టార్క్, ఆర్.పి.ఎం, సీసీ, బి.హెచ్.పి: వాహనాల్లో దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి
సీసీ అంటే ఏంటి ?
మెకానికల్ సబ్జెక్ట్ లో పట్టు ఉన్నవారికి వెహికల్ లో సీసీ అన్న, ఆర్.పి.ఎం అన్న, టార్క్ అన్న, బి.హెచ్.పి అన్న కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ చాలామందికి వీటిపై సరైన అవగాహన అనేది ఉండదు. సాధారణంగా మనం ఏదైనా ఒక బైక్ గాని లేదా కారు గాని కొనడానికి షోరూమ్ కు వెళ్ళినప్పుడు షోరూంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో ఇంత పవర్ ఉంది, దీంట్లో టార్క్ ఎక్కువ ఉంది, ఇంత ఆర్.పి.ఎం ఉంది, ఇంత బి.హెచ్. ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ వెహికల్ యొక్క కెపాసిటీ ఇంత, ఈ వెహికల్ ఇంజన్ ఎన్ని లీటర్లు అని ఇలా చెబుతూ ఉంటారు కానీ వీటి మీద అవగాహన లేనివారు కేవలం తల ఊపుతూ ఉండడమే తప్ప వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం ఉండదు. అందుకే వీటి మీద కనీస అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది. ఈ ఆర్టికల్ ద్వారా పైన పేర్కొన్న పదాలకు అర్థాలు మీరు తెలుసుకోవచ్చు.
మొదటగా సీసీ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనే విషయం తెలుసుకుందాం. సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ అని అర్థం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సెంటీమీటర్ క్యూబిక్ (క్యూబిక్ అంటే 3 ఇంతలు అని అర్థం). బోర్ లో సిలిండర్ అనేటటువంటిది ఉంటుంది సిలిండర్ అంటే ఉదాహరణకు ఒక కోక్ టిన్ లాగా ఉంటుంది. కోక్ టిన్ ను ఉదాహరణ గా తీసుకున్నట్లు అయితే దీని యొక్క సి సి ఎలా లెక్కిస్తారు అంటే, దాని పై భాగంలో ఉన్నటువంటి సర్కిల్ అలాగే కింది భాగంలో ఉన్నటువంటి సర్కిల్ మరియు పైభాగంలోని సర్కిల్లోని సెంటర్ నుంచి కింది భాగం లోని సర్కిల్ సెంటర్ వరకు ఉన్న దూరం, ఇలా ఈ మూడింటిని గుణించగా వచ్చేది క్యూబిక్ సెంటీమీటర్. అంటే సెంటీమీటర్ క్యూబ్ ఎలా వస్తుందంటే మీది సర్కిల్ యొక్క వ్యాసం అనేది సెంటీమీటర్లు ఉంటుంది అడుగుభాగం లోని సర్కిల్ కూడా సెంటీమీటర్లు ఉంటుంది అలాగే పై భాగంలో ని సెంటర్ నుంచి కింది భాగంలో ని సెంటర్ వరకు కూడా సెంటీమీటర్లు ఉంటుంది ఇలా ఈ మూడిటిని గుణిస్తే సెంటీమీటర్ క్యూబిక్ వస్తుంది.
ఈ సీసీ అనేది ఆ యొక్క బోర్ యొక్క పరిమాణాన్ని బట్టి ఈ సీసీ అనేది పెరుగుతూ ఉంటుంది. బోర్ చిన్నదైతే నమో తక్కువ సీసీ ఉంటుంది, అలాగే బోర్ యొక్క పరిమాణం పెరిగితే సిసి కూడా పెరగడం జరుగుతుంది. ఇలా బోర్ పరిమాణం అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సీసీ అనేది కూడా పెరగడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక లీటర్ ఇంజన్ తీసుకున్నట్లయితే దాంట్లో 1000 సీసీ ఉంటుంది, అలాగే 0.8 లీటర్ ఇంజన్ తీసుకున్నట్లయితే దాంట్లో 800 సీసీ అనేది ఉండటం జరుగుతుంది.
అయితే ఇదంతా కూడా ఒక్క సిలిండర్ కి సంబంధించినటువంటి సీసీ ఇప్పుడు కారు లాంటి వాటిలో చూస్తే నాలుగు సిలిండర్లు ఉండడం జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు సీసీ ని డిస్ ప్లేస్మెంట్ అని కూడా అనడం జరుగుతుంది. ఇలా నాలుగు సిలిండర్ ఇంజన్ ఉన్నప్పుడు మొత్తం సీసీ ని లెక్కించే ఫార్ములా ఏంటంటే…
V = π / 4 x D**2 x H x N
పైన తెలిపిన టువంటి ఫార్ములా
V అంటే వాల్యూమ్ అని అర్థం అంటే ఎంత పరిమాణం వస్తుంది అని అర్థం.
