మారుతి డిజైర్ VS హోండా అమేజ్
వేరియంట్స్
- VXI (MT / AMT)
- ZXI (MT / AMT)
- ZXI+ (MT / AMT)
- V (MT / CVT)
- VX (MT / CVT)
- ZX (MT / CVT)
CVT - కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్
AMT - ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్
ధరలు
ఇంజన్ మరియు మైలేజ్:
కాంటాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఇటీవల లాంచ్ అయినటువంటి రెండు ప్రఖ్యాతి అలాగే ప్రేరణ పొందినటువంటి రెండు కార్లు గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రెండు కార్లు, మొదటిది మారుతి డిజైర్ ఇంకా రెండోవది హోండా అమేజ్ ఈ రెండిటి మధ్య తేడాలు అలాగే రెండిటి యొక్క పూర్తి కంపారిజన్ ను మీరు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
వేరియంట్స్ ఇంకా ధరల గురించి మాట్లాడు కున్నట్లయితే మారుతి డిజైర్ అనేది LXI VXI ZXI అలాగే ZXL+ ఇలా 4 వేరియంట్లలో అవైలబుల్ గా ఉంది. ఇక హోండా అమేజ్ అనేది V VX అలాగే ZX ఇలా మూడు వేరింట్లు అవైలబుల్ గా ఉండటం జరిగింది.
మారుతి డిజైర్:
మిగిలిన కంపెనీల తో పోల్చినప్పుడు మారుతి కార్ల యొక్క ఏఎంటీ లో గేర్ షిఫ్టింగ్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది. అయితే హోండా అమేజ్ లో ఇస్తున్నటువంటి సివిటి ఆటోమేటిక్ అనేది మారుతి డిజైర్ లో ఇస్తున్నటువంటి ఏఎంటీ ఆటోమేటిక్ కంటే కూడా స్మూత్ గా అలాగే ఎఫిషియంట్ కూడా ఉంటుంది. మారుతి బేస్ మోడల్ ఎల్ ఎక్స్ ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 8,42,000 ఆన్ రోడ్ ధర ఉంటుంది అలాగే మారుతి డిజైర్ టాప్ వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ ఐ ప్లస్ ఏ ఎం టి ధర 12,93,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇక అమేజ్ వి(V) మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ధర 9,80,000 ఉంటుంది అలాగే అమేజ్ యొక్క టాప్ వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ సివిటి యొక్క ధర 13,66,000 ఉంటుంది. రెండు కార్లు యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో టాప్ వేరియన్స్ అనేవి దాదాపు ఒకటిగానే ధర ఉంటుంది.
ఇక హోండా అమేజ్ లో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అనేది వస్తుంది. ఇది 89 BHP పవర్ ను ఉత్పత్తి చేయగలదు. అలాగే 110 న్యూటన్ మీటర్ టార్క్ ను ఇది ఉత్పత్తి చేయగల శక్తి దీనికి ఉంది. అలాగే మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 18.65 కిలోమీటర్ ఫర్ లీటర్ మైలేజ్ ను క్లీన్ చేస్తుంది అలాగే సివిటి విషయానికి వస్తే 19.46 కిలోమీటర్ ఫర్ లీటర్ ను క్లెయిమ్ చేస్తుంది.
ఇంజన్ పర్ఫామెన్స్
మారుతి డిజైర్ లో ఇస్తున్నటువంటి 3 సిలిండర్ ఇంజన్ కంటే కూడా ఉండ అమేజ్ లో ఇస్తున్నటువంటి 4 సిలిండర్ ఇంజన్ అనేది కచ్చితంగా స్మూత్ గా అలాగే పవర్ఫుల్ గా కూడా ఉంటుంది. కానీ మైలేజ్ విషయంలో మాత్రం హోండా అమేజ్ కంటే కూడా మారుతి డిజైర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అదనంగా 6.14 కిలోమీటర్ మైలేజ్ ను ఇస్తుంది అలాగే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అదనంగా 6.25 kmpl మైలేజ్ అనేది ఇస్తుంది.
సేఫ్టీ ఫీచర్లు
ఇక సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే రెండు కార్లు లో కూడా బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏ బి ఎస్, ఎబిడి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, రియర్ 3 పాయింట్ సీట్ బెల్ట్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్, స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ వార్నింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఇలా మొదలైన ఫీచర్లను అన్ని కూడా ఇవ్వడం జరిగింది.మారుతి సుజుకి డిజైర్ న్యూ జనరేషన్ 11 నవంబర్ 2024 వ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఈసారి ఆకర్షణీయమైన డిజైన్ తో, సన్రూఫ్ లాంటి లగ్జరీ ఫీచర్స్ తో పాటు సాధారణంగా కాకుండా మారుతి సుజుకి సురక్షితమైనది గా 5 స్టార్ రేటింగ్ కారు గా లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ NCAP క్రాస్ టెస్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ పరంగా ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ 34 పాయింట్ల కు 31.24 పాయింట్లు సాధించింది, అలాగే చైల్డ్ సేఫ్టీ పరంగా 49 పాయింట్ల కు 39.2 పాయింట్లు సాధించడం జరిగింది. ఇలా అడల్ట్ సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ అలాగే చైల్డ్ సేఫ్టీ పరంగా 4 స్టార్ రేటింగ్ సాధించడం జరిగింది. మారుతి నుంచి మొట్టమొదటిసారిగా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం అనేది ఈ కారుతో నే మొదలైంది అని చెప్పవచ్చు.
