వాహన చక్రాలు : కర్ర చక్రాల నుండి సింధటిక్ చక్రాల వరకు జరిగిన మార్పులు మరియు అభివ్రుద్ది

  

వాహన చక్రాలు : కర్ర చక్రాల నుండి సింధటిక్ చక్రాల వరకు జరిగిన మార్పులు మరియు అభివ్రుద్ది


ప్రస్తుతం అనేక రకలైన కారు చక్రాలను తయారు చేస్తున్నారు. మారుతున్న సాకెంతిక పరిజ్ణానం ప్రకారంగా కారు చక్రల తయారీ మరియు రూపకల్పనలో అనేక మార్పులతో వస్తున్నాయి. పౌరణిక సినిమాలలో రథ చక్రలను మనం అధ్యాయనం చేస్తే అవి కర్రల తో రూపొందించి ఇనుము సహయం తో వాటిని ఆయా రథచక్రలకు బిగిస్తుంటారు. ఇటువంటి కర్ర చక్రలను మనం ఇప్పటికి వ్యవసాయనికి వినియోగించే ఎడ్ల బండ్లకు , గుర్రపు బగ్గీలకు అమర్చుతుంటారు. 

                       ప్రాచీన నాగరికత ల యొక్క అభివ్రుద్ది ఈ కర్ర చక్రల పై ఆధారపడి ఉంటుందని మనం తెల్సుకొవచ్చు. ఆయా కాలం లో అక్కడున్న పౌరులు చేసిన వ్యవసాయ మరియు పారిశ్రామిక ఉత్పత్తులను ఓక ప్రదేశం నుండి మరోక ప్రదేశనికి చేరవేసి ఆర్థిక ప్రగతి కి దోహదపడ్డాయి. ఎప్పుడైతే రబ్బరు తోటలు మరియు వాటితో చక్రలను ఉత్త్పత్తి చేయాటం ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి వాహనల తయారీ లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. 








వాహనాల తయారీ లో రబ్బర్ లభ్యత స్రుష్టించిన విప్లవాత్మక మార్పులు మరియు అభివ్రుద్ధి :

    రవాణ సౌకర్యలు అభివ్రుద్ది చెందుతున్న కొలది వాహన చక్రల లో తగిన మార్పులు చేయటం తప్పనిసరి. ఆ మార్పులు చేయాటనికి అనేక రకలైన సాంకేతికత మార్కేట్ లో అందుబాటు లోకి వచ్చాయి. 19 వ శతాబ్దపు మధ్య కాలం లో రబ్బర్ వినియోగం ప్రారంభమైంది. 1845 వ సంవత్సరం లో మొదటిసారిగా రాబర్ట్ థామ్సన్ అనే వ్యక్తి పైయింటేడ్ న్యూమరిక్ చక్రల ను తయారు చేసి అందులో గాలి ని నింపి చక్రలుగా వాడడు. ఆ సమయం లో ఆయన కర్ర తో చేసిన చక్రాలు తో వాటిని పోల్చినప్పుడు ఇవి ఓకింత సులువుగా మరియు లాభదాయకంగ ఉందన్న విషయన్ని గ్రహించారు. గాలి తో నింపిన రబ్బర్ చక్రాలు ,కర్ర చక్రలతో పోల్చినప్పుడు రహాదారుల పై ఎటువంటి కష్టం లేకుండా ఎత్తు పల్లాలను తట్టుకొని ఉండటం తత్ఫలితంగ వాహన చోదకులకు సౌకర్యవంతంగా ఉండటం గమనించారు. ఇలా 1888 వరకు రాబర్ట్ థామ్సన్ చక్రలను వాడారు. బ్యోడ్ డన్లోప్ అనే వ్యక్తి తన కోడుకు యొక్క మూడు చక్రాల వాహానలకు అమర్చటానికి ఆధునిక రబ్బర్ చక్రలను అమర్చారు. అది అప్పట్లొ ఒక విధమైన విప్లవాత్మక మార్పులను స్రుష్టించింది. కాలక్రమేణ ఆ రబ్బర్ చక్రలకు రోడ్లు మరియు వాహనపు బరువులకు అనుగుణంగ తయారు చేసారు. 

1970 మరియు 1980 లో రబ్బర్ చక్రల తయారీలో వచ్చిన భారీ మార్పులు మరియు అభివ్రుద్ది :

    1970 నుండి 1980 మధ్య కాలం లో రబ్బర్ చక్రాల తయారీ లో స్రుజానత్మకా మార్పులు సంభవించాయి.ఇదే కాలం లో అనేక రకాల కార్లు, రేసింగ్ వాహానాలు , ఇతర పెద్ద సైజు వాహానాలు తయారు చేసారు. వాహనాల బరువు , వాహనాల వేగం, ఇంధన ఆదా  మరియు రోడ్లు యొక్క స్థితి గతులను  ద్రుష్టి లో ఉంచుకొని రబ్బర్ చక్రాల ఉత్త్పత్తిదారులు రబ్బర్ చక్రాలను ఉత్పత్తి చేసారు. అందుకు క్రొత్త సాంకేతిక ను వినియోగించుకున్నారు. 

             రబ్బర్ చక్రాల ఉత్త్పత్తి కి సంభందించిన సాంకేతికలో నైలాన్ మరియు పాలిస్టార్ కాడ్ ల తో తయారు చేసిన రేడియల్ చక్రాలు కనుగొనడం ఓకింత విజయవంతమైన ఆవిష్కరణ గా చెప్పుకోవచ్చు. ఈ రకమైన చక్రాలు మన్నిక తో పాటుగా అత్యంత నాణ్యమైనవి గా ఉండేవి. వీటికి ఉన్న గ్రిప్ లు రోడ్డూ కు మరియు చక్రల మధ్య ఉన్న ఘర్షణ ను తట్టుకొని అత్యధిక వేగం తో  రక్షణతో  వాహానాలు ప్రయాణించటానికి సులువగా ఉన్నాయి. 

