టాటా CURVV: పూర్తి వివరాలు & నిజాయితీ రివ్యూ

టాటా CURVV: పూర్తి వివరాలు & నిజాయితీ సమీక్ష


    టాటా కంపెనీ ఈ మధ్యకాలంలో పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ను వాడుతున్నారు అని చెప్పవచ్చు ఎందుకంటే మార్కెట్లోకి టాటా పంచ్ లాంచ్ చేసిన తర్వాత అదేవిధంగా టాటా నెక్సన్ లాంచ్ చేసిన తర్వాత మార్కెట్లో వాటి యొక్క సేల్స్ ఏ విధంగా మంచి స్థాయికి చేరుకున్నాయి అనే విషయం  అందరికీ తెలిసిందే. అందుకే టాటా కంపెనీ కస్టమర్ యొక్క అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని, ఏ ధరలో కారు లాంచ్ చేయాలి అనే ఉద్దేశంతో కస్టమర్స్ యొక్క అవసరాలను బట్టి ఒక పర్ఫెక్ట్ ఎస్ యు వి ని లాంచ్ చేసింది అదే టాటా CURVV. ఈ ఆర్టికల్ ద్వారా మీరు టాటా CURVV యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, ఒకవేళ మీరు ఈ కారు కొనాలనుకుంటే ఈ ఆర్టికల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ కారు కు సంబంధించిన పూర్తి వివరాలను మీకు ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది.


ఇంజిన్ ఎంపికలు
పెట్రోల్:

  • 1.2-లీటర్ టర్బో చార్జర్ ఇంజన్ 120 PS (సుమారు 118 bhp) ఉత్పత్తి చేస్తుంది.1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో చార్జర్ ఇంజన్ 125 PS (సుమారు 123 bhp) అందిస్తుంది.
డీజిల్:
  • 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 4,000 rpm వద్ద 118 PS (సుమారు 116 bhp) మరియు 1,500-2,750 rpm మధ్య 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్
  • 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్.
  • ఆప్షనల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.
ఇంధన సామర్థ్యం (మైలేజ్)
పెట్రోల్ వేరియంట్లు:
  • మాన్యువల్: సుమారు 12 kmpl.
  • ఆటోమేటిక్: సుమారు 11 kmpl.
డీజిల్ వేరియంట్లు:
  • మాన్యువల్: సుమారు 15 kmpl.
  • ఆటోమేటిక్: సుమారు 13 kmpl.
ఎలక్ట్రిక్ వేరియంట్, Curvv EV, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది:
  • 110 kW మోటార్‌తో 45 kWh బ్యాటరీ, 502 km MIDC పరిధిని అందిస్తోంది.
  • 123 kW మోటార్‌తో 55 kWh బ్యాటరీ, 585 km MIDC పరిధిని అందిస్తుంది.
భద్రతా లక్షణాలు
6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి కాబట్టి ఇవి డ్రైవర్ మరియు ప్యాసింజర్ ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తాయి.
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP): కష్టంగా ఉన్న డ్రైవింగ్ పరిస్థితులలో వాహన నియంత్రణను నిర్వహించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS): సడన్ బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్-అప్‌ను నిరోధిస్తుంది, మెరుగైన నియంత్రణను అందిస్తుంది.
వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా: దృశ్య మరియు ఆడియో సౌండ్స హాయాన్ని అందించడం ద్వారా సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పార్కింగ్‌లో సహాయపడుతుంది.
ఇంటీరియర్ ఫీచర్లు
2. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్: కేబుల్స్ అవసరం లేకుండా సౌకర్యవంతమైన ఛార్జింగ్‌ను సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది.
3. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు: ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి ఉపయోగపడతాయి.
4. 6 పవర్డ్ డ్రైవర్ సీటు: సరైన డ్రైవింగ్ సౌకర్యాన్ని నిర్ధారించడానికి వ్యక్తిగతీకరించిన సీటింగ్ సర్దుబాట్లను అనుమతిస్తుంది.
5. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్: సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కావలసిన క్యాబిన్ ఉష్ణోగ్రతను నిర్వహించడం లో సహాయపడుతుంది.

