ఫోర్డ్ భారత మార్కెట్‌ను ఎందుకు విడిచిపెట్టింది?

ఫోర్డ్ భారత మార్కెట్‌ను ఎందుకు విడిచిపెట్టింది?


    ఇటీవలి సంవత్సరాలలో ఇండియా నుండి పూర్తిగా వెళ్లిపోయిన అతిపెద్ద కంపెనీల లో ఫోర్డ్ మోటార్స్ ఒకటి. ఈ ఫోర్డ్ కంపెనీ అనేది కార్లు తయారు చేసే ఒక అమెరికన్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ప్రసిద్ధి చెందిన స్థానంలో ఉన్న ఈ ఫోర్డ్ కంపెనీ ఇండియాలో మాత్రం నష్టాలను తట్టుకోలేక ఇండియన్ మార్కెట్ ను వదిలి వెళ్ళిపోయింది. అసలు ఈ ఫోర్డ్ కంపెనీ ఇండియా లో ఎందుకు విఫలం అయింది? ఫోర్డ్ కంపెనీ భారత్ మార్కెట్ ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది?. అలా వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.


    మొదటగా మన ఇండియా విషయానికొస్తే మనది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగిన దేశం. అలాగే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా అయితే భారత మార్కెట్లో ఏ ఆటోమొబైల్ కంపెనీ అయిన నిలబడాలి అంటే అందుకు సరైన ప్రణాళిక అవసరం. అలాగే మిగతా దేశాల లో పని చేసినటువంటి ప్రణాళికలు భారతదేశంలో పని చేయవచ్చు చేయకపోవచ్చు. కనుక ఎప్పటికప్పుడు కంపెనీ జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ కంపెనీ ఏ చిన్న పొరపాటు చేసిన భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.


ఫోర్డ్ కంపెనీ ఇండియా కి ప్రవేశించడం


    ఇక ముందు గా ఫోర్డ్ విషయానికి వస్తే ఫోర్డ్ కంపెనీ అనేది ఒక అమెరికన్ కార్ బ్రాండ్. మన భారతదేశంలో ఫోర్ట్ మోటార్స్ ప్రయాణం అనేది వందేళ్ళ క్రితం నాటిది, అనగా 1920లో మొదటగా ప్రారంభమయ్యింది. కెనడాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ గా మొదటగా ఫోర్డ్ ఇండియా లోకి ప్రవేశించింది. 30 ఏళ్లు ప్రయత్నించిన ఇక్కడ విజయం రాకపోవడంతో ఆ తర్వాత 1950 కాలంలో ఇండియా ని వదిలిపెట్టి మొదటిసారిగా నిష్క్రమించింది. మరల మరొక 45 ఏళ్ల తర్వాత తిరిగి 1995లో ఫోర్డ్ మోటార్స్ భారత్ కి తిరిగి వచ్చింది. ఇలా రెండోసారి వచ్చినప్పుడు తమ వ్యాపారాన్ని భారతదేశానికి చెందిన మహేంద్ర సహకారంతో భారతదేశంలో తమ రెండవ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


మహేంద్ర ఫోర్డ్ ఇండియా లిమిటెడ్


    ఆ సమయంలో ఈ రెండు కంపెనీలు కలిసి మహేంద్ర ఫోర్డ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ  స్థాపించారు. అలాగే తర్వాతి సంవత్సరంలో అనగా 1996లో తమ మొట్టమొదటి ఉత్పత్తి గా పోర్ట్ ఎస్కార్ట్ ను తయారు చేసి మార్కెట్లోకి లాంచ్ చేశారు. పోర్ట్ ఎస్కార్ట్ అనేది ఒక యూరోపియన్ మోడల్. అలా మూడు సంవత్సరాలు గడిచిందో లేదో కొన్ని అంతర్గత కారణాల వల్ల ఫోర్డ్ మరియు మహీంద్రా కంపెనీ ల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ రెండు కంపెనీలు విడిపోయాయి.


