బెస్ట్ బడ్జెట్ SUV: 2024 నిస్సాన్ మాగ్నైట్ పూర్తి వివరాలు

 బెస్ట్ బడ్జెట్ SUV: 2024 నిస్సాన్ మాగ్నైట్ పూర్తి వివరాలు


    నిస్సాన్ కాంటాక్ట్ ఎస్ యు వి, నిస్సాన్ మాగ్నైట్ పేస్లిప్ట్ 2024 ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. ఒక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ వెహికల్ వచ్చేటువంటి ధరలో నే మనకు నిస్సాన్ మాగ్నైట్ కాంటాక్ట్ ఎస్ యు వి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం హ్యాచ్ బ్యాక్ కారుతో కంపేర్ అంటే పోల్చినట్లు అయితే ఈ కాంటాక్ట్ ఎస్ యు వి లో మనకు అదనంగా ఎలాంటి ఫీచర్స్ లభిస్తాయి, అలాగే ఈ కారు యొక్క టాప్ వేరియెంట్ లో కొత్తగా మార్చిన టువంటి పార్ట్స్ ఏంటి అలాగే కొత్తగా చేసినటువంటి మార్పులు ఏంటి, దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది ఇలా మొదలైనటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. అలాగే దీని యొక్క కంఫర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇంకా దీని టర్బో చార్టెడ్ పెట్రోల్ ఇంజన్ యొక్క శక్తి ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది అనేది ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు.

ఫ్రంట్ డిజైన్ అలాగే ఫీచర్స్


    ఫ్రంట్ డిజైన్ అలాగే ఫీచర్స్ గురించి మనం మాట్లాడే కున్నట్లయితే చాలా పెద్ద మార్పు అనేది మీరు ఈ కారు యొక్క ఫ్రంట్ అంటే ముందు భాగం యొక్క గ్రిల్ దగ్గర గమనించవచ్చు. అంటే ముందు మోడల్ లో ఉండే గ్రిల్ సైజ్ తో పోలిస్తే దీని యొక్క సైజు కొంచెం పెరిగింది అని చెప్పవచ్చు. అలాగే ముందు లా కాకుండా దాన్ని డార్క్ క్రోమ్ ఫినిషింగ్ తో తీసుకురావడం జరిగింది. ఇది ఈ కారుకి మరింత అందాన్ని ఇస్తుంది అలాగే ఆకర్షణీయమైన కారుగా దీన్ని చూపిస్తుంది. ముందు భాగం గ్రిల్ సైజ్ ను పెంచడంతోపాటు దాని చుట్టూ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగింది ఇది కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్ తో పాటు కింద చూసుకున్నట్లయితే సిల్వర్ ఫినిషింగ్ స్కిడ్ ప్లేట్ యొక్క డిజైన్ కూడా కొంతవరకు మార్చడం అనేది జరిగింది. అలాగే అక్కడ ఫాగ్ లాంప్ అనేది అమర్చడం జరిగింది. 


    ఇక హెడ్ లైట్స్ పరంగా ఎలాంటి మార్పు అనేది జరగలేదు. ఎల్ ఈ డి డి ఆర్ ఎల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ కారు యొక్క టాప్ వేరియంట్ లో 360 డిగ్రీ కెమెరా అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కారు యొక్క తాళం చెవి లో వీళ్ళు ఇచ్చినటువంటి ఒక స్మార్ట్ ఫీచర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ కారు యొక్క కి అంటే తాళం చెవి తో పాటు కారు దగ్గరకు వెళ్ళినప్పుడు కారు అనేది ఆటోమేటిక్ గా అంటే దానంతట అదే ఆన్ లాక్ అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఆ కారు యొక్క కి తో పాటు అంటే తాళం చెవితో పాటు మీరు దూరంగా వెళ్ళినప్పుడు కారు ఆటోమేటిక్ గా లాక్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు మళ్ళీ దగ్గరకు వెళ్ళినప్పుడు అన్లాక్ అవుతుంది. ఇది ఒక స్మార్ట్ ఫీచర్ అలాగే ఇది కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.


