హోండా కంపెనీ భారత్ మార్కెట్లో విఫలం కావడానికి కారణాలు
హోండా ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఈ పేరు వినిపిస్తోంది, అయితే దానికి కారణం కేవలం కార్లు మాత్రమే కాదు మోటార్ సైకిల్ కూడా. మోటార్ సైకిల్ బిజినెస్ లో ప్రపంచంలో నే ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో హోండా కంపెనీ ఒకటి, ఇలా మోటార్ సైకిల్ బిజినెస్ లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ కార్ల విషయంలో ఎందుకు వెనకబడిపోయింది ?. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హోండా కంపెనీ కారు విక్రయాల పరంగా చాలా తగ్గుతుంది. ఇండియాలో గత సంవత్సర కాలంలో ఈ కంపెనీ 8 కార్ల కు పైగా ప్రొడక్షన్ ను నిలిపి వేయడం జరిగింది. ఇండియాలో హోండా కంపెనీ పడిపోవడానికి కారణం చాలామంది ఎస్ యు వి లను లంచ్ చేయకపోవడం అని అనుకుంటారు ఇది ఒక బలమైన కారణం అయినప్పటికీ ఇదే ముఖ్యమైన కారణం కాదు.
ఇంకా ముఖ్యమైన కారణాలు వేరే ఉన్నాయి. హోండా కార్లు నాణ్యత మరియు మైలేజ్ పరంగా అద్భుతంగా ఉంటాయి. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు ఇండియన్ కార్ బిజినెస్ లో వెనుకబడిపోయిన టాటా మరియు మహేంద్ర లాంటి కంపెనీలు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. కానీ హోండా కంపెనీ మాత్రం భారత్ దేశంలో తమ ప్రొడక్షన్ ను నిలిపి వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అసలు హోండా కంపెనీ భారత్ లో తమ బిజినెస్ ను కోల్పోవడానికి కారణాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
హోండా సిటీ
1995లో హోండా కంపెనీ మొదటిసారిగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఉష అనే పేరు గల కంపెనీతో కలిసి ఒక జాయింట్ వెంచర్ ద్వారా అడుగు పెట్టింది. ఇక వాళ్ళు ఇండియాలో లాంచ్ చేసిన మొట్టమొదటి కార్ హోండా సిటీ. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా కీర్తిని పొందిన హోండా సిటీ మోడల్ ను భారత దేశ ప్రజల ఇష్టాలకి తగ్గట్టుగా అనుకూలంగా కొన్ని మార్పులు చేసి చివరికి 1998లో భారత దేశంలో లాంచ్ చేయడం జరిగింది. ఇది అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పటికే భారత్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ లో ఉన్న కొన్ని కంపెనీలు ఉదాహరణకి మారుతి సుజుకి అంబాసిడర్ హుండై లాంటి కంపెనీలు తక్కువ ధరలో కార్లు అమ్మేవారు. కానీ హోండా మాత్రం ధనవంతులను దృష్టిలో పెట్టుకొని హోండా సిటీ కారు ను లాంచ్ చేయడం జరిగింది. 2000 సంవత్సరం కాలంలో ఒకరి దగ్గర హోండా సిటీ కారు ఉంటే వారు చాలా ధనవంతులు అని భావించేవారు.
VTEC ఇంజిన్(వేరియబుల్ వాల్వ్ టైమింగ్ మరియు లిఫ్ట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్)
ఇలా హోండా సిటీ విజయాన్ని పొందిన తర్వాత హోండా కంపెనీ లగ్జరీ ఎస్ యు వి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని హోండా CR-V ను లాంచ్ చేసింది. ఇది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇండియాలో ఉన్న చాలా వరకు ధనవంతులను హోండా బాగా ఆకర్షించి తమ వైపు కు తిప్పుకుంది. తర్వాత 2006లో హోండా కంపెనీ తమ ప్రత్యేకమైన కారు ను లాంచ్ చేసింది. అదే హోండా సివిక్ దీన్ని ప్రత్యేకమైన కారు అని ఎందుకు అన్నారంటే అప్పటికే ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఇంజన్ ను ఆ కారులో వాడడం జరిగింది. అదే VTEC ఇంజిన్, ఈ ఇంజిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది కారు ఎక్కువ ఆర్ పి ఎం తో వెళ్ళినప్పుడు ఎక్కువ పర్ఫామెన్స్ ను ఇస్తుంది, అలాగే తక్కువ ఆర్ పి ఎం తో వెళ్లినప్పుడు తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. VTEC ఇంజన్ చాలా మంచి పేరు తెచ్చుకుంది, కొంతమంది ఈ ఇంజన్ కోసం మాత్రమే ఆ కారు ని కొనేవారు.
