హోండా అమేజ్ 2024 పూర్తి వివరాలు

 

హోండా అమేజ్ 2024 పూర్తి వివరాలు


    హోండా కంపాక్ట్ 3rd జనరేషన్, హోండా అమేజ్ ఇటీవల లంచ్ అవ్వడం జరిగింది. ఇది 3rd జనరేషన్ పేస్లిప్ట్ అయినప్పటికీ కూడా దాదాపుగా నెక్స్ట్ జనరేషన్ కారు లాగా దీన్ని డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అనేక మార్పులు చేర్పులు చేసి లాంచ్ చేయడం జరిగింది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ కారు యొక్క డిజైన్ బిల్ట్ క్వాలిటీ మీరు గమనించినట్లయితే మీరు కూడా తప్పకుండా అలాగే అనుకుంటారు. ఇంతకుముందు తో పీల్చినట్లయితే ఫీచర్ల పరంగా కూడా దీంట్లో చాలా మార్పులు అనేవి చేసి లాంచ్ చేయడం జరిగింది. ఇంతకు ముందులాగా ఇది కూడా మూడు వేరియంట్లలో అవైలబుల్ గా ఉంది, అది V, VX ఇంకా ZX ఇలా మూడు వేరియంట్లలో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈ కారు యొక్క టాప్ వేరియంట్ అయిన ZX పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఈ జెడ్ ఎక్స్ వేరియంట్ లో ఎలాంటి ఫీచర్లు అనేది ఇవ్వడం జరిగింది అలాగే మిగతా వేరియంట్లు పరంగా దీని ధర ఎంత చివరికి దీని ఇంజన్ గురించి అన్ని వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా వివరంగా తెలుసుకోండి.


హోండా అమేజ్ సెడాన్  ఆన్ రోడ్ ధర

  1. మైలేజ్ : ARAI ప్రకారం హోండా అమేజ్ సెడాన్ సగటుగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 18.6 kmpl అలాగే ఆటోమేటిక్ వేరియంట్ 18.3 kmpl మైలేజ్ ఇస్తుంది అని సమాచారం.

  1. ఇంజన్ : హోండా అమేజ్ 1.2 లిటర్స్ 4 సిలిండర్ ఇంజన్ తో లభిస్తుంది.
  1. ధరలు : V, VX ఇంకా ZX మూడు మోడల్స్రెం తో రెండు వేరియంట్ లో లభిస్తుంది అవే మాన్యువల్(MT) ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్(CVT)
  • Manual Transmission(MT)
  • Continuously Variable Transmission(CVT)
  • V Manual Transmission                             - 9.84L
  • V Continuously Variable Transmission      - 11.43L
  • VX Manual Transmission                          - 11.12L
  • VX Continuously Variable Transmission   - 12.48L
  • ZX Manual Transmission                           - 11.82L
  • ZX Continuously Variable Transmission   - 13.66L


బేసిక్ ఫీచర్స్ 


    గ్లోబల్ ఎంసీఏపీ అయితే ఇప్పటివరకు అంటే 17 జనవరి 2024 తేదీ నాటికి ఈ కారును క్రాష్ టెస్ట్ అనేది చేయలేదు, కానీ ఈ కారు యొక్క బిల్ట్ క్వాలిటీ పరంగా చూస్తే మంచి రేటింగ్ను పొందుతుంది అని మనం అనుకోవచ్చు. అదే కాకుండా దీని బేస్ వేరియంట్ నుంచి మీకు  6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం అనేది మంచి విషయం అని చెప్పవచ్చు. అలాగే దీంతోపాటు ఏ బి ఎస్ (ABS) అంటే యాంటీ  లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే ఈ బి డి (EBD ) అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం, ఇంకా బి ఎ (BA) అంటే బ్రేక్ అసిస్ట్ అని అర్థం,ఈ ఎస్ పి (ESP) అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం అని అర్థం, ఇంకా హిల్ హోల్డ్ కంట్రోల్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఇలా మొదలైనటువంటి అన్ని ఫీచర్లను కూడా బేస్ వేరియంట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పవచ్చు, రోజు కారు నడిపే సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క ఫీచర్ కి దాని యొక్క ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత ఉంది, ఇలా ఇవి సందర్భాన్ని బట్టి అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. 


