కార్ కొనుగోలు చేసే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

 

కార్ కొనుగోలు చేసే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు





ఆలోచించి నిర్ణయం తీసుకోండి 


  

 కార్ కొనే ముందు మిమ్మల్ని మీరు అడగవలసిన ప్రశ్నలు నాకు నిజంగానే కార్ కావాలా ?, ఇప్పుడు ఈరోజు నాకు నిజంగానే కార్ కావాలా ?, ఇప్పుడు నాకు కార్ తో అవసరం ఉందా?, అని మిమ్మల్ని మీరు  ప్రశ్నించు కోవాలి, అప్పుడు మీ మనసే మీకు జవాబు చెబుతుంది. మీ మనసు అప్పుడు మీకు నిజంగానే కార్ కావాలి కార్ ఉంటేనే బ్రతకగలం, కార్ ఉంటేనే సంతోషంగా ఉండగలం, కార్ ఉంటేనే సౌకర్యంగ బ్రతకగలం, కార్ ఉంటేనే సంతోషంగా ఉంటాం కార్ ఉంటే మాతరమే డబ్బు వస్తది అని మీ మనసు మీకు చెప్పినట్టు అయితే కార్ కొనండి లేదంటే కార్ కొనకండి.


    చాలా మంది ఈ కాలంలో కారు కొనేవాళ్ళు సొసైటీ లో ప్రెస్టేజ్ మరియు  సోషల్ స్టేటస్ కోసమే కార్ కొనాలని నిర్ణయించు కుంటున్నారు అలాగే కొంటున్నారు కూడ. నిజానికి వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు వాళ్ళకి వల్లే గుంత తవ్వు కుంటున్నారు, వారికి వారే ఇబ్బందులని కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి నేను కార్ కొంటే నా బంధువులు మిత్రులు అందరు నా గురించి మాట్లాడుకుంటారు, ఆమ్మో! వీడు కార్ కొన్నాడు గ్రేట్, వీడు చాలా సంతోషం గా ఉన్నాడు, విడు చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడు బాగా రిచ్ అని అనుకుంటారు. ఇలా నా గురించి గొప్పలు చెప్పుకుంటారు అని బ్రహ్మపడి కార్ కొంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే మహా అయితే సమాజం మరియు మీ ముత్రులు ఒక పది రోజులు మీ గురించి ఆహా ఓహో అని మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు వదిలేస్తారు కానీ మీరు అలా కాదు అ కార్ కొనడంకి చేసిన అప్పును ఇబ్బందులు ఎదుర్కుంటూ తీర్చుకోవాలి. ఒకవేళ మీరు అప్పు చేసి కార్ కొంటే మాత్రం అ అప్పులు తీర్చడానికి మీకు సమయం సరిపోదు. మీ జీవితం మొత్తం  ఆ అప్పులు తీర్చడానికే సరిపోతుంది. మీరు ప్రశాంతంగా పడుకోలేరు కూడా ఎప్పడు ఏ అప్పులోడు ఇంటికివాడతాడో అని భయంతో గుండాల మీద చేయి వేసుకొని పడుకోవలసిన పరిస్థితి మీకు వస్తుంది.


    కారు కొనుగోలు చేసే ముందు, మొట్టమొదటిగా మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం : కార్ మీకు అవసరమా లేదా అది కేవలం లగ్జరీ కోసమా? ఈ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవడం కీలకం. మీకు కారు అవసరం అనిపిస్తే, మీ స్థోమత దృష్టిలో పెట్టుకొని, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పరిశీలించి, ఆలోచనతో కొనుగోలు చేయండి.


   కారు కొనుగోలు చేసే ముందు, మొట్టమొదటిగా మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం : కార్ మీకు అవసరమా లేదా అది కేవలం లగ్జరీ కోసమా? ఈ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవడం కీలకం. మీకు కారు అవసరం అనిపిస్తే, మీ స్థోమత దృష్టిలో పెట్టుకొని, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పరిశీలించి, ఆలోచనతో కొనుగోలు చేయండి.



    మీకు కారు లగ్జరీ అనిపిస్తే, లోన్ తీసుకోకుండా, మీకది కొనగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే కారు కొనడం ఉత్తమం. అలాగే, కారు మీకు లగ్జరీగా ఉన్నప్పటికీ, కారు ధర మీ పది నెలల జీతం కంటే తక్కువ లేదా దానికి సమానంగా ఉన్నప్పుడు తీసుకోవడం కూడా ఉత్తమమే. కారు ధర మీ పది నెలల జీతం కంటే ఎక్కువ ఉంటే, మీరు సైడ్ ఇన్కమ్ లేదా పాసివ్ ఇన్కమ్ ఉన్నపుడు కొనుగోలు చేయవచ్చు.