సైడ్ ప్రొఫైల్


    ఇక ఈ కారు సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఈ కారు యొక్క సైడ్ ప్రొఫైల్ చాలా ఆకర్షణీయంగా అలాగే చూడముచ్చటగా కనిపిస్తుంది. 16 ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు తో పోల్చినట్లయితే వీటి డిజైన్ కూడా మార్చడం జరిగింది ఇక్కడ చేసినటువంటి మార్పు కూడా చాలా బాగుంటుంది. ఇందులో వి లాచ్ అలాగే బాడీ క్లాడింగ్ కూడా పూర్తిగా బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది. ఇక బేస్ వేరియంట్ నుంచే క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అలాగే ఈ కారు యొక్క టాప్ వేరియంట్ లో  డ్రైవర్ వైపు మాత్రమే కాకుండా ఇంకో వైపు కూడా పాసివ్ కి లెస్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బేస్ వేరియంట్ నుంచి రూఫ్ రైల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సుమారు యాభై కిలోల బరువు ను మోయగల గుతాయి. అలాగే మనకు ఓ ఆర్ వి ఎం అనేది కూడా  ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి 360 డిగ్రీ కెమెరా అనేది కూడా ఉంటుంది.


2024 నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్లు


    2024 నిస్సాన్ మాగ్నైట్ SUV ప్రస్తుతం మనకు 6 వేరియంట్లలో అందుబాటులో లభిస్తుంది అవి Visia, Visia Plus, Acenta, N-Connecta, Tekna, మరియు Tekna Plus. ఈ ఆరు వేరియంట్ లో ఎక్స్ షోరూం ధరలు అలాగే వాటి ఫీచర్లను కింద తెలపడం జరిగింది.


వేరియంట్లు మరియు ధరలు

  1. విసియా (Visia): ₹5.99 లక్షలు - బేస్ వేరియంట్/మోడల్ తక్కువ ఫీచర్స్ తో వస్తుంది.

  2. విసియా ప్లస్ (Visia Plus): ₹6.75 లక్షలు - అదనపు సౌలభ్య ఫీచర్లతో వస్తుంది. 

  3. అసెంటా (Acenta): ₹7.50 లక్షలు - మిడ్-లెవల్ ఫీచర్లు మరియు సౌకర్యాల తో వస్తుంది.

  4. N-కనెక్టా (N-Connecta): ₹8.75 లక్షలు - అధునాతన టెక్నాలజీ మరియు కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

  5. టెక్నా (Tekna): ₹9.75 లక్షలు - మెరుగైన ఇంటీరియర్ మరియు అదనపు ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

  6. టెక్నా ప్లస్ (Tekna Plus): ₹11.50 లక్షలు - టాప్-ఎండ్ వేరియంట్, అధునాతన సదుపాయాలతో వస్తుంది

  7. ప్రతి వేరియంట్ యొక్క ఫీచర్లు

  1. విసియా (బేస్ వేరియంట్)
  • 1.0L పెట్రోల్ ఇంజిన్

  • మాన్యువల్ ట్రాన్స్‌మిషన్

  • LED DRLs

  • మాన్యువల్ AC

  • ఫ్రంట్ పవర్ విండోస్

  • డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్

  • ABS మరియు EBD

  1.  విసియా ప్లస్

  • 16-అంగుళాల స్టీల్ వీల్స్ (కవర్‌తో)

  • రియర్ పవర్ విండోస్

  • సెంట్రల్ లాకింగ్

  • హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

  • అదనపు ఫీచర్లు

  1. అసెంటా

  • 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (Apple CarPlay, Android Auto)

  • రియర్‌వ్యూ కెమెరా

  • స్టీరింగ్ మౌంట్ కంట్రోల్

  • ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ORVMs

  • మిడ్-లెవల్ ఫీచర్లు

  1.  N-కనెక్టా

  • అధునాతన టెక్నాలజీ

  • నిస్సాన్ కనెక్ట్ ఫీచర్లు

  • క్రూజ్ కంట్రోల్

  • వైర్లెస్ చార్జింగ్

  • పుష్-బటన్ స్టార్ట్

  1. టెక్నా

  • ప్రీమియం ఫీచర్లు

  • LED హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్

  • డ్యుయల్-టోన్ రూఫ్

  • రియర్ AC వెంట్స్

  • 7-అంగుళాల TFT డిస్‌ప్లే

  1. టెక్నా ప్లస్ (టాప్ వేరియంట్)