D స్క్వేర్ అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ బోరు యొక్క పై వ్యాసము మరియు కింది వ్యాసము రెండిటిని తీసుకుంటాం కాబట్టి డిస్క్ అనమాట వ్యాసాన్ని డి తో చూపియడం జరుగుతుంది.
H అంటే ఏంటంటే స్ట్రోక్ అంటే ఈ బోర్ యొక్క పైభాగంలో ని సెంటర్ నుంచి కింది భాగం సర్కిల్ సెంటర్ వరకు వచ్చే దూరాన్ని మనం హెచ్ అని తీసుకుంటాం .
N అంటే నెంబర్ ఆఫ్ సిలిండర్ అంటే ఎన్ని సిలిండర్లు ఉన్నాయని అర్థం.
ఈ విధంగా సీసీ అనేది లెక్కించడం జరుగుతుంది.
టర్క్ అంటే ఏంటి ?
ఇప్పుడు టర్క్ గురించి తెలుసుకుందాం ఈ టర్క్ అనేదాన్ని మనం అచ్చ తెలుగులో పెట్టుకున్నట్లయితే దీన్ని పురి శక్తి లేదా మెలి శక్తి అని అర్థం. దీన్ని ఆంగ్లంలో ట్విస్టింగ్ ఫోర్స్ అని కూడా అంటారు. అంటే ఏదైనా ఒక బోల్ట్ ని మనం ఒక రెంచి సహాయంతో బోల్ట్ ని విప్పాలనుకున్నప్పుడు ఆ రెంచి తో కొంత ఫోర్స్ ఉపయోగించి తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతైతే ఫోర్స్ అనేది మనం ప్రయోగిస్తున్నారు ఎంత దూరాన్ని మనం ఆ బోల్ట్ ని కదిప గలిగాము అన్న దాన్ని మనం టార్క్ అని అంటారు. టర్క్ అనేది మన రోజు ఎదుర్కొనే సన్నివేశాలలో చూసుకున్నట్లయితే మీ ఇంటి తలుపు తెరిచేటప్పుడు, ఇంకా మీ వాటర్ బాటిల్ మూత తెరిచేటప్పుడు. బాటిల్ మూత తెరిచేటప్పుడు దాని మీద మీరు ఉపయోగించేటటువంటి బలం అలాగే మీరు ప్రయోగించిన బలానికి ఎంత దూరం మూత కదులుతుందో అన్న దాన్ని టార్క్ అని అంటారు. అందుకే టార్క్ ఫార్ములా ఏంటంటే
Torque = Force x Length
మనం ప్రయోగించిన టువంటి బలము అలాగే అది కదిలిన టువంటి దూరాన్ని మనం టర్క్ అని అంటారు. ఫోర్స్ యొక్క పరిమాణం వచ్చేసి న్యూటన్ అలాగే దూరం యొక్క పరిమాణం మీటర్ కాబట్టి టార్క్ ని మనం న్యూటన్ మీటర్ లో లెక్కించడం జరుగుతుంది, ఇది టర్క్ గురించి అన్న మాట. ఇక మన నిత్య జీవితంలో మనం టారక్యూ ని ఎప్పడు చూడవచ్చు అంటే మీరు కారులో వెళ్తూ స్పీడ్ బ్రేకర్ ని ఎదుర్కొన్నప్పుడు. సాధారణంగా ఈ టార్క్ అనేది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే తక్కువ వేగం లో ఎక్కువ పవర్ ను ఉత్పత్తి అవసరం అయ్యే సందర్భంలో ఎక్కువ గా ఉపయోగం ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియను మనం టార్క్ అని అంటాము.
ఉదాహరణకు మీరు రోజు వారి సందర్భంలో చూసుకున్నట్లయితే మీరు కారులో వెళుతున్నప్పుడు మీకు రోడ్డుపై ఎదురుగా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డంగా వచ్చినప్పుడు మీరు ఆ స్పీడ్ బ్రేకర్ దాటడానికి యాక్సిడెంట్ ఇవ్వాల్సిన పని లేకుండా కొంచెం క్లచ్ ని వదిలినట్టయితే అప్పుడు మీ కారు కి ఎక్కువ టార్క్ ఉంటే అది చాలా సులభంగా ఆ స్పీడ్ బ్రేకర్ ను దాటి వేయడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క కారు టార్క్ అనేది తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఆ స్పీడ్ బ్రేకర్ దాటడానికి మరింత యాక్సిలరేటర్ ను పెంచవలసిన అవసరం ఉంటుంది. ఇలా ఇలాంటి సందర్భంలో టార్క్ అనేది మీకు ఉపయోగపడటం జరుగుతుంది. సాధారణంగా పెట్రోల్ కార్ తో పోలిస్తే డీజిల్ కారు లో కొంచెం ఎక్కువగా టార్క్ లభిస్తుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇలా ఈ విధంగా టార్క్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఆర్.పి.ఎం అంటే ఏంటి ?