 అయితే, మీరు లోన్ తీసుకొని కొనుగోలు చేయాలనుకుంటే, అదనపు ఆర్థిక భారం తప్పదు, అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇతరులు కొన్నారని, సమాజంలో స్థాయి పెంచుకోవడానికి కారు కొంటే, మీరు మరియు మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కాబట్టి, కారు కొనుగోలు చేసే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

ఉదాహరణ :

అవసరం లేకుండా కారు కొన్నట్లయితే మీరు ఎదుర్కొనే కొన్ని సమస్యల గురించి వివరించడానికి ఒక చిన్న కథ.


    రాజు అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేసేవాడు. అతని నెల జీతం వచ్చేసి పాతిక వేలు ఉండేవి. వాళ్ళు హైదరాబాద్ లో ని కొత్తపేట లో ఒక ఇంట్లో రెంట్ కి ఉండేవారు, వారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవారు. ఒక రోజు ఉన్నటు ఉండి  వారి పై పోర్షన్  లో ఉండే రమేష్ అనే వ్యక్తి కార్ కొన్నాడు. ఆ కార్ కింద రాజు ఇంటి ఎదురుగా పార్క్ చేసేవాడు, రాజు రోజు ఆ కార్ ని చూసేవాడు. రాజు దెగ్గర ఒక డొక్కు ప్యాషన్  ప్రో బండి ఉండేది అతను రోజు ఆఫీస్ వెళ్లే తప్పుడు రమేష్ వల్ల కార్ ని చూస్తూ తన బైక్ పైన వెళ్ళేటప్పుడు మనసులో నేను ఎప్పడు కార్ కొంటానో ?, నేను ఎప్పడు ఈ డొక్కు బైక్ లో కాకుండా నా కొత్త కార్ లో ఆఫీస్ కి వెళ్తానో అని అనుకునేవాడు. ఇది ఇలా ఉండగా ఆఫీస్ లో తన మిత్రుడు కూడా కార్ కొన్నాడు. దీంతో రాజు ఇంకా బాధ పంచుకున్నాడు రోజు అయ్యో నా పై ఇంటివాడికి కార్ ఉంది నా పక్క టేబుల్ వాడికి కూడా కార్ ఉంది, నాకే కార్ లేదు అని అనుకునేవాడు. ఆఫీస్ లో కూడా అంత కారు కొన్న వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడేవారు అలాగే ఇంటికి వస్తే కూడా అంతే అందరూ రమేష్ కారు కొన్నాడు, రమేష్ కారు కొన్నాడు అనే వాళ్ళు. ఇది విని రాజు చాలా జెలసీ గా ఫీల్ అయ్యాడు. 


    రమేష్ కూడా నేను కార్ కొన్నాను అని అహంకారంతో మాట్లాడేవాడు. అతను రాజు తో మాట్లాడిన అప్పుడు నా కార్ ఇలా ఉంటది అలా ఉంటది, కార్ లో వెళ్తే కంఫర్ట్ వేరు, ఇంకా ఎన్ని రోజులు ఆ డొక్కు బండి లో ఆఫీస్ కి వెళ్తావ్ నువ్వు కూడా కార్ కొను సమాజంలో గౌరవం పెరుగుతుంది, ని స్టేటస్ పెరుగుతుంది అంటూ ఇలా మాట్లాడేవాడు. రాజు ఆ మాటలకు చాలా బాధపడేవాడు అలాగే చాలా కోపం కూడా వచ్చేది తనకి. సర్దుకొని ఆఫీస్ కి వెళ్ళేవాడు కానీ ఆఫీస్ లో కూడా తన పక్కన ఉన్న తన ఫ్రెండ్ కూడా రమేష్ లాగే సోది చెప్పేవాడు. పాపం రాజు, ఇంటికి వచ్చిన అదే సమస్య ఆఫీస్ కి వెళ్లిన అదే సమస్య. 