హోండా జాజ్
ఇక అలా అప్పటివరకు హోండా కంపెనీ చాలా బాగా ఎదుగుతూ వచ్చింది. 1998 నుండి 2006 వరకు హోండా కంపెనీ లాంచ్ చేసిన కార్లు ఇండియా లో ఉన్న ధనవంతులను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసింది. కానీ మొదటిసారిగా ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్ అలాగే పేదవాడి అందుబాటులో ఉండాలని 2009 లో హోండా కంపెనీ ఒక కారు లాంచ్ చేసింది. అదే హోండా హోండా జాజ్, కానీ ఇది అనుకున్నంత స్థాయిలో ప్రజల నుంచి ప్రేరణ పొందలేదు. ఇలా మొదటిసారిగా భారత దేశం లో వారికి ఒక ఓటమి ఎదురైంది. దీనికి ముఖ్యమైన కారణం ఈ కారు యొక్క డిజైన్ అలాగే ఇచ్చిన ఫీచర్లకు సంబంధం లేకుండా కారు ధర ను నిర్ణయించడం జరిగింది. దీని తర్వాత 2011లో ఈ కంపెనీ హోండా బ్రియో అనే కారును లాంచ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ హోండా లాంచ్ చేసిన ఈ మోడల్ కూడా భారతీయులను ఆకట్టుకోలేకపోయింది.
హోండా అమేజ్
చివరికి 2013లో హోండా కంపెనీ హోండా అమేజ్ అనే కారును లాంచ్ చేయడం జరిగింది. ఈసారి ఈ కారు భారతీయులను చాలా బాగా ఆకట్టుకుంది, అలాగే హోండా కంపెనీ కి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ మార్కెట్లో ఒక మంచి విజయాన్ని ఇచ్చింది. కానీ అనుకోకుండా హోండా కంపెనీ ఈసారి కూడా మార్కెట్లో తమకు వచ్చిన విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దీనికి కారణం ఏంటంటే 2010 సమయంలో భారత్ లో డీజిల్ ఇంకా పెట్రోల్ ధరల్లో చాలా తేడా అనేది ఉండేది, డీజిల్ పెట్రోల్ కంటే కూడా చాలా తక్కువ ధరలో దొరికేది. ఇక ఇది గమనించిన మారుతి సుజుకి ఇంకా హుండై కంపెనీ లు ఎక్కువ మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు తయారు చేసి మంచి ధరకే మార్కెట్లోకి రిలీజ్ చేశారు.
డీజిల్ కార్లు ఆలస్యంగా మార్కెట్లోకి లాంచ్ చేయడం
దీంతో మెల్లిమెల్లిగా ప్రజలు పెట్రోల్ కార్ నుంచి డీసెల్ కార్ల వైపు వెళ్లడం మొదలు పెట్టారు. దీనివల్ల నెమ్మదిగా పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గి డీజిల్ కార్ల కు డిమాండ్ పెరిగింది. కానీ హోండా కంపెనీ మాత్రం ప్రజల్లో వచ్చిన ఈ మార్పును గమనించడం లో విఫలం అయ్యింది. అంటే 2010లో నే మారుతి సుజుకి ఇంకా హుండై వంటి కంపెనీలు అత్యధికంగా డీజిల్ కార్లు లాంచ్ చేసి మార్కెట్లో మంచి పేరును సంపాదించుకున్నాయి. కానీ హోండా కంపెనీ మాత్రం 2013 వరకు తమ మొదటి డీజిల్ కారు ను లాంచ్ చేయలేదు. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.
మార్కెట్ పరిస్థితి కి భిన్నంగా పనిచేయడం
ఇది మాత్రమే కాదు హోండా కంపెనీ ఎప్పుడు కూడా ట్రెండ్ ను అనుసరించేది కాదు. అలాగే కస్టమర్ల డిమాండ్లు మరియు డిమాండ్లను పూర్తి చేయగల కార్లు తగిన సమయంలో రిలీజ్ చేసేవారు కాదు. 2010 సమయంలో ఎలాగైతే హోండా కంపెనీ పెట్రోల్ నుండి డీజిల్ కార్ల తయారీలో కి వెళ్లలేదో అదే తప్పును 2016 సంవత్సరంలో మళ్లీ చేయడం జరిగింది. 2015 లో ఇండియన్ గవర్నమెంట్ డీజిల్ ధరలు పెంచి సుమారు పెట్రోల్ ధరకు చాలా దగ్గరగా పెంచింది. దీనివల్ల డీజిల్ మరియు పెట్రోల్ ధరలకు పెద్దగా తేడా ఉండేది కాదు. ఇక దీనివల్ల కస్టమర్లు మళ్ళీ డీజిల్ కార్ల కంటే పెట్రోల్ కార్లను కొనడం మొదలు పెట్టారు.
