మెర్సిడెస్ బెంజ్ C220d వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇది ఒక లగ్జరీ వర్గానికి చెందిన కారు ఈ కారు కొనడానికి చాలామంది కలలు కంటుంటారు. ఇది జర్మనీలో తయారు చేయబడింది, జర్మన్ కార్స్ యొక్క ఇంజన్ ఇంకా పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. జర్మన్ కార్స్ లో అతి లగ్జరీ వెహికల్ అయితే ఒకటి ఉంది అది కూడా స్టార్టింగ్ రేంజ్ ఏ, దాని పేరే మెర్సిడెస్ బెంజ్ C220d. ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
కార్ ఇంజన్
ఈ కారులో మనకు 4 సిలిండర్ ఇన్లైన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో 197 హెచ్ పి పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 440 న్యూటన్ మీటర్ టార్క్ ను ఈ కారు ఉత్పత్తి చేయగలదు. దీని ధర వచ్చేసి 70 నుంచి 80 లక్షల వరకు ఉంటుంది ఎందుకంటే ఇది ఒక లగ్జరీ కారు కాబట్టి. ఈ వెహికల్ వచ్చేసి టర్బో చార్జర్ వెహికల్ అంటే చాలా మటుకు దీని పవర్ అంతా కూడా మనకు త్రాటిల్ ప్రెస్ మీదనే ఉంటుంది. అలాగే లోపల ఉన్నటువంటి ఇంజిన్ ను డి ఓ హెచ్ సి ఇంజన్ అని పిలవడం జరుగుతుంది. ఈ కారు చాలా వేగంగా వెళ్ళగలదు. ఇది ఒక లగ్జరీ కారు కాబట్టి అలాగే అంత పవర్ఫుల్ ఇంజన్ ఉండడం వల్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కారు నడిపేటప్పుడు మీరు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని ఆస్వాదించవచ్చు, ఇది మాటల్లో వివరించడం కుదరదు.
కార్ కొలతలు
ఇక కొలతల విషయానికొస్తే ఈ కారు యొక్క పొడవు అంటే ముందు భాగం నుండి వెనుక భాగం వరకు 4750 mm ఉండడం జరుగుతుంది. చాలా పొడవైన కారు, ఎందుకంటే ఇది ఒక సెడాన్ కార్ కాబట్టి దీని పొడవు అంతే ఉంటుంది. అడ్డంగా ఇది 1820 mm వెడల్పు అనేది ఉండటం జరుగుతుంది. ఇక దీని ఎత్తు అంటే పొడవు వచ్చేసి 1430 ఎంఎం ఉండడం జరుగుతుంది. ఈ కారు యొక్క వీల్ బేస్ అనేది 2865 mm ఉండడం జరిగింది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 245 కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది. ఈ కారు జీరో అంటే 0 నుండి 100 కిలోమీటర్ ఫర్ అవర్ వేగాన్ని కేవలం 7.3 సెకండ్లలో చేరుకుంటుంది.
5 స్టార్ సేఫ్టీ రేటింగ్
ఈ వెహికల్ అంత వేగంగా వెళ్లడానికి ముఖ్యమైన కారణం దీనికి తొమ్మిది గేర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఇది ఒక లగ్జరీ కార్ అలాగే ప్రఖ్యాతి చెందిన బ్రాండ్ కావడం వల్ల సేఫ్టీ విషయంలో మీరు ఎలాంటి సందేహాలు లేదా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ సేఫ్టీ తో రావడం జరుగుతుంది. అలాగే మీకు అవసరమైన అన్ని ఫీచర్లను కూడా ఈ కారులో ఇవ్వడం జరిగింది. సేఫ్టీ అంటే సురక్షిత పరంగా ఏడు ఎయిర్ బ్యాగులు అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి ఈ ఏడు ఎయిర్ బ్యాగులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. గ్లోబల్ ఎన్ సి ఏ పి ద్వారా పెద్దల నివాసి భద్రత కోసం 35.6 పాయింట్లు మరియు పిల్లల భద్రత కోసం 43.7 పాయింట్లు అనేది సాధించడం జరిగింది.