ఫోర్డ్ మోటార్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్


    ఇక ఫోర్ట్ కంపెనీ 1998లో ఫోర్డ్ మోటార్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది. ఇక ఆ తర్వాత నుంచి ఫోర్ తమ సొంత ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా తమ కంపెనీ తరపు తరపున ఇండియాలో తమ రెండవ ఉత్పత్తిగా ఫోర్డ్ ఐకాన్ అనే కారును 1999లో లాంచ్ చేసింది. ఇది విక్రయాల పరంగా కొంచెం మెరుగ్గా ఉండింది. ఇక ఆ తర్వాత 2001 లో మూడవ మోడల్ గా ఫోన్ మాండ్యా ఇండియాలో లాంచ్ చేసింది, ఇది ఊహించినంత విజయాన్ని తీసుకురాలేకపోయింది. 


ఫోర్డ్ ఎండీవర్


    ఇక ఆ తరువాత 2003లో ఫోర్డ్ ఎండీవర్ ను లాంచ్ చేసింది, ఇండియాలో ఫోర్డ్ కంపెనీ ని బలంగా నిలబెట్టిన మోడల్ ఇది అని చెప్పవచ్చు. 2003లో లాంచ్ అయిన మీ ఫోర్డ్ ఎండీవర్ కి క్రేజ్ పెరిగింది తప్ప తగ్గలేదు. ఇది ఒక పవర్ ఫుల్ ఎస్ యు వి దీన్ని చాలా మంది ఇష్టపడ్డారు. దీని యొక్క డిజైన్ మరియు రోడ్డు ప్రసన్స్ వల్ల టయోటా ఫార్చునర్ వంటి పెద్ద పెద్ద  ఎస్ యు వి లకు గట్టి పోటీ ఇచ్చింది.


    ఇక ఆ తరువాత 2004లో ఫోర్డ్ ఫ్యూజన్ అనే కారును రిలీజ్ చేశారు. ఇది ఊహించిన స్థాయిలో విజయాన్ని తీసుకురాలేదు. ఇక ఆ తర్వాత 2005 లో ఫోర్డ్ ఫిస్టా అనే కారును రిలీజ్ చేశారు ఇది కొంతవరకు ప్రజలను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత 2018లో ఫోర్డ్ ఫిగో ని లాంచ్ చేశారు, ఈ ఫిగో అనేది సబ్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్  రంగంలో తన తోటి పోటీ దారుల తో బాగానే పోటీకి నిలబడింది. ప్రజలు కూడా దీన్ని బాగానే ఆదరించారు.


ఫోర్డ్ ఎకోస్పోర్ట్


    ఇక ఆ తరువాత 2013లో ఫోర్డ్ నుంచి మరొక ఆణిముత్యం బయటకు రావడం జరిగింది అదే ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఈ ఫోర్డ్  ఈకోస్పోర్ట్ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ ను ఇండియాలో బాగా పెంచిన కారు గా దీన్ని చెప్పవచ్చు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కారు అనేది చాలా బాగుంటుంది, ఈ కారు అనేది అన్ని రకాల కేటగిరి కస్టమర్లను తన వైపుగా బాగా ఆకట్టుకుంది. దీంతో ఫోర్డ్ కంపెనీ తరఫున బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా ఇది నిలిచిపోయింది. ఇప్పటికి కూడా ఈ కారు ఎంతోమందికి చాలా ఇష్టం. ఆ తర్వాత 2016లో ఫోర్డ్ ముస్తాంగ్. మరల 2018లో ఫ్రీ స్టైల్ ని లాంచ్ చేశారు, కానీ అది ఊహించినంత విజయాన్ని తీసుకురాలేదు. ఇలా ఈ విధంగా 1996 నుంచి 2018 వరకు అనగా 22 ఏళ్ల వ్యవధిలో ఫోర్డ్ ఇండియా లో పది రకాల కార్లు మోడల్ ను మాత్రమే రిలీజ్ చేసింది.


ఫోర్డ్ వైఫల్యం 


    ఈ సంఖ్య అనేది తమ పోటీదారుల తో పోలిస్తే చాలా తక్కువ. ఇది కూడా తమ విఫలానికి ఒక కారణం అయ్యింది ఎందుకంటే కస్టమర్లకు ఫోర్డ్ కంపెనీ లో కొన్ని మోడల్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి, దాంతో వేరే కంపెనీ లో ఎక్కువ సంఖ్యలో మోడల్ అందుబాటులో ఉండటంతో వారి ఇష్టాలకు అనుకూలంగా దొరికిన ఇతర బ్రాండ్లకు మారిపోయారు. అది క్రమక్రమంగా ఫోర్డ్ కంపెనీ సేల్స్ పై గట్టి ప్రభావాన్ని చూపించింది, అది ఎలా అంటే ఇండియాలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఫోర్డ్ కి ఉన్న సొంత తయారీ కేంద్రాల్లో తయారీ అయిన ప్రొడక్షన్ లో ఇంజన్లలో 40%, కార్లలో 20% ప్రొడక్షన్ ను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకోవాల్సి వచ్చింది.


