టయోటా సుప్ర చరిత్ర
టయోటా సుప్ర ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. రేసింగ్ మీద ఆసక్తి ఉన్న వారికి ఈ కార్ అనేది ఒక డ్రీమ్ కార్. సుప్ర ఈ పేరు వినగానే చాలా మందికి కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లోని ఒక రేస్ అనేది గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆ సీన్ తర్వాత ఈ కారుకు మరింత క్రేజ్ పెరగడం జరిగింది. చాలా మందికి ఆ సీన్ చూసిన తర్వాత నే సుప్ర అనే పేరుతో ఒక కారు ఉందని తెలిసింది. ఇక మీరు ఈ ఆర్టికల్ ద్వారా సుప్ర గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.
1981లో మొదటిసారిగా నావిగేషన్ సిస్టమ్ ను వాడుకలో తీసుకొచ్చింది టయోటా సిలికా అనే పేరు కలిగిన మోడల్. సిలికా నుంచి సుప్ర రావడం జరిగింది. ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది తయారు చేసిన కంపెనీ పేరు హోండా. ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది బేస్ పాయింట్స్ ను ఆధారంగా తీసుకుని పనిచేసేది. ఉదాహరణకు మొదలు పెట్టిన స్థానం, ప్రయాణించిన దూరం ఇలా ఈ రెండింటిని వాడుకొని నావిగేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కారును మొదటిసారిగా లాంచ్ చేసింది 1978లో అది కూడా టయోటా సిలికా ఎక్స్ ఎక్స్ అనే పేరుతో లాంచ్ చేయడం జరిగింది. మెల్లిగా సిలికా నుండి సుప్ర గా మారడం జరిగింది.
ఈ మోడల్ లో పూర్తిగా 5 జనరేషన్ లు అనేవి ఉన్నాయి. 1978 నుంచి 2002 వరకు 4 జనరేషన్ లు లాంచ్ చేసిన తర్వాత కంపెనీ వారు ప్రొడక్షన్ మొత్తాన్ని ఆపివేయడం జరిగింది. కాకపోతే సుప్ర అనే ఈ కారుకు ప్రజల్లో ఉన్న ప్రేమను మన్నన ను చూసి టయోటా కంపెనీ వారు మళ్లీ 17 సంవత్సరాల తర్వాత ఆకర్షణీయమైన డిజైన్ తో లేటెస్ట్ జనరేషన్ లాంచ్ చేశారు. ఈ కారు కు చాలా పవర్ ఉంటుంది, అనేకమైన కార్ రేసింగ్ లో ఈ కారు ఉంటుంది.
1994 లో లాంచ్ చేసిన సుప్ర మోడల్ కు చాలా డిమాండ్ అనేది వచ్చింది. ఆ డిమాండ్ వల్ల కారు ధర అనేది సుమారు గా ఒక లక్ష డాలర్ల వరకు చేరుకుంది. అంటే 2021 లో దొరుకుతున్న సుప్ర కంటే కూడా సుమారు రెండు ఇంతలు ఎక్కువ అన్న మాట. 2021 లో లాంచ్ చేసిన సుప్ర 42000 డాలర్ల నుంచి 51000 డాలర్ల వరకు వెళ్తుంది అంటే మన ఇండియన్ కరెన్సీ లో 32 లక్షల నుంచి 37 లక్షల వరకు ఉంటుంది.
ఇలా ఇంత మంచి ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు పవర్ ఫుల్ ఇంజన్ తో వస్తుంది, అంటే ఈ కారు ఎంత మంచిదో మీరు ఊహించుకోవచ్చు. అందువల్లనే దీనిని ప్రజలు చాలా ప్రేమిస్తారు, కాకపోతే ఈ కారు ప్రొడక్షన్ అనేది భారతదేశంలో లేనందువల్ల భారతదేశంలో ఈ కారు ని కొనాలంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనివల్ల ఈ కారు యొక్క ధర రెట్టింపు అవుతుంది. ఈ కారులో ఐదు జనరేషన్ లు ఉన్నాయి కదా దానిలో ఆరు ఇన్ లైన్ ఇంజన్లను వాడటం జరిగింది. ఈ 6 ఇన్ లైన్ ఇంజన్ అనేది చాలా స్మూత్ (అంటే సున్నితంగా) గా మరియు లాంగ్ లైఫ్(ఎక్కువ రోజుల సర్వీస్ ను ఇవ్వడం) కలిగినటువంటి ఇంజన్. ఇది చాలా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలుగుతాయి అందువల్లనే ఇది రేసులో ఎక్కువ గా ఉపయోగించబడతాయి.