4 సిలిండర్ ఇంజన్


    ప్రస్తుతం కారు మార్కెట్ రంగంలో పర్టిక్యులర్గా నాలుగు సిలిండర్ ఇంజన్ లు అనేవి కనుమరుగు అవుతున్న టువంటి ఈ తరుణంలో కూడా హోండా కంపెనీ ఇప్పటికీ కూడా మనకు కాంపాక్ట్ సెడాన్ లో 4 సిలిండర్ ఇంజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అలాగే చాలా ఉపయోగకరమైన విషయం కూడా. ఇది 1.2 లీటర్ ఫోర్(4) సిలిండర్ నేచురల్ ఆస్తి రేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క లేఅవుట్ అనేది కూడా చాలా చక్కగా చేయడం అనేది జరిగింది. డ్రైవర్ క్యాబిన్ వరకు కారు ఇంజన్ యొక్క శబ్దం అనేది కొంచెం కూడా వినపడదు, అంటే అంత స్మూత్ గా ఉంటుంది, ఎలాంటి శబ్దం కూడా మీకు వినబడదు చాలా ప్రశాంతంగా వెళ్లొచ్చు. 4 సిలిండర్ ఇంజన్ అలాగే 3 సిలిండర్ ఇంజన్ ఈ రెండిటికి ముఖ్యమైన తేడా ఏమిటో తెలుసుకోవాలి అంటే ముందు మీరు స్ట్రైక్ గురించి తెలుసుకోవాలి.  


    సాధారణంగా మనకు ఇంజన్ లో నాలుగు స్ట్రోక్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అవే ఇంటెక్, కంప్రెషన్, పవర్, ఇంకా ఎగ్జాస్ట్ ఇలా 4 స్ట్రోక్స్ అనేవి ఉంటాయి. ఈ నాలుగు స్ట్రోక్స్ అనేవి ఒకవేళ నాలుగు సిలిండర్ ఇంజిన్ లో అయితే చాలా చక్కగా ట్యూన్ చేసే అవకాశం అనేది లభిస్తుంది. అప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ కానివ్వండి ఇంకా సౌండ్ కానివ్వండి రాకుండా ట్యూన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కానీ 3 సిలిండర్ ఇంజిన్ అయితే అప్పుడు ఆ మూడు సిలిండర్లలో ఈ నాలుగు స్ట్రోక్స్ ను అమర్చవలసిన అవసరం ఉంటుంది అదే ట్యూన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎంతో కొంత వైబ్రేషన్ ఇంకా ఎంతో కొంత శబ్దం అనేది కచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి 3 సిలిండర్ ఇంజన్ తో పోలిస్తే న్ పి హెచ్ లెవల్స్ కంట్రోల్ చేయడం లో 4 సిలిండర్ ఇంజన్ అనేది చాలా బాగుంటుంది.


కారు ఫ్రంట్ డిజైన్ 


    ఈ కారు యొక్క ముందు భాగం డిజైన్ అనేది హోండా ఎలివేట్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పవచ్చు. దీంట్లో పియానో బ్లాక్ ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగింది, ఇంకా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఎల్ఈడి డి ఆర్ ఎల్(LED DRL), ఎల్ఈడి ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్ ఇలా మొదలైన అన్ని అవసరమైన ఫీచర్లను ఇచ్చారు ఇంకా ఎడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ లో  రెండు ఎంఎం అనేది పెంచడం జరిగింది. ఇంతకుముందు మోడల్ తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ గా అలాగే అనుకూలంగా ఉంటుంది. 