ఇలా మళ్లీ ప్రజలు కోరుకున్న విధంగా మారుతి సుజుకి మరియు హ్యుండై కంపెనీ వారు పెట్రోల్ కార్లు తయారు చేసి ప్రజల మన్ననలను పొందగలిగారు. ఈసారి మారుతి సుజు, హుండై కాకుండా టాటా మరియు మహీంద్రా లాంటి కంపెనీలు కూడా కస్టమర్ల డిమాండ్లను పూర్తి చేస్తూ కార్లు తయారు చేయడం మొదలుపెట్టాయి. కానీ హోండా కంపెనీ మాత్రం ఈసారి కూడా ముందు చేసిన తప్పును మళ్ళీ చేయడం జరిగింది. మార్కెట్ అంతా కూడా పెట్రోల్ కార్ల మీద నడుస్తుంటే, 2018 లో కూడా హోండా కంపెనీ డీజిల్ కార్లు ఎక్కువగా తయారు చేస్తూ వాటిని అమ్మడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ మీరు గమనించవచ్చు హోండా కంపెనీ మార్కెట్ పరిస్థితి కి ఎంత భిన్నంగా పనిచేస్తూ వచ్చింది అని.
ఇండియాలో కస్టమర్లు ఎక్కువగా కాంటాక్ట్ ఎస్ యు వి లు ఇష్టపడుతుంటే వాళ్లకు అందుబాటులో ధరలో మంచి ఫీచర్లతో హోండా కంపెనీ హోండా wrv లాంచ్ చేయడం జరిగింది. కానీ ఈ కారు కూడా మార్కెట్లో విఫలం అయింది. దీనికి కారణం ఏంటంటే భారతీయ కస్టమర్లకు కావాల్సింది ఎస్ యు వి కారు కానీ దానికి ఆల్టర్నేటివ్ కాదు. తక్కువో ఎక్కువో మార్కెట్లో ప్రజలు ఇష్టపడుతున్న ఎస్ యు వి ని హోండా లాంచ్ చేసి ఉండాల్సింది, కానీ దానికి ఒక ఆల్టర్నేటివ్ అని కారు లాంచ్ చేసి విఫలం అయింది. ఇది మాత్రమే కాదు మార్కెట్లో నడుస్తున్న ఫ్రెండ్ కి భిన్నంగా హోండా కంపెనీ తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల గత ఆరు సంవత్సరాలలో హోండా కంపెనీ సుమారుగా 9 కార్లను ఇండియన్ మార్కెట్ నుండి నిషేధించింది.
ఉదాహరణకు 2018లో హోండా మొబిలియో, 2019లో హోండా బ్రియో, 2020లో హోండా ఆక్వాడ్, సి ఆర్ సి, బి ఆర్ వి మోడల్స్, హోండా జాజ్, హోండా డబ్ల్యూ ఆర్ వి, ఇంకా ఫోర్త్ జనరేషన్ హోండా సిటీ ఇలా మొదలైన కార్లు హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్ లో తయారు చేయడం ఆపేసింది. ప్రస్తుత కాలంలో ఇండియా లో ఎస్ యు వి కార్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. టాటా మరియు మహేంద్ర లాంటి కంపెనీలు ఈ ఎస్ యు వి బిజినెస్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. మరోవైపు మారుతి సుజుకి ఇంకా హుండాయ్ కంపెనీ వారు కూడా కాంటాక్ట్ ఎస్ యు వి కార్లు తయారు చేస్తూ ఉన్నాయి దూసుకుపోతుంటే ఈ హోండా కంపెనీ మాత్రం ఇండియాలో వాళ్ళు లాంచ్ చేసిన అన్ని కార్లు ప్రొడక్షన్ ను నిల్పివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం రెండు మోడల్ మాత్రమే వాళ్ళు అమ్ముతున్నారు.
తన ప్రత్యర్థుల కారు కంపెనీ లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి అవసరాలను తీరుస్తూ అనుకూలంగా కార్లు తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ హోండా కంపెనీ మాత్రం ఎప్పుడో తయారు చేసిన హోండా సిటీ కారు మీద ఎక్కువగా ఆధారపడింది. ఆకర్షణీయమైన డిజైన్లు ఆధునిక టెక్నాలజీ వాడకం లోకి తీసుకురావడం లో విఫలమయ్యింది. ఇందు కారణంగా హోండా కంపెనీ తమ పోటీదారుల తో సమానంగా విక్రయాలు చేయలేకపోయింది.