కార్ డైమెన్షన్స్
ముందుగా డైమెన్షన్ గురించి మాట్లాడు కున్నట్లయితే రెండు కార్లు పొడవు ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది.
హోండా అమేజ్ కార్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ కారు యొక్క లెంత్ అంటే పొడవు అనేది 3995 mm ఇక ఈ కారు యొక్క వెడల్పు వచ్చేసి 1733 mm అనేది ఉంటుంది ఇంకా ఈ కారు ఎత్తు విషయానికి వస్తే 1500 mm ఎత్తు ఉంటుంది ఇంకా ఈ కారు యొక్క వీల్ బేస్ అనేది 2470 mm ఉండడం జరిగింది ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 172 mm అనేది ఉంటుంది. ఇక వీల్స్ గురించి మనం చెప్పాలంటే దీని యొక్క బేస్ వేరియంట్ లో 14 నుంచి స్టీల్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే మిడ్ వేరియంట్ లో 15 ఇంచ్ సిల్వర్ ఫినిష్ అల్లాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది.
మారుతి డిజైర్ కారులో CEAT టైర్స్ తో రావడం జరుగుతుంది. అదే కాకుండా దీని పూర్తి వివరాలు చూసుకుంటే 185/65 తో రావడం జరిగింది, దీనిలో 185 వెడల్పు తో వస్తుంది అలాగే 65 అనేది పొడవు మరియు 15 ఇంచ్ అల్లాయ్ తో రావడం జరిగింది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడంతోపాటు 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ఈ కొత్త డిసైర్ 2024 కారు యొక్క వెడల్పు అంటే ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు 3995 mm ఉండడం జరిగింది, అలాగే ఈ కారు యొక్క ఎత్తు 1525 mm ఉంటుంది, అలాగే అడ్డంగా 1735 mm ఉంటుంది, అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ 163 ఎంఎం ఉంటుంది.
ఈ డైమెన్షన్స్ బట్టి హోండా అమేజ్ లో బెటర్ లెగ్ రూమ్ ఉంటుంది అలాగే డిజైన్లు మంచి హెడ్ రూమ్ ఉంటుంది అని చెప్పాలి. ఫ్యూయల్ కెపాసిటీ పరంగా చూస్తే డిజైర్ లో 37 లీటర్లు ఉండగా హోండా అమేజ్ లో 35 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మారుతి డిజైర్ 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది అలాగే హోండా అమేజ్ లో 172 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కాబట్టి ఆఫ్ రోడ్ అలాగే రఫ్ రోడ్ సమయాల్లో అమేజ్ కార్ ను చాలా బాగా వాడుకునే అవకాశం ఉంటుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే మారుతి డిజైర్ లో 382 లీటర్లు ఇవ్వడం జరిగింది అలాగే మారుతి సారీ హోండా అమేజ్ లో 416 లీటర్లు ఇవ్వడం జరిగింది. అంటే అమేజ్ లో 34 లీటర్ బూట్ స్పేస్ అనేది ఎక్కువగా లభించడం జరుగుతుంది.
ఇక వీల్స్ విషయంలో రెండిటి బేస్ వేరియంట్ లో 14 ఇంచెస్ వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే టాప్ వీరి ఇంట్లో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. రెండు కార్లలో సస్పెన్షన్ విషయానికొస్తే ముందు భాగంలో వచ్చేసి మెక్ పర్సన్ స్టార్ట్ అలాగే రేర్ భాగంలో టార్షన్ భీమ్ సస్పెన్షన్ సెటప్ అనేది వస్తుంది. ఇక డిజైన్ పరంగా చూస్తే రెండు కార్లలో కూడా డిజైన్ పరంగా చాలా మార్పులు చేయడం జరిగింది, రెండు కూడా చూడటానికి కొత్త డిజైన్ తో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్స్టీరియర్ పరంగా మారుతి డిజైర్ అలాగే ఇంటీరియర్ పరంగా అమెజ్ బాగుంటుంది.
మారుతి డిజైర్ లో ఏడు కలర్లు అవైలబుల్ గా ఉంటాయి అలాగే మూడు సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్ల వారంటీని ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది హోండా అమేజ్ లో ఆరు కలర్లు అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మూడు సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్లు వారంటీ ప్రొవైడ్ చేయడం జరిగింది