సి క్లాస్ మరియు ఎస్ క్లాస్
ఈ కారు యొక్క ముందు భాగం చూడటానికి చాలా అద్భుతమైన అలాగే ఆకర్షణీయమైన డిజైన్ తో రావడం జరుగుతుంది. ఈ కారును మనం ఒక బేబీ ఎస్ క్లాస్ గా చెప్పవచ్చు ఎస్ క్లాస్ అంటే చాలా లగ్జరీ వర్గం అని అర్థం. అంటే బెంజ్ కంపెనీ ఎస్ క్లాస్ అలాగే సి క్లాస్ ఇలా రెండు వివిధ రకాలుగా కారు లను తయారు చేస్తుంది. ఎస్ క్లాస్ లో సీ క్లాస్ కంటే కూడా చాలా లగ్జరీగా ఉండటం తో పాటు ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి వాటి ధర కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది.
కానీ ఈ సి క్లాస్ C220d కార్ డిజైన్ కూడా ఇంచుమించుగా ఎస్ క్లాస్ డిజైన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారు యొక్క డిజైన్ అనేది చాలా ఆకర్షణీయంగా అలాగే అందంగా ఉంటుంది. దీన్ని మీరు ముందు నుంచి చూసినప్పుడు ఒక మంచి లగ్జరీ కారు అలాగే చాలా ఖరీదైన కారు అని ఒక భావాన్ని మీ మనసులో కలిగేలా చేస్తుంది. ఒకప్పుడు ఎస్ క్లాస్ ఇంకా సి క్లాస్ ఈ రెండిటికీ డిజైన్ పరంగా అలాగే ఫీచర్స్ పరంగా చాలా విభేదాలు అలాగే తేడాలు అనేది ఉండేది, కానీ ఈ కారులో అలా జరగలేదు. దీని డిజైన్ అలాగే ఫీచర్ల మీద చాలా బాగా దృష్టి పెట్టి ఆకర్షణీయమైన డిజైన్ అలాగే అవసరమైన ఫీచర్లు అన్ని ఇస్తూ ఈ కారణం తయారు చేయడం జరిగింది.
మోడల్ మరియు ధరలు
ఈ మెర్సిడెస్ బెంజ్ సి 220d అనే కారు రెండు మోడల్ లో మార్కెట్లో అవైలబుల్ గా ఉండడం జరిగింది. C220d ప్రోగ్రెసివ్ అలాగే C220d ప్రైమ్ ఇలా రెండు మోడల్ అనేవి ఉన్నాయి. ఇందులో C220d ప్రోగ్రెసివ్ విషయానికి వస్తే ఇది 68 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంది, అలాగే C220d ప్రైమ్ విషయానికి వస్తే సుమారు 65 లక్షల నుంచి 73 లక్షల వరకు ఉంది.
ముఖ్యమైన విశేషాలు…
ఇంజిన్ మరియు పనితీరు
2.0 లీటర్ 4 సిలిండర్ ఇన్లైన్ డీజిల్ ఇంజన్.
9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
23 కిలోమీటర్ వరకు మైలేజ్ ను ఇస్తుంది.
197 హెచ్ పి పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
440 న్యూటన్ మీటర్ టార్క్ ను ఈ కారు ఉత్పత్తి చేయగలదు.
ఇంటీరియర్ మరియు సౌలభ్యం
క్లైమేట్ కంట్రోల్ క్లైమేట్ కంట్రోల్.
12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇవ్వడం జరిగింది.
11.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే అనేది కూడా ఇచ్చారు.
64 రంగుల అంబియెంట్ లైటింగ్.
పవర్ అడ్జస్టబుల్ మరియు మెమరీ ఫీచర్ తో కలిగిన సీట్లు అనేది ఇవ్వడం జరిగింది.