తాజాగా లాంచ్ చేసినటువంటి సుప్రకారు లో వాడిన ఇంజన్ టయోటా కంపెనీ బిఎండబ్ల్యూ కంపెనీతో కలిసి తయారు చేయడం జరిగింది. ఈ బీఎండబ్ల్యూ తయారుచేసిన ఇంజన్ సుమారు గా 335 హెచ్ పి పవర్ ను ఉత్పత్తి చేయగలదు.17 సంవత్సరాల తర్వాత లాంచ్ చేయడంతో ప్రజలు చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు, అలాగే ఆ కారును ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలామంది అనుకున్నారు. ఇక ఈ క్రేజ్ ను వాడుకోవడానికి కంపెనీ ఒక ఆక్షన్ పెట్టడం జరిగింది, దాంట్లో ఈ కారుకు సుమారు 2.1 మిలియన్ డాలర్ల వరకు వెళ్లింది అంటే 15 కోట్ల రూపాయలు అంటే అసలు ధర కంటే 40 శాతం ఎక్కువ. అలా ఎక్కువ వచ్చిన డబ్బు ను కంపెనీ వారు చారిటీ కి డొనేట్ చేశారు. ఒక జపనీస్ దేశానికి చెందిన కారు అంతగా రావడం ఇదే మొదటిసారి.
టయోటా సిలికా ఎక్స్ ఎక్స్ ను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత. నార్త్ అమెరికా డివిజన్ వారు ఆ పేరు అంతగా బాగోలేదు అని చెప్పి దీనికి టయోటా సుప్ర అని పేరు ను పెడదామని చెప్పారు. దాంతో ఈ కారు టయోటా సుప్ర గా మారింది. 1981లో మళ్లీ టయోటా ఏ 50 సిలికా సుప్ర అనే పేరుతో ఒక మోడల్ లాంచ్ చేశారు. కానీ ఇది అనుకున్నంత విజయాన్ని తీసుకురావడంలో విఫలమయింది, ప్రజలు దాని పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక అది అనుకున్నట్టుగా జరగకపోవడంతో టయోటా కంపెనీ వారు సిలికా మరియు సుప్ర ను విడదీసి రెండిటి ని వేరే వేరే మోడల్ గా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో కంపెనీ వారికి సుప్ర మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం కలిగింది. ఇక దాని తర్వాత టయోటా నుండి మొదటగా వచ్చిన కారు సుప్ర ఏ 70 ఎన్నో మోడిఫికేషన్ లు చేసి ఈ కారును లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కారు బరువు అనేది కొంచెం పెరిగిపోయింది ఇక దీనివల్ల కారు వేగం అనేది కొంచెం తగ్గిపోయింది. ఈ కారు మోడల్ కూడా ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది, ఇది కూడా కొంతవరకు నిరాశనే మిగిల్చింది.
ఇక ఇలా కాదు అని చెప్పి టయోటా కంపెనీ వారు తమ పూర్తి శ్రద్ధను తమ దగ్గర ఉన్న ఉన్నతమైన నిప్పులను అందరి ని కూడా ఈ సుప్ర కార్ మోడల్ తయారు చేయడానికి అలాగే దీన్ని అభివృద్ధి చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.ఇక వీరి తరువాత కారును 1987లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రజలకు కొత్తదనాన్ని ఇవ్వడం కోసం తమ కారు ఇంజన్ కు టర్బో ను జోడించి అమర్చడం జరిగింది. ఇక దీని పేరును టయోటా సుప్రా టర్బో అని మార్చి లాంచ్ చేయడం జరిగింది. ఈ కారు ఇంజన్ అనేది సుమారు గా 230 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేయగలదు. ఇక దీని ఇంజన్ పవర్ మరియు దీని ఆకర్షణీయమైన డిజైన్ తో ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంది.
ఇక దీని తర్వాత మోడల్ గా వారు 1992లో ఇంకో కారు ను లాంచ్ చేయడం జరిగింది. మునుపటి కారుతో తో పోలిస్తే ఇంకా ఆకర్షణీయమైన డిజైన్ తో మరియు ఆధునిక టెక్నాలజీ ని వాడారు. ఇక అక్కడి నుంచి వారు ఆరు ఇన్ లైన్ ఇంజన్ ను వాడడం మొదలుపెట్టారు. ఈ కారు వారికి మంచి విజయాన్ని అందించడం జరిగింది, ఎందుకంటే అప్పుడున్న ధరలను బట్టి అంత తక్కువ ధరలో అంత శక్తివంతమైన ఇంజిన్ ను ఇచ్చే కారు అది ఒకటే ఉండేది.
తర్వాత టయోటా కంపెనీ వారు 1993లో తమ తర్వాత మోడల్ అయినా సుప్ర ఏ 80 ను లాంచ్ చేశారు. ఈ కారు డిజైన్ ఇంకా ఆధునికమైన టెక్నాలజీని వాడటం వల్ల జనాలను మరింత ఆకర్షించింది. మునుపటి కార్ లన్నిటి తో పోలిస్తే ఇది ఇంకా చాలా బాగుంటుంది. అప్పటివరకు వారు చేసిన చిన్న చిన్న తప్పని సరి చేసుకొని మరింత ఆదరణ పొందారు. దీని బరువు ను ఇంకో రెండు వందల పౌండ్లు తగ్గించారు, దీంతో దాని వేగం కూడా పెరిగింది.