కార్ డైమెన్షన్స్ 


    ఈ కారు యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ కారు యొక్క లెంత్ అంటే పొడవు అనేది 3995 mm ఇక ఈ కారు యొక్క వెడల్పు వచ్చేసి 1733 mm అనేది ఉంటుంది ఇంకా ఈ కారు ఎత్తు విషయానికి వస్తే 1500 mm ఎత్తు ఉంటుంది ఇంకా ఈ కారు యొక్క వీల్ బేస్ అనేది 2470 mm ఉండడం జరిగింది ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 172 mm అనేది ఉంటుంది. ఇక వీల్స్ గురించి మనం చెప్పాలంటే దీని యొక్క బేస్ వేరియంట్ లో 14 నుంచి స్టీల్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే మిడ్ వేరియంట్ లో 15 ఇంచ్ సిల్వర్ ఫినిష్ అల్లాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్  వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. 


కారు రియర్ డిజైన్ 


    ఈ కారు యొక్క రియర్ ప్రొఫైల్ అంటే వెనుక భాగం యొక్క డిజైన్ కూడా చాలా అద్భుతంగా అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ డిజైన్ తో చాలామందిని ఇది ఆకట్టుకుంటుంది. ఈ కారు వెనుక భాగంలో ఉండేటటువంటి టెల్ లాంప్ యొక్క డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఇది ఈ కారు యొక్క అందాన్ని మరింతగా పెంచుతూ ఆకర్షనీయంగా మారుస్తుంది.  ఇంకా రెండు పార్కింగ్ సెన్సార్ అనేవి కూడా ఉంటాయి. వెనుక భాగంలో ఇక బూట్ స్పేస్ గురించి మాట్లాడు కున్నట్లయితే ఇదివరకు 420 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఈసారి 416 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీ లగేజ్ను చాలా సునాయాసంగా తీసుకు వెళ్లే కలిగేంత స్థలం అయితే ఉంటుంది. ఇంకా బూట్ లాంప్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది రాత్రి పూట సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.


కార్ ఇంటీరియర్ డిజైన్ ఇంకా ఫీచర్ లు 


    ఇక ఈ కారు రియర్ సీట్స్ అంటే వెనుక భాగం సీట్లు దగ్గరకు మనం వెళ్ళినట్లయితే అక్కడ థై సపోర్ట్ అలాగే నీ రూమ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మరో విషయం ఏంటంటే ఈ కారు యొక్క వెనుక భాగంలో కూడా ముగ్గురు ప్యాసింజర్లు చాలా సౌకర్యంగా వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కారు యొక్క విడ్త్ అంటే అడ్డంగా కొలత అనేది ఇంతకుముందు మోడల్ తో పోల్చినట్లు 38 mm విడ్త్ అనేది పెంచడం జరిగింది. దీనివల్ల ముగ్గురు ప్యాసింజర్లు అయితే చాలా సౌకర్యంగా వెళ్లే అవకాశం ఉంటుంది, అలాగే 3 పాయింట్ సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ముగ్గురు ప్యాసింజర్ లకు కూడా హెడ్ రెస్ట్ అనేది ఇచ్చారు, ఇంకా కప్ హోల్డర్ తో ఆర్మ్ రెస్ట్  అనేది ఇవ్వడం జరిగింది.


    

స్టీరింగ్ కి కుడి వైపు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ బటన్ అనేది కూడా ఇచ్చారు. ఈ కారు యొక్క ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ అనేది కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ కారులో టాప్ వేరియంట్ యొక్క స్టీరింగ్ లెదర్ ఫినిషింగ్ తో రావడం జరుగుతుంది. ఇదివరకటి మోడల్ లో అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ ఈ హోండా అమేజ్ మోడల్ లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో సగభాగం అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అలాగే మిగతా సగభాగం లో స్క్రీన్ అనేది ఉంటుంది. మనకు విఎక్స్ ఇంకా జెడ్ ఎక్స్ వేరియంట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం అనేది ఇవ్వడం జరిగింది కానీ బేస్ వేరియంట్ లో  మాత్రం మాన్యువల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా విఎక్స్ అలాగే జెడ్ ఎక్స్ ఈ రెండు వేరియంట్ ల లో  వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో 8 ఇంచ్ ఇన్ఫో డైమండ్ టచ్ డిస్ప్లై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.


కొత్తది పాతది