ఇప్పుడు మనం ఆర్.పి.ఎం గురించి తెలుసుకుందాం సాధారణంగా చాలామంది టార్క్ ఇంకా ఆర్.పి.ఎం ఒకటే అని అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు టార్క్ కి మరియు ఆర్.పి.ఎం కి చాలా తేడా ఉంది. ఆర్ పి యం అంటే రెవల్యూషన్ పెర్ మినిట్ అని అర్థం(Revolutions Per Minute), అంటే ఒక నిమిషంలో ఎన్ని సార్లు తిరిగిందో దాన్ని ఆర్ పి యం అనడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక కారు చక్రం ఒక నిమిషానికి తిరిగిన సంఖ్య అనేదాన్ని ఆర్.పి.ఎం అని అనడం జరుగుతుంది. ఇక ఇంజన్ లో చూసుకుంటే మనకి ఒక బోర్ అనేది ఉంటుంది ఆ యొక్క బోర్ లో పిస్టన్ అనేది ఉంటుంది.
అలాగే ఈ పిస్టన్ యొక్క పై భాగంలో ఫ్యూయల్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది, ఇలా పై భాగంలో ఫీల్ బర్న్ అయినప్పుడు పిస్టన్ మీద ప్రెజర్ అనేది పడుతుంది అంటే ఒత్తడి. ఇక దీనివల్ల ఈ పిస్టన్ అనేది బోరు నుంచి ఒకసారి కిందకి వస్తుంది, ఇక ఈ పిస్టన్ అనేది కిందికి వచ్చినప్పుడు దాని చివరి భాగం అనేది క్రాగ్ షాఫ్ట్ అనే దానికి కలపడం జరుగుతుంది. ఈ పిస్టన్ చివరి యొక్క లింక్ అనేది క్రాగ్ షాఫ్ట్ తో జోడించి ఉంటుంది. పైకి కిందకి వెళ్ళినప్పుడు క్రాగ్ షాఫ్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది, ఇలా క్రాగ్ షాఫ్ట్ అనేది ఒక నిమిషంలో ఎన్ని సార్లు తిరుగుతుందో దాన్ని ఆర్ పి ఎం అని అంటారు.
బి హెచ్ పి అంటే ఏంటి ?
బి హెచ్ పి అంటే బ్రేక్ హార్స్ పవర్ అని అర్థం. దీన్ని మొట్టమొదటిసారిగా జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆయన అతని గుర్రం సహాయం తో లెక్కించారు ఎలాగంటే అతని యొక్క గుర్రము 75 కిలోల బరువును ఒక నిమిషంలో ఒక మీటర్ దూరాన్ని లాగినటువంటి ప్రమాణాన్ని హార్స్ పవర్ గా తీసుకోవడం జరిగింది. ఒక హార్స్ పవర్ అనేది 735.5 వాట్స్ కు సమానము అని చెప్పి ఆయన లెక్కించడం జరిగింది, దాన్నే మనం ఇప్పటివరకు కూడా వాడుతూ ఉన్నాం. అయితే సాధారణంగా మనకు వెహికల్స్ లో టార్క్ ఎక్కడ ఉపయోగపడుతుంది బి హెచ్ పి ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయం మనం చర్చించి నట్లయితే, ఏదైనా వెహికల్ అనేది పికప్ కోసం టార్క్ అనేది కావాలి.
అలాగే బురద, ఇసుక లాంటి దారుల్లో స్మూత్ గా వెళ్లడానికి టార్క్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఎక్కువ లోడ్ అనేదాన్ని లాగడానికి కూడా టార్క్ అనేది అవసరం అవుతుంది. ఇక హార్స్ పవర్ వల్ల ఉపయోగం ఏంటంటే వెహికల్ అనేది టాప్ స్పీడ్ ను అందుకోవడానికి హార్స్ పవర్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక వెహికల్ ను సులభంగా దాటి ముందుకు వెళ్ళడానికి హార్స్ పవర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా టార్క్ ఎక్కువ ఉంటేనేమో పికప్ ఎక్కువగా ఉంటుంది, హార్స్ పవర్ ఎక్కువ ఉంటేనేమో స్పీడ్ ఎక్కువ ఉంటుంది.