కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఎలా ఎదిగింది

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఎలా ఎదిగింది

    1997 లో దివాలా తీసిన ఒక కంపెనీ 2019 లో భారత్ లాంటి ఒక అత్యంత పోటీ మార్కెట్ లో అడుగు పెట్టి ఘన విజయం సాధించింది. కేవలం విజయం సాధించడమే కాకుండా  మూడు సంవత్సరాలలోనే టయోటా, హ్యుండాయ్, రెనాల్ట్, లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లను వెనక్కి నెట్టు మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ లో ఐదవ స్థానంలో నిలిచింది. ఆ కంపెనీ మరి ఏదో కాదు సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ అయినా కియా మోటార్స్. జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి కంపెనీలే మన దేశంలో నిలువలేకపోయాయి అలాంటిది అప్పటికే దివాలా తీసిన ఒక కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టడంతో భారీ మార్కెట్ ను ఎలా సొంతం చేసుకుంది. ఇలా చేయడానికి కియా మోటార్స్ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది, కరోనా సమయంలో కూడా సమయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా నష్టాల్లో కొడుకు పోతే ఒక్క కియా మాత్రం లాభాలు ఎలా పొందగలిగింది. ఇలాంటి అనేక విషయాలను మీరు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటారు.


క్యుంగ్‌సంగ్ ప్రేసిషన్ ఇండస్ట్రీ గా ఉన్న  పేరును కియా ఇండస్ట్రీ గా మార్చడం


    కియా ని జూన్ 9 1944లో క్యుంగ్‌సంగ్ ప్రేసిషన్ ఇండస్ట్రీ అనే పేరుతో స్థాపించడం జరిగింది. మొదట్లో ఈ కంపెనీ సైకిల్ పార్ట్స్ అలాగే స్టీల్ ట్యూబ్లను తయారు చేసేది. ఈ కంపెనీ 1951 లో సౌత్ కొరియాలో సామ్చూరి పేరుతో తమ మొదటి సైకిల్ ను తయారు చేసింది. అప్పట్లో కొరియా లో ఇది అతి పెద్ద సైకిల్ తయారీ కంపెనీ. అలాగే 1952లో  క్యుంగ్‌సంగ్ ప్రేసిషన్ ఇండస్ట్రీ గా ఉన్న ఈ పేరును కియా ఇండస్ట్రీ గా మార్చారు. ఆ తర్వాత 1957 లో కియా పేరుతో మొదటి మోటార్ సైకిల్ ను తయారు చేసి లాంచ్ చేయడం జరిగింది. కానీ అది అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కియా 1962 లో ట్రక్కులు తయారు చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత మెల్లిగా 1974 లో కారును తయారు చేయడం మొదలుపెట్టింది. ఇలా కార్లు తయారు చేసే ఆటోమొబైల్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.


ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించడం 


    కారు బిజినెస్ లో అనుకున్న విజయం రావడం తో కియా మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలి అని నిర్ణయించుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా, లాంటి దేశాలకు కూడా కియా మోటార్స్ వారి వాహనాలను ఎక్స్పోర్ట్ చేయాలని అనుకున్నారు. అలాగే  చేయడం మొదలు పెట్టింది, వీటిలో కియా ప్రైడ్, కియా స్పోర్ట్స్, కియా సేఫియా, ఇలాంటి విజయవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆ సమయంలో కియా కు చాలా మంచి రోజులు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ ఒకదాన్ని మించి మరొకటి అద్భుతమైన కార్లు తయారు చేస్తూ మెల్లమెల్లగా సౌత్ కొరియా లోనే కాదు ప్రపంచమంతా కూడా బాగా ప్రసిద్ధి చెందిన కంపెనీ గా మారింది.


ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్


    అయితే 1997లో కియా మోటార్స్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది అదేమిటంటే ఆ సమయంలో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా కియా కార్స్ యొక్క విక్రయాలు అంటే సేల్స్ చాలా పడిపోయాయి. ఎంతగా అంటే ఈ కంపెనీ ఏకంగా దివాలా తీసి పరిస్థితి కి వచ్చింది. 1998లో హ్యుండాయ్ మోటార్స్ కియా యొక్క 51% వాటాను సొంతం చేసుకుంది. దీంతో కియా మోటార్స్ కంపెనీ మునుపటికంటే మరింత బలంగా మారింది. ఎంతగా అంటే ఆ తర్వాత లాంచ్ చేసిన రెండు మోడల్స్ తోనే తర్వాత రెండు దశాబ్దాల వరకు అమెరికా, యూరప్, లాంటి మార్కెట్లో కియా పేరు మారి మారుమోగిపోయింది.


కియా మోటార్స్ భారత మార్కెట్ లోకి ప్రవేశించింది


    ఆ తర్వాత కియా మోటార్స్ జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు శాతం నిలువ లేని ఒక టిపికల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించింది. అదే మన భారతదేశం ఇండియా, కియా మోటార్స్ 2019 జూలై లో తమ మొదటి విషయం కారు అయినా సెల్టోస్ ని ఇండియాలో లాంచ్ చేసింది. అయితే కియా మోటార్స్ ఇండియాలో అడుగుపెట్టిన కొన్ని నెలల్లోనే కోవిడ్ రావడం జరిగింది. ఆ సమయంలో దేశమంతా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ కోవిడ్ యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కూడా పడింది. 


భారత మార్కెట్లో కియా మోటార్స్ ఎదుగుదల


    అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే దేశంలో అన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ లు నష్టాల్లో కూరుకు పోతుంటే కియా మోటార్స్ మాత్రం 80% వృద్ధి చెందింది అంటే ఎదుగుదలను నమోదు చేసుకుంది. నిజానికి మొదటి నుంచి మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ని టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, హుండాయ్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు డామినేట్ చేస్తున్నారు. కానీ ఇలా ఇంత పోటీని కూడా తట్టుకొని కియా మోటార్స్ నిలబడింది. ఇలా చేయడానికి ముందుగానే చాలా పరిశోధన చేసింది, అందులో భాగంగా మన దేశంలో ఉన్న హ్యుండాయ్ మోటర్స్ నుండి సహాయం తీసుకుంది.


భారతీయ కస్టమర్ ల ప్రాధాన్యత మరియు అవసరాల మీద పరిశోధన


    కియా మోటార్స్ ఇండియా మార్కెట్ ను బాగా పరిశీలించిన తర్వాత వారు ఒకటి గమనించారు. కియా కంపెనీ కి మన దేశంలో ఒక దాన్ని మించిన మరొక లగ్జరీ కార్లు  ఉన్నాయి అన్న విషయం బాగా తెలుసు. కానీ వాటి ధరలు చూసి ఎక్కువమంది వాటిని కొనడానికి ఆసక్తి చూపలేదు. అలాగే ప్రజలు కొనగలిగిన టువంటి కార్లలో ప్రీమియం ఫీచర్స్ ఏమి ఉండవు. ప్రీమియం ఫీచర్స్ ఉన్న కార్లు సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారు కానీ వాటి ధరలు చూసి అందరూ ఆగిపోతారు. ఇదంతా గమనించిన కియా కంపెనీ మే 19 2017 లో తమ సబ్సిడరీ కంపెనీ గా కియా ఇండియాలో మొదలుపెట్టింది.


కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్


    ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా లో దాదాపు 536 ఎకరాల్లో కియా తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను మొదలుపెట్టారు. ఈ ప్లాంట్ నుండి ప్రతి సంవత్సరం దాదాపు గా 3 లక్షల కార్లు తయారు చేయవచ్చు. ఇలా స్థాపించిన రెండు సంవత్సరాలకి అంటే ఆగస్టు 2019 లో ఈ కంపెనీ తమ మొదటి కారు అయినా కియా సేల్టోస్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇక్కడ అందరినీ షాక్ కి గురి చేసిన విషయమేంటంటే కియా కారు ను లాంచ్ చేసిన మొదటి రోజే ఆరువేల బుకింగ్ వచ్చాయి. ఇండియన్ మార్కెట్లో ప్రవేశించగానే ఇంత భారీ బుకింగ్ అవ్వడం అంత సులభం కాదు.


