇతరుల కంటే వెనుకబడి ఉన్నందుకు ఇక చివరికి ఈ కార్ కి  ప్రజలు వీడుకోవలు చెప్పాల్సి వచ్చింది.




కొత్తది పాతది