నష్టాల్లో కూరుకుపోయిన ఫోర్డ్ కంపెనీ 


    ఇక 2010 సమయంలో మార్కెట్ అమ్మకాల్లో ఫోర్డ్ కంపెనీ కి దాదాపు నాలుగు శాతం వాటా ఉండేది, 2020 కల్లా అది కూడా సగానికి సగం పడిపోయింది. దీంతో కంపెనీ భారత మార్కెట్లో అనేక కష్టాలను ఎదుర్కొంది. సుమారు రెండు బిలియన్ డాలర్ల నష్టం రావడం వల్ల ఇక ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ని చాలా దెబ్బకొట్టింది. ఇక దీంతో బిజినెస్ ఇండియాలో నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా చివరికి సెప్టెంబర్ 2021 లో ఫోర్డ్ అనేది ఇండియా ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 


పాత కస్టమర్ల ఆవేదన


    దీంతో ఇది ఇలా ఇండియా ని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో గతంలో ఫోర్డ్ కంపెనీ కారులను కొన్న కస్టమర్లు అంతా అయోమయంలో పడ్డారు. అయితే తమ కస్టమర్లకు కావలసిన మద్దతును మాత్రం లభిస్తూనే ఉంటుంది అని హామీ ఇచ్చింది. వెళ్లిపోయిన తర్వాత కూడా సర్వీస్ ను స్పేర్ పార్ట్స్ అందిస్తూనే ఉంటామని ప్రజలకు మాట ఇచ్చింది.


ఫోర్డ్ కంపెనీ చేసిన పొరపాట్లు 


    ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో తమ ఉత్పత్తులను నిలిపివేసిందంటే అందుకు మొదటి కారణం డిమాండ్ లేకపోవడం. రెండవ కారణం భారతదేశం కార్లు మార్కెట్ లో ప్రధానంగా సుజుకి, హుండాయ్ కంపెనీ కార్లు తమ కార్లను మార్కెట్లో తక్కువ ధరలకే అందిస్తూ ఆధిపత్యం చాలా ఇస్తున్నాయి. కానీ ఫుడ్ మాత్రం ధరల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఇక అలాగే హుండాయ్, ఫోర్డ్ అనే ఈ రెండు కంపెనీలు కూడా 1990 లోనే భారతదేశంలోకి ప్రవేశించాయి, కానీ వ్యాపార విషయానికొస్తే రెండు కంపెనీలు భిన్నమైన పద్ధతులు పాటించాయి. అందువల్లనే హుండాయ్ దేశంలో ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది, కానీ ఫోర్డ్ మాత్రం తమ కంపెనీ ని మూసివేసే స్థాయికి పడిపోయింది.


    ఇక మూడవ కారణం వినియోగదారుల అసంతృప్తి, సర్వీస్ విషయంలో వారికి అసంతృప్తిని మిగిల్చింది. స్పేర్ పార్ట్స్ అనేవి భారతదేశంలో తయారీ కాకపోవడం వల్ల అవి వచ్చేవరకు వినియోగదారుడికి తిప్పలు తప్పేది కాదు. ఇక చివరిగా ఫోర్డ్ కంపెనీ భారత దేశ మార్కెట్ ను సరిగ్గా పరిశీలించ లేకపోయింది, ఉత్పత్తి కూడా సరిగ్గా చేయలేదు. ప్రజల అవసరాలను బట్టి వారిని వారు అభివృద్ధి చేసుకోలేదు, ప్రజల ఇష్ట ఇష్టాల పైన దృష్టి పెట్టలేదు అందువల్ల ప్రజల ఫోర్డ్ కంపెనీ ని దూరం పెట్టారు.


కొత్తది పాతది