మహేంద్ర కంపెనీ చరిత్ర

 మహేంద్ర కంపెనీ  చరిత్ర


    ఇండియన్ కంపెనీస్ అన్నగానే  అందులో మనకు గుర్తుకు వచ్చే దాంట్లో మహీంద్ర కంపెనీ కూడా ఒకటి.మహేంద్ర అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి ట్రాక్టర్లు మరియు  కార్లు . కానీ అలా మహీంద్ర కంపెనీ ని మనం గుర్తు పెట్టుకునేంత చేసిన వ్యక్తి   ఆనంద్ మహీంద్రా గారు.ఒక సాధారణ స్టీల్ కంపెనీలాగా  ప్రరంభం అయిన ఈ కంపెనీని ఆనంద్ మహేంద్రగారు అంతర్జాతీయ కంపెనీ లాగా ఎలా మార్చారు?అలాగే మహీంద్రా మరియు మహమ్మద్ లాగా  ఉన్న కంపెనీని మహీంద్రా అండ్ మహీంద్రాలాగా ఎలా మారింది?మహేంద్ర ఇప్పటివరకు విడుదల చేసిన కార్స్  ఏంటి?అలాగే ఆ కార్స్ అంటే అందరికీ ఎందుకంత ఇష్టం ఉంటుంది అని మనం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.


    1945 అక్టోబర్ 2 న జగదీష్ చంద్ర మహీంద్ర మరియు  కైలాష్ చంద్ర మహీంద్ర అనే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఫ్రెండ్ అయినా గులాం మహమ్మద్తో కలిసి మహేంద్రన్ ముహమ్మద్ పేరుతో కంపెనీని ప్రారంభించారు.జగదీష్ చంద్ర మహీంద్ర మరియు  కైలాష్ చంద్ర మహీంద్ర వీళ్లిద్దరూ ఆనంద్ మహీంద్రా వాళ్ల తాతయ్యలు. వీళ్ళు ప్రారంభించింది  కార్ కంపెనీ కాదు  స్టీల్ కంపెనీ.1947 లో పాకిస్తాన్ ఇండియా విడిపోయాక వీళ్ళ ఫ్రెండ్ అయినా గులాం అహ్మద్ ఈ కంపెనీలో ఆస్తి వాటాలు అమ్మేసి ఇండియా నుండి పాకిస్థాన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ వేర్పాటువాద అయినా మహ్మద్ అలీ జిన్నా, గులాం అహ్మద్కి పాకిస్థాన్ ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇస్తానని చెప్పాడు.


 మొట్టమొదటి మహేంద్ర జీప్ - మహేంద్ర CJ3A


    దీంతో ఇండియా వదిలి పాకిస్తాన్కి గులాం మహమ్మద్ వెళ్లిపోయాడు.ఈయన వెళ్లాక మహేంద్ర ముహమ్మద్ పేర్ని మహీంద్రా మరియు  మహీంద్రాగా మార్చారు. ఆ తర్వాత అన్నదమ్ములు విదేశాలో  ప్రసిద్ధిచెందిన జీపుల ని తయారుచేయాలని  నిర్ణయించుకున్నారు.జీబ్ మేన్ఫ్యాక్చరింగ్ లైసెన్స్ ని తీసుకోని  ఇండియా లో తయారు చేయడం మొదలుపెట్టారు.1949 లో మొట్టమొదటి జీప్  ప్రారంభించారు. దాని పేరు మహేంద్ర సిజెత్రీఎ(CJ3A). ఇది 2200 సీసీ ఇంజిన్ త్రీ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రిలీస్ అయింది.ఈ వాహనం చాలా ప్రసిద్ధి చెందింది.ఇదే వాహనాన్ని మెరుగుపరుస్తూ మహేంద్ర  1949 మరియు 1974 మధ్యలో CJ3b,CJ4,CJ4a అనే మూడు వాహనాలను ప్రారంభించారు.


    ఈ జీప్లు  ప్రసిద్ధిగాంచడంతో ప్రతి రాష్ట్రం ప్రభుత్వాలు వాళ్ళ  పోలీసులకు వాహనాలు కావాలని కోరారు.అంతే కాకుండా కమర్షియల్ గా వాడుకోవడానికి కూడా భారీగా ఆర్డర్లు వచ్చాయి.ఈ జీప్  అందరికి నచ్చడానికి కారణం ఏంటి అంటే ఇవ్వి  ఎలాంటి రోడ్ లో అయినా ఈజీగా వెళ్లగలగడం. అందుకే 1949 లో మొదలైన వీటి ప్రస్థానం 40 ఏళ్లు అంటే 1989 వరకు కొనసాగింది.1983 లో మారుతీ 800 రిలీజ్ అవ్వడం వల్ల అది చూడడానికి ఆధునికగా  ఉండడం వల్ల జీప్ల యొక్క ప్రజాదరణ తగ్గింద.1990 నుండి 1996 వరకు మహీంద్ర కంపెనీకి అమ్మకాలు తగ్గి  బాగా నష్టం వచ్చాయి.సరిగ్గా అప్పుడే 1997లో  ఒక వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకొని 1998 లో మేజర్ ,కమాండర్ మరియు లెజెండ్  అనే మూడు జీపులను రిలీజ్ చేశాడు.