  • టాప్ ఫీచర్లు

  • 360-డిగ్రీ కెమెరా

  • లెదర్‌ఎట్ అప్హోల్స్టరీ

  • JBL ప్రీమియం ఆడియో సిస్టమ్

  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

  • అంబియంట్ లైటింగ్​ 

 కారు వెనుక భాగంలో 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్ ఇవ్వడం జరిగింది, ఇది పార్కింగ్  సమయంలో చాలా బాగా
ఉపయోగపడతాయి. వెనకాల ఉన్నటువంటి బంపర్ డిజైన్ కూడా కొంతవరకు మార్చడం జరిగింది. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే
ఈ కారు లో  336 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. టూల్ కిట్ తో పాటు 14 ఇంచుల స్టీల్ స్క్వేర్ వీళ్ళు కూడా వీళ్ళు
ఇవ్వడం జరిగింది ఇది కాకుండా అని 336 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. ముందు మోడల్
తో పోలిస్తే ఈ కారు ఈ యొక్క సీట్ క్యూస్షన్ అనేది చాలా బాగా తయారు చేయడం జరిగింది. ఇది చాలా సౌకర్యవంతంగా
ఉంటుంది అలాగే డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే థై సపోర్ట్ కూడా అనుకూలంగా ఇంకా
సౌకర్యంగా ఉంటుంది అలాగే అందరి పొడవుకు తగ్గట్టుగా నీ రూమ్  అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బేస్ వేరియంట్ నుంచి
కూడా వెనుక భాగంలో ఆర్మ్ రెస్ట్ తో పాటు కప్ హోల్డర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అన్ని సీట్లకు సీట్ బెల్ట్ అనేది కూడా ఇవ్వడం
జరిగింది అలాగే మిడిల్ ప్యాసింజర్ కూడా చాలా సౌకర్యంగా కూర్చోవచ్చు.
కారు యొక్క సైడ్ డోర్ లో మొత్తం కూడా లెదర్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది అందువల్ల ఇది ఒక లగ్జరీ కార్ లాగా కనిపిస్తుంది
అంటే ఇది ఒక ఖరీదైన కారు గా కనిపిస్తుంది. డిజైన్ పరంగానే కాకుండా నీ ముట్టుకోనప్పుడు అలాగే దీనిపై చేయి పెట్టి రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది.
దానికి తగిలినప్పుడు మంచి అనుభూతిని ఇస్తుంది. డ్రైవర్ విండో చేసుకున్నట్లు అయితే ఆటో అప్ అలాగే ఆటో డౌన్ వంటి ఫీచర్లతో
ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ గా ఓ ఆర్ ఎం అడ్జస్ట్ చేసుకోగలిగేలా ఒక బటన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీట్లు కూడా
పూర్తిగా లెదర్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ తో రావడం జరుగుతుంది.  ఇక స్టీరింగ్ చూసినట్లయితే మొత్తం లెదర్ ఫినిషింగ్ తో ఇవ్వడం జరుగుతుంది. స్టీరింగ్ మీద పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా అందంగా ఉంటుంది అలాగే కారు కు మరింత స్పోర్టివ్ గా ఉండే విధంగా ఉంటుంది. వాయిస్ కమాండ్ ఇంకా ఆడియో కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా కార్ స్టీరింగ్ పైన ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన బటన్స్ అన్నీ కూడా కారు యొక్క స్టీరింగ్ పైనే అమర్చారు ఇది వాడటానికి  చాలా సులువుగా ఉంటుంది. కార్ డ్రైవర్ స్టీరింగ్ పక్కన ట్రాక్షన్  కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ అలాగే హెడ్ లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్ బటన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇవే 2024 నిస్సాన్ మాగ్నైట్ పూర్తి వివరాలు, వాళ్ళు పెట్టిన ధరను బట్టి ఆ బడ్జెట్ లో ఇదే ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ గా ఉన్న వాటిలో బెస్ట్  SUV వి అని చెప్పవచ్చు.


కొత్తది పాతది