    ఇక ఒకరోజు రాజు కూడా కార్ కొందామని డిసైడ్ అయిపోయాడు అలా అనుకున్న వెంటనే రాజు తన స్నేహితుడితో చర్చించడం మొదలు పెట్టాడు ఏ కలర్ బాగుంటుంది దాని ఫీచర్స్ ఏంటి ఎంత ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని పలు రకాలుగా విచారిస్తాడు అన్ని వివరాలు తెలుసుకుంటాడు. కావలసిన వివరాలు తెలుసుకున్న తర్వాత రాజు ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య పిల్లలతో చర్చించడం మొదలుపెడతాడు. వారు తినే సమయంలో రాజు తన భార్యతో ఇలా అంటాడు, రేవతి నేను కూడా కార్ తీసుకున్నాం అనుకుంటున్నాను మన పై వారికి కారు ఉంది అలాగే ఆఫీస్ లో నా పక్కన కూర్చుండే నా ఫ్రెండ్ దగ్గర కూడా కారుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను వారితో పోల్చుకున్నప్పుడు నాకు నేను తక్కువగా అనిపిస్తుంది, నేను ఈ టెన్షన్ ని భరించలేకపోతున్నాను. ఇక నావల్ల కాదు రేవతి మనం కూడా కార్ తీసుకుందాం, నువ్వేమంటావ్?అని అనగానే, రేవతి వెంటనే ఏంటండీ ఏం మాట్లాడుతున్నారు మీరు? మన స్తోమతకు మనం ఉన్న పరిస్థితికి మనం కారు కొనడం అంత అవసరమా?, మన పిల్లల ఫీజులు కట్టాలి ఇంకా ఇంటి ఖర్చులు, ఇంకా రెంటు, ఇవన్నీ పోగా మనకు మిగిలేవి ఒక ఐదు ఎనిమిది వేలు. ఈ డబ్బుతో కారు కొందామని ఎలా అనుకుంటున్నారు అండి మనకి అవసరమా?.  మీ ఫ్రెండ్స్ కి డబ్బు ఉంది వారికి స్తోమత ఉంది కాబట్టి వారు కొనుక్కున్నారు వాళ్లకి ఉండి అని మనం కూడా కొనుక్కుంటే మన స్తోమతకు మించి అది మనకు బరువవుతుంది తర్వాత మనం చాలా ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మాట విని ఆ ఆలోచన మానుకోండి అని సూచిస్తుంది. 


    సరే అని అంటాడు రాజు కానీ అతని మనసులో కార్ కావాలన్న ఆలోచన అనేది అసలు తగ్గదు. ఏమాత్రం కూడా ఇంకా తన భార్యకు చెప్పకుండా ఒకరోజు తను కూడా వెళ్లి అప్పుచేసి లోన్ తీసుకొని మరి ఒక కారు తీసుకుని ఇంటికి వస్తాడు వచ్చి తన భార్య పిల్లలను బయటకు పిలిచి సర్ప్రైజ్ అని చెప్పి ఆ కార్ చూపిస్తాడు. రేవతి వెంటనే ఏంటండీ మీరు ఇలా చేశారేంటి, వద్దని చెప్పాను కదండీ, అని అడుగుతుంది దానికి రాజు, నువ్వు అదంతా ఆలోచించకు అదంతా నేను చూసుకుంటాను. ముందు ఇది చెప్పు మన కొత్త కాదు ఎలా ఉంది బాగుందా అని అడుగుతాడు. దానికి రేవతి బావుంది అని చెబుతుంది. తర్వాత రాజు వాళ్ళ పిల్లల్ని భార్యను తీసుకుని గుడికి వెళ్లి కార్ కి పూజ చేయించుకొని ఇంటికి వచ్చి సంతోషంగా ఉంటారు. రాజు కొన్ని రోజులు ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు. తన స్నేహితులు సమాజం అందరూ కూడా రాజు కారు కొన్నాడు రాజు కారు కొన్నాడు అని గొప్పగా చెబుతారు, ఇవన్నీ విని రాజు కూడా మురిసిపోతాడు. ఇలా ఉండగా ఒక నెల గడిచిపోతుంది ఆ తర్వాత లోన్ అప్పుకి వడ్డీ కట్టే సమయం దగ్గర పడుతుంది కానీ రాజుకి వచ్చిన జీతం డబ్బులతో తన ఇంటి రెంటు కట్టడానికి పిల్లల ఫీజులకి మరియు కార్ మెయింటెనెన్స్ ఇంకా ఇంటి ఖర్చులకు చాలావరకు అయిపోతాయి ఇక లోన్ కట్టడానికి గాని అప్పును చెల్లించడానికి గాని తన దగ్గర ఎలాంటి డబ్బు ఉండదు. ఎలాగో అలాగా మొదటి రెండు నెలలు తన దగ్గర ఉన్న సేవింగ్స్ తో లోన్ మరియు అప్పులు కి వడ్డీ కడతాడు.