    ఈ మూడు వాహనాలు ప్రారంభం అయ్యాక.పోలీసులు మాత్రమే కాకుండా పొలిటీషియన్ ,ఆర్మీ, టాక్సీ డ్రైవర్స్ .అంతేకాకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులు కూడా ఎక్కువగా వీటిని కొన్నారు.వీటి విజయానికి కారణం ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన మేనేజింగ్ డైరెక్టర్‌గా  ఆనంద్ మహేంద్ర.వీటి విజయం తర్వాత ఆనంద్ మహీంద్ర గారు ఒక నిర్ణయం తీసుకున్నారు.


మహీంద్రా బొలెరో


    ఇకపై జీప్ల తయారీ ఆపేసి ఆధునిక కార్లను డిజైన్ చెయ్యాలని.అనుకున్న వెంటనే ఒక కొత్త కార్ ని  తయారు చేసి 2000 సంవత్సరంలో కమర్షియల్గా పాసింజర్గా  రెండు వేరియంట్లలో రిలీజ్ చేశారు.దాని పేరే బొలెరో. ఇది ఇంతలా విజయం  సంపాదించిందో చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికి కూడా ఈ వాహనాన్ని మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాం.దీన్ని బట్టి అర్థం చేసుకోండి.ఈ వాహనాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.ఆర్థికంగా నష్టాల్లో ఉన్న మహీంద్రా కంపెనీ ని బోలెరో వాహనాలు కాపాడాయి.దీంతో ఆనంద్ మహీంద్ర గారు ఇంకొక మూడు కొత్త వర్షన్ వాహనాలు ప్రారంభిస్తే లాభాలు వస్తాయని అనుకున్నారు.


  మహీంద్రా స్కార్పియో


    రెండు సంవత్సరాలు కష్టపడి  భారతదేశ సాంకేతికతని మరియు భారతదేశ రూపకల్పనతో ఒక దిట్టమైన ఎస్‌యూవీ వాహనాన్ని  2002 లో ప్రారంభించండి జరిగింది.ఆవాహనం పేరు మహీంద్రా స్కార్పియో. ప్రారంభించిన వెంటనే ఉప్పెనలాగా అమ్మకాలు జరిగాయి. స్కార్పియో చేసిన అమ్మకాలు బీభత్సానికి ప్రత్యర్థి కార్ కంపెనీలు సైతం ఆశ్చర్యపోయాయి.పోలీస్, పొలిటీషియన్, ఆర్మీ మరియు దానిక  మధ్యతరగతి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కారును కొన్నారు.


    ఆనంద్ మహీంద్రగారి అంచనాలను తలకిందులు చేస్తూ రిలీస్ అయిన రెండు సంవత్సరాల్లోనే రెండు లక్షల కార్లు అమ్ముడుపోయాయి.భారతదేశంలోనే కాకుండా ఈజిప్ట్, యూరప్, రష్యా , శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడాప్రారంభమయ్యే అక్కడ కూడా భారీ అమ్మకాలు జరిగాయి.2002 నుండి 2021 వరకు మొత్తం 6,75,000 స్కార్పియో కార్లు అమ్ముడుపోయాయి.


    మహీంద్ర కంపెనీ ఈ  యొక్క కారే లాభాల్లోకి  తిసుకవచ్చింది .అంతెందుకు ఒక టీవీ ఇంటర్వ్యూలోనే ఆనంద్ మహేంద్రగారు చెప్పారు.కార్పియో లేకపోతే మా కంపెనీ ని మూసుకునేవాళ్లమని.ఈ విధంగా భారతదేశ  ఆటోమొబైల్ ఇండస్ట్రీలో స్కార్పియో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.స్కార్పియో ఇచ్చిన సంచలనం విజయంతో ఆనంద్ మహేంద్రగారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.


మహీంద్రా ఎక్స్‌యూవీ500


    ఆ తర్వాత 2006 లో స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ,2009 లో జైలో ,2010 లో తార్ మొదటి తరం ,2011 లో బొలెరో  ఫేస్‌లిఫ్ట్ అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ 500ని రిలీజ్ చేశారు.స్కార్పియో తర్వాత అంతటి వ్యామోహం సంపాదించుకున్నది మహీంద్రా ఎక్స్‌యూవీ 500.దీని దేహం చిరుతపులిని స్ఫూర్తిగ   తీసుకోని డిజైన్ చేశారు.అందుకే మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఛీతా అని పిలుస్తారు.ఆ తర్వాత 2011 లో మహీంద్రా వెరిటో  2012 లో మహీంద్రా క్వాంటో తో.2013 లో e20 ఎలెక్ట్రికల్ కార్ ని ప్రారంభించారు .కానీ ఇవి విజయం  సాధించాలే.