ఎక్సటీరియర్ ఫీచర్స్
వెల్‌కమ్ లైట్‌తో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్: అతుకులు లేని రూపాన్ని అందిస్తుంది మరియు అదనపు సౌలభ్యం కల్పిస్తుంది.
వాయిస్ కంట్రోల్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్: కారు‌ లోకి సూర్య కాంతిని అనుమతిస్తుంది, సులభంగా ఉపయోగించడం కోసం వాయిస్ ఆదేశాల ద్వారా ఆపరేట్ చేయవచ్చు.
సంజ్ఞ నియంత్రణతో పవర్డ్ టెయిల్‌గేట్: మన చేతులతో పని లేకుండా బూట్ ని సులభంగా తెరవడానికి సహాయపడుతుంది.
సౌకర్యవంతమైన లక్షణాలు
పుష్-బటన్ ప్రారంభంతో స్మార్ట్ కీ (PEPS): అదనపు సౌలభ్యం కోసం కీలెస్ ఎంట్రీ మరియు ఇంజిన్ స్టార్ట్‌ని ప్రారంభిస్తుంది.
రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు: వర్షం తీవ్రత ఆధారంగా వైపర్ వేగాన్ని స్వయంచాలకంగా సర్దుబాటు చేయండి.
వెనుక 60:40 స్ప్లిట్ సీట్లు: వివిధ అవసరాలకు అనుగుణంగా కార్గో మరియు సీటింగ్ ఏర్పాట్లలో సౌలభ్యాన్ని అందిస్తుంది.
స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలు: వీల్ నుండి చేతులు తీసుకోకుండా ఆడియో మరియు కాల్ ఫంక్షన్‌లకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది.




    అయితే ఈ టాటా EV అనేది మిగతా SUV లాగా కాకుండా అంటే ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి హుండాయ్ క్రెటా కానివ్వండి మరియు కియా సెల్టాస్ కానివ్వండి, వాటికి ఇది గట్టి పోటీ ఇచ్చే లాగా దీన్ని   లాంచ్ చేయడం జరిగింది. అయితే వాటితో పోలిస్తే ఇది ఒక యూనిక్ అంటే ప్రత్యేకమైన డిజైన్ కూపే డిజైన్ తో రావడం జరిగింది. ఇలా కూపే డిజైన్ తో లాంచ్ కావడం వల్ల దీనికి మరింత క్రేజ్ అనేది రావడం జరిగింది. ఇంకా దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొత్తగా చేసినటువంటి మార్పులు అన్ని తెలుసుకుందాం.

1. 12.3-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్: కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అందించే పెద్ద డిస్‌ప్లే ఈ సిస్టమ్‌ను కలిగి ఉంది.

LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు: ఆకర్షణీయమైన LED లైటింగ్ కార్ అందాన్ని మరింత పెంచుతుంది మరియు వాహనం యొక్క సమకాలీన సౌందర్యానికి జోడిస్తుంది. పలు రకాల డ్రైవింగ్మో మోడ్డ్ లు ఉన్నాయి (ఎకో, సిటీ, స్పోర్ట్): పనితీరు అవసరాల ఆధారంగా ప్రాధాన్య డ్రైవింగ్ మోడ్‌ను ఎంచుకోవడానికి డ్రైవర్‌ను అనుమతిస్తుంది.

ముందు డిజైన్ చూడడానికి టాటా నెక్సన్ లాగా ఉంది అని చాలామంది అనుకుంటారు నిజానికి ఫోటో లేదా వీడియో లో చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ డైరెక్ట్ గా కారు ని చూసినప్పుడు అలా అనిపించదు. ఈ రెండిటికీ చాలా తేడా అనేది ఉంటుంది చాలా మార్పులు మీరు గమనించగలరు. కారు ముందు భాగంలో ని కనెక్టింగ్ డి ఆర్ ఎల్ అనేది ఒకటి మాత్రం టాటా నెక్సన్ లో ఉన్నట్టుగానే దీంట్లో కూడా ఉంటుంది. కాకపోతే కింద ఇచ్చినటువంటి హెడ్ లైట్ హౌసింగ్ అనేది కొంచెం విభేదం గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ కారు యొక్క ముందు భాగం లోని గ్రిల్ కూడా చాలా కొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది, ఇంకా రెండు అల్ట్రాసోనిక్ పార్క్ పార్కింగ్ సెన్సార్ లు కూడా ఉంటాయి. ఇంకా ఈ కారు లెవెల్ 2 అడాస్ ఫీచర్ తో వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కెమెరా అనేది కారు యొక్క ముందు భాగంలో ని విండ్ షీల్డ్ పైన ఉంటుంది. ఇక పూర్తిగా గమనించిన తర్వాత ఫ్రంట్ డిజైన్ చూసినట్లయితే ఒక పర్ఫెక్ట్ ఎస్ యు వి డిజైన్ లాగా ఉంటుంది. టాటా CURVV నుంచి టాటా కంపెనీ తమ కారు యొక్క తాళం చెవి డిజైన్ ను కూడా మార్చేశారు, ఈసారి కారు తాళం చెవి కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మీద నాలుగు బటన్స్ ఉంటాయి అవి లాక్, అన్లాక్, బూట్ తెరవడానికి, లైట్ ఆన్ ఆఫ్ బటన్.