సంరక్షణ/సేఫ్టీ ఫీచర్లు
7 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, అలాగే బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ట్రాక్షన్ కంట్రోల్, అలాగే బ్లైండ్ స్పాట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
గ్లోబల్ ఎన్ సి ఏ పి ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం జరిగింది.
పెద్దల నివాసి భద్రత కోసం 35.6 పాయింట్లు మరియు పిల్లల భద్రత కోసం 43.7 పాయింట్లు అనేది సాధించడం జరిగింది.
ఇతర ఫీచర్లు
ఈ కారులో 360 డిగ్రీ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ కారులో మీకు ఎలాంటి యాంటీనా అయితే కనబడదు. ఎందుకంటే అక్కడ ఏదైతే రేర్ మిర్రర్ ఉందో దీని మీద నే వర్టికల్ లైన్స్ వేసి ఉంటాయి. ఒకవేళ హారిజంటల్ లైన్స్ అనుకో ఇవన్నీ మనకి డిఫ్యూజన్ కొరకు ఉపయోగపడుతుంది అంటే మనకు వేడి గా బయట బాగా కూల్ ఉన్నప్పుడు అది నొక్కగానే మనకు వాటర్ కండెన్స్డ్ అయిపోయింది కాబట్టి ఇది మనకు వేడి నుంచి కొత్త వరకు ఊరటను అందిస్తుంది. అదే స్ట్రెయిట్ లైన్స్ వచ్చేసి దీంట్లో యాంటీనా కింద పనిచేస్తాయి.
ఇక ఈ కారు బూట్ స్పేస్ విషయానికొస్తే ఈ కారులో బూట్ స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కారు కు అవసరమైన స్పేర్ వీల్ మరియు ఇతర సామాన్లు ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ లేకుండా వారు పెట్టడం జరిగింది. ఇక మీరు ఏదైనా మీ వస్తువులను పెట్టుకోవాలంటే వాటి పైన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల బూట్ స్పేస్ అనేది కొంచెం తగ్గింది. ఇంకా ఈ కారులో ఒక విచిత్రమైన అలాగే చాలా కొత్త రకమైన ఫీచర్ అనేది ఒకటి ఉంది అదేంటంటే మీ కారు యొక్క సైడ్ మిర్రర్ లో 360 డిగ్రీ కెమెరా పక్కనే ఒక లైట్ ఎలిమినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఇది బెంజ్ కారు యొక్క లోగో ను రోడ్డుపై చిత్రీకరిస్తుంది అంటే లైట్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే కొత్తగా కూడా ఉంటుంది.
ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే కారులో మొత్తం కూడా మీకు లెదర్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. పొరపాటున కూడా ఎక్కడ హార్డ్ ప్లాస్టిక్ అనేది వాడటం జరగలేదు. పూర్తిగా లెదర్ ఫినిషింగ్ తో రావడం వల్ల చూడటానికి చాలా అందంగా ఉండడంతో పాటు మీరు దాన్ని ముట్టుకున్నప్పుడు మీకు చాలా లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. అంటే ఒక సాధారణమైన కారులో కాకుండా ఒక ఖరీదైన అలాగే లగ్జరీ కారులో వెళుతున్న టువంటి అనుభూతిని అది మీకు అందిస్తుంది. ఈ కారు డోర్ మీద కూడా కొంతవరకు ఆమ్బియంట్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఈ కారు అందాన్ని మరింత గా పెంచుతుంది. హైట్ అడ్జస్ట్మెంట్, సీట్ కంట్రోల్, థై సపోర్ట్, హెడ్ రెస్ట్ ఇలా మొదలైన అన్ని ఫీచర్లను కంట్రోల్ అనేది డ్రైవర్ పక్కన ఉన్నటువంటి కారు డోర్ లో బటన్స్ గా ఇవ్వడం జరిగింది. ఇది వాడటానికి చాలా అనుకూలంగా సులువుగా ఉంటుంది. ఇక ఇది మెర్సిడెస్ బెంజ్ C220d కార్ యొక్క వివరాలు.