    ఆ తర్వాత 2015 - 2016లో టీయూవీ  300, నువో  పోర్ట్ , కేయూవీ 100 ని ప్రారంభించారు. ఇందులో టీయూవీ 300 తప్ప మిగతా రెండు వియయం  సాధించాలే.2017 లో స్కార్పియో సెకండ్ జనరేషన్ ని మరియు  2018 లో మహీంద్రా మారాజో ని ప్రారంభించారు. మహీంద్రా మారాజో కార్  విజయాన్ని సాధించింది. కానీ 2018 లోనే ఫార్చ్యూనర్‌  కార్  పోటీగా రిలీజ్ అయిన మహీంద్రా ఆల్టూరాస్ జి4 అనేది దారుణంగా విఫలమైంది.అసలు అది విడుదల అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు.2019 లో మహీంద్రా ఎక్స్​యూవీ300 ఐదు సీట్లున్న కార్ ని  ప్రారంభించారు.  ఇది కూడా చాలా విజయం సాధించింది .ఇక 2020 నుండి 2021 మధ్యలో రెండు కార్లు ప్రారంభం  చేశారు.స్కార్పియో ఎక్స్‌యూవీ 500 విడుదల అయినప్పుడు వచ్చిన స్పందన ఈ కార్ కూడా వచ్చింది.


మహీంద్రా ఎక్స్‌యూవీ700


    అవ్వే  మహేంద్ర థార్  సెకండ్ జనరేషన్ మరియు ఎక్స్‌యూవీ 700.మహీంద్ర  థార్ విడుదల అయ్యాక మొదటి వారం  లో 25,000 బుకింగ్స్ వస్తే,ఎక్స్‌యూవీ 700  విడుదల అయ్యాక కేవలం రెండు గంటల్లోనే 50,000 బుకింగ్స్ వచ్చాయి.మహేంద్ర కార్స్ కి ఇంతలా వ్యామోహం ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి.అవి మొదటిది తక్కువ ధర ,రెండోది రూపకల్పన,మూడోది సెగ్మెంట్ ఫీచర్స్ అంటే మరియు నాలుగోది .అంతే.మొదటి  భారతదేశపు ఆఫ్ రోడ్ అయినా జీపీని, భారతదేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ని,యాపిల్కా ర్‌ప్లే ఆండ్రాయిడ్ ఆటో ని తీసుకొచ్చింది.అంతెందుకు?మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ఉన్న అడాస్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ ని తీసుకొచ్చింది. భారతదేశం లో మొట్టమొదటిగా పరిచయం చేసింది మహీంద్రానే.నాలుగో కారణం  ఏంటంటే  బిల్డ్  క్వాలిటి.మహేంద్ర బిల్డ్ క్వాలిటీ దగ్గర అస్సలు రాజీ పడదు .టాటా తర్వాత అత్యంత సురక్షిత కార్ కంపెనీ ఏంటంటే అందరూ మహేంద్ర కారు అని  చెబుతారు .


మహీంద్రా ఎక్స్‌యూవీ300


    భారతదేశం లో  మొట్టమొదటి అత్యంత సురక్షిత కార్ గా ఎక్స్‌యూవీ 300 పై స్టార్ రేటింగ్‌తో  నిలిచింది.ఈ రికార్డ్ బ్రేక్ చేస్తూ రీసెంట్ గా లాంచ్ ఎక్స్‌యూవీ 700 ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది.మహీంద్ర కంపెనీ యొక్క కార్ పేర్లలో ఒకఏకైకత ఉంటుంది .అదేంటంటే ప్రతి  కార్ పేరు చివర్లో ఓ అనేది ఉంటుంది. మహేంద్ర కంపెనీ కార్స్  మాత్రమే కాకుండా ట్రాక్టర్స్, ట్రక్కులు, మినీ వ్యాన్స్ , ఆటోస్ , డీసీఎంస్ , బస్సులు , బైక్స్ , స్కూటీస్  తాయారు  చేస్తోంది.


    ఇవ్వే కాకుండా ఫైనాన్స్ , ఐటీ, బ్యాంకింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్,కన్స్ట్రక్షన్స్, లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ వంటి అనేక రాష్ట్రాలలో మొత్తం 100 కి పైగా దేశాల్లో బిజినెస్ చేస్తుంది.చిన్న స్టీల్ కంపెనీల మొదలు అయినా  మహీంద్ర కంపెనీని ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తి ఆనంద్ మహీంద్ర గారు.ఈయన  ఒక మంచి వ్యాపారవేత్త మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా.మహీంద్ర ఫౌండేషన్ ద్వారా పేద ఆడపిల్లలకి చదువు చెప్పిస్తున్నాడు. కరోనా సమయం లో తన రిసార్ట్స్ని కోవిడ్ పేషెంట్స్ కోసం ఇచ్చేశాడు. ఒలింపిక్స్‌లో ఇండియా తరపున గెలిచిన వాళ్ళకి కార్స్  బహుమతిగా ఇచ్చాడు.మహీంద్ర కంపెనీ మాత్రమే కాదు ఆనంద్ మహీంద్రగారి మనసు కూడా పెద్దదే.అందుకే అతని సేవలను గుర్తించిన మన భారతదేశ ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి అతన్ని సత్కరించిది.


కొత్తది పాతది