              ఈ రేడియాల్ రబ్బర్ చక్రాలను కనుగోనటం మూలన ఇది ప్రపంచ వ్యాప్తంగా రవాణ నమూన లో అనేక విప్లవాత్మక మార్పులను వచ్చాయి. అనేక వాహన చక్రాల ఉత్త్పత్తి దారులు అనేక నమూనల పై పరిశోధనలు చేసి వాతవారణ పరిస్థితుల ప్రభావం చేత మార్పు చెందే రహాదారులకు అనుగుణాంగ వాహన చక్రాలను రూపొందించటం ప్రారంభించారు. ఏడారి ప్రాంతం లో ఓక విధమైన, మంచుకొండ ప్రాంతలలో మరోక విధంగా రూపొందించటం జరిగింది. 

1990 సంవత్సరం లో రబ్బర్ చక్రాల తయారీ లో సంభవించిన మార్పులు మరియు అభివ్రుద్ధి:

          ఈ సంవత్సరం నుండీ రబ్బర్ చక్రాల తయారీ లో సాంకేతికంగా ఓక అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు.  రబ్బర్ చక్రల తయారీకి వినియోగించే పదార్థలలో మార్పులు మరియు తయారీ మెలుకువలలో అనేక మార్పులు సంభవించాయి. అందులో ముఖ్యమైనది సింథిటిక్ రబ్బర్ చక్రాల /సింధటిక్ వాహన చక్రాల తయారీ. ఈ సింథటిక్ వాహన చక్రాలు ఆ చక్రాల యొక్క నాణ్యత మరియు వాటి యొక్క నాణ్యత కాలన్ని పెంచుతుంటాయి. వాహన చక్రాలు తిరిగినప్పుడు అవి త్వరగా అరిగి పోకుండా ఇంధన పొదుపు కి అనుకూలంగా ఉండే విధంగా ఆయా చక్రాలను తయారు చేసినప్పుడు సిలికా అనే పదార్థన్ని వాడారు. ఇది కూడా చాలా వరకు వాహన చక్రాల తయారీ లో అనుకూలమైన మార్పులను తీసుకొని వచ్చింది. 

          క్యాడ్(CAD) పరిజ్ణానన్ని వినియోగించుకొవటం వలన వాహన చక్రాలను రూపొందిడానికి ముందే ప్రోటోటైప్ ని రూపొందించి ఆయా దేశాల రహాదారుల స్థితిగతులను బట్టి వాటిలో తగు మార్పులు చేసుకొనే అవకాశం లభించింది. ఆ తర్వాత రెడ్ ఫ్లాట్ చక్రాలు పంక్చార్ అయిన కూడ అవి రహదార్ల పై నడుస్తుంటాయి. వీటిని కూడ 1990 సంవత్సరాల మధ్య కాలం లోనే రూపొందించారు. 

21 వ శతాబ్దపు మొదటి కాలం లో రబ్బర్ చక్రల తయారీ లో సాధించిన అభివ్రుద్ధి మరియు సంభవించిన మార్పూలు :

21 వ శతబ్ధపు కాలం అనేది ఆధునిక సాంకేతిక రంగం లో అత్యంత అభివ్రుద్ది చెందిన కాలం గా పరిగణించవచ్చు. ఈ కాలం లో ఉత్పత్తి చేసిన రబ్బర్ చక్రాలు మన్నిక , నాణ్యత మరియు రక్షణ ఇంతకు ముందు తయారు చేసిన వాహన చక్రాల కన్న ఎక్కువగా ఉండేవి. ఈ రబ్బర్ వాహన చక్రలను ఆధునాతన వాహనలకు , ఎలక్ట్రిక్ వాహనలకు మరియు స్పోర్ట్స్ కార్ల లో వినియోగిస్తున్నారు. 1990 తో పోలిస్తే ఈ వాహన చక్రాలకు  సెన్సర్ల ను  అనుసంధించి వాతవరణ , రహాదార్ల పరిస్థితులకు అనుగుణాంగ వాహానలు పాడవకుండ వినియోగిస్తుంటారు. ఈ సెన్సర్ వినియోగం వల్ల అనేక పరిస్థితుల యొక్క అలర్ట్ లను వాహనాదారులకు/వాహన చోదకులకు సమాచరం అందుతుంది. ఈ ఎలక్ట్రికల్ వాహనల తయారీ లో ఇంధనపు పొదుపు అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంధన పోదుపులో ఈ సెన్సర్ లు ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. 
    వీటి తో పాటు సెల్ఫ్ హీలింగ్ చక్రాలు  పంక్చర్ల సమస్య లేకుండా చూస్తాయి.  గాలి లేని వాహన చక్రాలు టైర్ల పొరలు అరగకుండా చూస్తాయి.

                   మనం ఓక్కసారి వాహన చక్రాల పుట్టుక నుండి ప్రస్తుత స్థితి వరకు అధ్యయనం చేస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఓకప్పుడూ కర్ర తో చేసిన వాహన చక్రాలు విరిగి పోతే  వాహన రాకపోకలకు అంతరాయం కలిగి మానవుని దైనందన జీవనం లో అనేక మార్పులు సంభవించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుత సాంకేతిక మార్పుల మూలన రవాణ అంతరాయం లేకుండా కొనసాగుతుంది. దానితో పాటుగా నాణ్యత మరియు మన్నిక పెంపొందింది.


కొత్తది పాతది