    కానీ తర్వాత కట్టడానికి తన దగ్గర డబ్బు ఉండదు కాబట్టి తను అప్పు తీసుకున్న వారి దగ్గర వడ్డీ కట్టడం మానేస్తాడు, అలాగే బ్యాంకులో తీసుకున్న లోన్ కూడా కట్టడం ఆపేస్తాడు. దీంతో ఒక మూడు నెలలు తర్వాత బ్యాంకు నుంచి అధికారులు  ఇంటికి వచ్చి రాజు ని ఇబ్బంది పెడతారు లోన్ కట్టమని. అలాగే అప్పు ఇచ్చిన వారు కూడా ఇంటికి వచ్చి రాజు ని అవమానించడం మొదలు పెడతారు. నీకెందుకురా కార్ నీ స్తోమతకు కారు అవసరమా మర్యాదగా డబ్బులు కట్టు లేదంటే నీ కారు తీసుకుని వెళ్ళిపోతాం అంటూ బెదిరించడం మొదలు పెడతారు. అటు బ్యాంకు అధికారులు కూడా వీలైనప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటారు, దీంతో రాజు ప్రశాంతతను కోల్పోతాడు ప్రశాంతంగా నిద్రపోడు, తినలేడు, చాలా టెన్షన్ పడుతూ బాధతో ఉంటాడు.


    ఇలా రోజు అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవ చేస్తూ అవమానిస్తూ ఉంటారు.  అలాగే బ్యాంక్ అధికారులు  నోటీసులు పంపుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ రాజు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తూ రాజు భార్య కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది రాజు తన భార్య దగ్గరకు వెళ్లి ఏమి చేయాలి అని అడిగినప్పుడు తన భార్య రేవతి తనతో ఇలా ఉంటుంది , మీకు ముందే చెప్పానండి వద్దు మనకు కారు అని మీరు నా మాట వినలేదు ఇప్పుడు చూడండి దీనివల్ల మీరు మీ ప్రశాంతతను కోల్పోయారు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ప్రశాంతంగా తినలేక పోతున్నారు కనీసం ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు కూడా. ఒకప్పుడు మీరు లగ్జరీగా లేకుండా కనీసం సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరు మీ సంతోషాన్ని కోల్పోయారు.


    అప్పుడు రాజు నన్ను క్షమించు రేవతి నేను చేసింది తప్పే ఇప్పుడు నేను దీన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. అని అనగానే రేవతి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో వెళ్లి తన బంగారాన్ని తీసుకువచ్చి రాజుకి ఇస్తుంది. ఇదిగోండి ఈ బంగారాన్ని తీసుకువెళ్లి తాకట్టు పెట్టి వచ్చే డబ్బుతో అప్పు కట్టేయండి అలాగే కార్  కూడా అమ్మేసి ఆ డబ్బుతో లోన్  కట్టేసుకోండి. రాజుకి అలా చేయడం ఇష్టం లేదు కానీ చేయక తప్పడం లేదు.  అతను ఉన్న పరిస్థితుల్లో ఇంతకుమించి చేయగలిగిన దంటు ఏమీ లేదు కాబట్టి రాజు తన భార్య బంగారాన్ని తీసుకువెళ్లి తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బుతో బ్యాంకు లోన్ కట్టివేస్తారు, ఆ తర్వాత కారుని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అప్పులు కట్టేసి ఇక తన పాత బండితోనే కొనసాగిస్తాడు. 


    చదివారు కదా రాజు పరిస్థితి ఎలా ఉందో అని కాబట్టి మీరు కూడా మీ స్తోమతకు మించి మీకు అవసరం లేకున్నా కూడా కారు కొంటే మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి మీకు రావచ్చు కాబట్టి కారు కొనేముందు మీరు నిజంగా మీకు అవసరం ఉందో లేదో మీరు తీసుకున్న అప్పులు మీరు చెల్లించ గలరో లేదో అన్ని దృష్టిలో పెట్టుకొని కారు  తీసుకోవాలని చెప్పడానికి ఈ కథ.



    


కొత్తది పాతది