    ఈ కారు యొక్క సైడ్ డిజైన్ గురించి మనం మాట్లాడే కున్నట్లయితే టాటా నెక్సన్ తో పీల్చినట్లయితే టాటా నెక్సన్ అనేది ఒక సబ్ కంపాక్ట్ ఎస్ యు వి కాబట్టి అది నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. కానీ ఇది ఒక పర్ఫెక్ట్ ఎస్ యు వి కాబట్టి దీని యొక్క పొడవు అనేది టాటా నెక్సన్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాటా కర్వ్ పొడవు అనేది 4 మీటర్లకు పైగా ఉంటుంది. ఇంకా దీని యొక్క వీల్ బేస్ అనేది కూడా టాటా నెక్సన్ కంటే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 208 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కారు యొక్క టైర్స్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. 255/55 ఆర్ 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్దగా ఉంటుంది సైజులో, అలాగే డిజైన్ కూడా అందంగా ఉంటుంది.


    ఇంకా ఓ ఆర్ వి ఎం విషయానికి వచ్చినట్లయితే అది కూడా పెద్ద సైజులో ఉండడం జరుగుతుంది, దీనికి టర్న్ ఇండికేటర్ తో పాటు 360 డిగ్రీ కెమెరా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ కారు యొక్క డోర్ హ్యాండిల్స్ అనేది కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది, డోర్ హ్యాండిల్ పైన చిన్న లైట్ అనేది కూడా ఉంటుంది. డ్రైవర్ వైపు పాసివ్ కి లెస్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది, కానీ ప్యాసింజర్ సైడ్ మాత్రం ఈ ఫీచర్ అనేది లేదు కేవలం డ్రైవర్ వైపు మాత్రమే ఉంటుంది. ఇక సన్ రూఫ్ విషయానికి వస్తే పనోరమిక్ సన్ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కారు యొక్క అతి ముఖ్యమైన ఆకర్షణ డిజైన్ దీని యొక్క వెనుక డిజైన్ అని మనం చెప్పవచ్చు, ఇది చూడ్డానికి చాలా కొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది. చూడగానే అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మిగతా ఎస్ యు లతో పోల్చినట్లయితే దీని రియర్ డిజైన్ అంటే వెనుక భాగం యొక్క డిజైన్ అనేది కూపే డిజైన్ తో  ఉంటుంది.


    ఈ డిజైన్ అనేది మిగతా వాటితో పోల్చినప్పుడు ప్రత్యేకంగా అలాగే కొత్తగా కనిపిస్తుంది. కారు యొక్క పై భాగంలో యాంటీనా అనేది ఉంటుంది ఇది సిగ్నల్ రిసెప్షన్ కొరకు ఉపయోగపడుతుంది. ఇక ఇది కూపే డిజైన్ తో రావడం వల్ల ఈ కారు యొక్క వెనుక భాగంలో వైపర్ ఇవ్వవలసిన అవసరం అనేది ఉండదు ఎందుకంటే దాని యొక్క అవసరం పెద్దగా ఉండదు. కాబట్టి ఈ కారుకు ఇవ్వడం లేదు. కారు వెనుక భాగంలో కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది, అది చాలా ఆకర్షణీయంగా మరియు అందంగా ఉంటుంది. కారు అందాన్ని మరింత పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు కనెక్టింగ్ టైల్ లాంప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఇది రాత్రి వేళల్లో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక ఇవే టాటా కర్వ్ కారు యొక్క పూర్తి వివరాలు.


కొత్తది పాతది