    దీనికి ముఖ్యమైన కారణం ఇండియాలో ప్రజలందరూ కూడా హాచ్ బ్యాక్ ఇంకా సడన్ కారులను వాడి విసిగిపోయారు వాళ్ళు కొత్తదనాన్ని కోరుకున్నారు. అదే సమయంలో కియా కంపెనీ తన మొదటి కారు అయినా సెల్టోస్ (ఎస్ యు వి) ను ప్రవేశపెట్టింది. దీంతో ఇది ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంది. ఈ కంపెనీ కేవలం నాలుగు నెలల లోనే 40,581 యూనిట్లను విక్రయించింది అంటే  అమ్మడం జరిగింది. అలా చేసి మారుతి సుజుకి, బ్రీజా  ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ నీ వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళింది.


కియా మోటార్స్ ఘన విజయం 


    కియా మోటార్స్ మొదటి సంవత్సరంలో ఒక లక్ష యూనిట్లను విక్రయించగా వారి రెండవ సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లు విక్రయించారు. ఇలా భారతదేశంలో వారికి మంచి ఫలితాలు వచ్చాయి. అయితే ఇదంతా కూడా అందరూ నష్టపోతున్న కరోనా మహమ్మారి సమయంలో జరగడం అనేది విశేషం. ఆ సమయంలో టాటా మహేంద్ర హోండా ప్లాంట్ పెద్ద పెద్ద కంపెనీలు డిమాండ్ లేక తమ కారు ప్రొడక్షన్ ని తగ్గించుకుంటే. కియా మాత్రం మెల్లమెల్లగా తమ ప్రొడక్షన్ ను పెంచుకుంటూ పోయింది. ఈ విధంగా కియా మోటార్స్ భారతదేశంలో అడుగుపెట్టిన నాలుగు సంవత్సరాల లోనే దాదాపు 5 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇండియా లాంటి కఠినమైన  పోటీ మార్కెట్లో విజయం పొందడం అంత సులభం కాదు, కానీ కియా సాధించింది. ఇది చూసి మిగిలిన ఆటోమొబైల్ కంపెనీలు అన్ని కూడా ఆశ్చర్యపోయారు. 


మూడు సంవత్సరాల పరిశోధన 


    ఇలా చేయడానికి కొన్ని అంశాలను పాటించింది వాటి మూలంగానే మంచి విజయాన్ని వాళ్ళు పొందగలిగారు. కియా తమ మొదటి కారు అయినా సెల్తోస్ ని 2019 సంవత్సరంలో లాంగ్ చేసింది కానీ దాని ప్లానింగ్ మాత్రం మూడు సంవత్సరాల ముందు నుంచి చేస్తూ వచ్చింది. అంటే కియా మోటార్స్ భారతదేశంలో ప్రవేశించ కంటే ముందే ఇండియన్ మార్కెట్ ను బాగా పరిశీలించడం జరిగింది. వీటిలో కొన్ని అంశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. 


ముఖ్యమైన అంశాలు….


  • వినియోగదారుల ప్రవర్తన మరియు అవసరాలు

  • ఆధునికమైన ఫీచర్లు

  • అందుబాటులో ఉండే ధరలు

  • ఆధునిక సర్వీస్ సెంటర్ లు 

  • ఆకర్షణీయమైన డిజైన్

  • ప్రజలకు తగ్గట్టుగా అవసరమైన మోడల్స్ ను కలిగి ఉండటం

  • వాతావరణాన్ని రక్షించడానికి ఇన్ బిల్ట్ ఎయిర్ ఫిల్టర్ వంటి ఆధునికమైన ఫీచర్స్ కలిగి ఉండటం

  • తక్కువ ధరలో మంచి ఫీచర్స్ అలాగే నాణ్యత కలిగి ఉండటం

  • మంచి మైలేజ్

కొత్తది పాతది